Mumbay
-
ఔను...వీళ్ళిద్దరూ ఇష్టపడ్డారు
సాక్షి, ముంబై: యావత్మాల్లో స్వలింగ సంపర్క (గే) వివాహం జరిగింది. స్థానిక ప్రముఖ పుస్తక విక్రేత తనయుడు ఇండోనేషియ యువకుడితో ఇటీవల పెళ్లి చేసుకున్నాడు. మహారాష్ట్రలోని యావత్మాల్లోని ఓ విలాసవంతంమైన హోటల్లో ఈ పెళ్లి తంతు జరిగింది. గత ఏడాది డిసెంబర్ 30వ తేదీని ఈ స్వలింగ సంపర్క వివాహం జరిగినట్లు తెలుస్తున్నది. ఈ విషయం బయట ఎక్కడ పొక్కకుండా ఎంతో జాగ్రత్త పడ్డారు. ఈ పెళ్లికి తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించడంతో కేవలం దగ్గరి బంధువులను మాత్రమే ఆహ్వానించారు. కాగా వారిని ఒప్పించి మరీ పెళ్లి చేసుకోవడం చర్చనీయంశంగా మారింది. పెళ్లికి ముందు హిందు సంప్రదాయం ప్రకారం ఇరువురికి పసుపు రాయడం, ఇతర తంతు పూర్తి చేశారు. బయట వ్యక్తులెవరు లోపలికి రాకుండా, బంధువుల్లో కూడా ఎవరు ఫొటోలు, వీడియో తీయకుండా నిఘావేసినప్పటికీ ఓ ఫోటో వైరల్ కావడంతో బయట ప్రపంచానికి తెలిసింది. యావత్మాల్కు చెందిన 40 ఏళ్ల హృషి మోహన్‌కుమార్ సత్వానే అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. కుటుంబసభ్యులు, స్నేహితుల ఆశీస్సులతో అతను పెళ్లి చేసుకున్నాడు. ఇండోనేషియాకు చెందిన విన్ను తన భాగస్వామిగా మార్చుకున్నాడు. హృషి మోహన్‌కుమార్ బాంబే ఐఐటీ నుంచి బీటెక్ పూర్తి చేశాడు. ఇతను అమెరికాలో గ్రీన్ కార్డు హోలర్డ్. మొదట్లో అతని పేరెంట్స్ గే మ్యారేజ్‌కు అంగీకరించలేదు. కానీ చివరకు పెళ్లికి ఓకే చెప్పేశారు. -
ముంబైలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున లోయర్ పరేల్‌లోని శివశక్తి ఇండస్ట్రీయల్ స్టేట్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మూడంతస్తుల బిల్డింగ్‌లోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఘటనాస్థలికి చేరుకున్న 8 ఫైరింజన్లు మంటలను అదుపు చేశాయి. ఈ సంఘటనలో భారీ ఆస్తినష్టం జరిగింది. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. -
థర్టీ ఫస్ట్ వేడుకలకు ప్రత్యేక లోకల్ రైళ్లు
సాక్షి, ముంబై: నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఉప నగరాలు, శివారు ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే సందర్శకుల సౌకర్యార్థం ఆదివారం అర్థరాత్రి నుంచి ప్రత్యేక లోకల్ రైళ్లు నడపాలని సెంట్రల్, పశ్చిమ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో పిల్ల పాపలు, ఇతరు కుటుంబ సభ్యులతో ముంబైకి వచ్చే సందర్శకులకు ఎంతో ఊరట లభించింది. ఏటా థర్టీ ఫస్ట్ రోజున సరదాగా, ఆహ్లాదంగా గడిపేందుకు నగరంలోని గేట్ వే ఆఫ్ ఇండియా, మెరైన్ డ్రైవ్, చర్చిరోడ్ చౌపాటి, సీఎస్ఎంటీ, చర్చిగేట్ తదితర ప్రాంతాలకు ఉప నగరాలతోపాటు శివారు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం వస్తారు. డిసెంబరు 31 అర్థరాత్రి 12 గంటలు కాగానే నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఆ తరువాత కొద్దిసేపు సంతోషంగా గడిపి తిరిగి ఇళ్లకు తిరుగుముఖం పడతారు. కాని అర్థరాత్రి దాటిన తరువాత లోకల్ రైళ్లు ఉండవు. దీంతో తెల్లవారుజాము వరకు ప్లాట్పారాలపైనే పడిగాపులు కాయాల్సి ఉంటుంది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పశ్చిమ రైల్వే ఎనిమిది, సెంట్రల్ రైల్వే నాలుగు ప్రత్యేక లోకల్ రైళ్లు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక లోకల్ రైళ్ల వివరాలు 31వ తేదీన ... విరార్ నుంచి అర్థరాత్రి 12.15, 12.45, 1.40, 3.05 గంటలకు చర్చిగేట్‌కు లోకల్ రైలు బయలు దేరుతుంది. చర్చిగేట్ నుంచి 1.45, 2.00, 2.30, 3.25 గంటలకు విరార్ దిశగా ఇలా ఎనిమిది లోకల్ రైళ్లు నడపనున్నారు. సెంట్రల్ రైల్వే మార్గంలో సీఎస్ఎంటీ నుంచి 1.30 గంటలకు, కల్యాణ్ నుంచి 1.30 గంటలకు, హార్బర్ మార్గంలో సీఎస్ఎంటీ నుంచి 1.30 గంటలకు, పన్వేల్ నుంచి 1.30 గంటలకు... ఇలా నాలుగు లోకల్ రైళ్లు అందుబాటులో ఉంటాయి. -
ఆత్మహత్యల నగరం ముంబై
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక నగరమైన ముంబైలో ఆత్మహత్మ కేసులు పెరిగినట్లు ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. గత సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 17,195 మంది ఆత్మహత్య చేసుకోగా అందులో ఒక్క ముంబైలోనే 1,205 మంది ఉన్నట్లు రాష్ట్ర నేర అన్వేషణ విభాగంలో నమోదైన గుణంకాలను బట్టి తెలిసింది. రాష్ట్రంలోని వివిధ నగరాలతో పోలిస్తే ముంబైలోనే అధికంగా అత్మహత్య కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో జరిగిన మొత్తం 17,195 ఆత్మహత్యల్లో 12,877 పురుషులుండగా 4,315 మహిళలు, ముగ్గురు హిజ్రాలున్నారు. అదేవిధంగా ముంబైలో చేసుకున్న మొత్తం 1,205 ఆత్మహత్యల్లో 808 పురుషులుండగా 396 మహిళలు, ఒక హిజ్రా ఉన్నారు. కాగా ఆత్మహత్య చేసుకున్న వారిలో ముఖ్యంగా జీవితంపై విరక్తి, కుటుంబ కలహాలు, వ్యాపారంలో నష్టం, దీర్గకాలిక వ్యాధితో బాధపడడం తదితర కారణాలున్నాయి. నగరంతో పోలిస్తే ఉప నగరాలలోనే ఆత్మహత్య కేసులు ఎక్కువ నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది. మలాడ్, గోరేగావ్, శివాజీనగర్, గోవండీ, బోరివలి, విక్రోలి తదితరా ఉప నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఆత్మహత్య చేసుకున్న వారిలో పిల్లలు కూడా ఉండడం గమనార్హం. ముంబై తరువాత పుణేలో ఏకంగా 945 మంది ఆత్మహత్య చేసుకున్నారు. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై: స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిసాయి. బుధవారం భారీ లాభాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు ముగింపు దశలో నష్టాలను చవిచూశాయి. 315 పాయింట్లతో 29,909 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 213 పాయింట్ల నష్టంతో 29,380 వద్ద ముగియగా, 73 పాయింట్లు కోల్పొయిన నిఫ్టీ 8,922 వద్ద ముగిసింది. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై: స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమైనా , మధ్యాహ్నానికి దాదాపు అన్ని షేర్లూ నష్టాల్లోకి జారుకున్నాయి. ఆటో షేర్ల ఫాల్ మార్కెట్ ను ప్రభావితం చేస్తోంది. రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్ట బోయే బడ్టెట్ మార్కెట్ పై ప్రభావాన్ని చూపెడుతోంది. . 78 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్, 24 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ట్రేడ్ అవుతున్నాయి. -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 49.19 లాభంతో 29,057 దగ్గర నిఫ్టీ 11.75 పాయింట్ల లాభంతో 8,779 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్, ఆటో షేర్లలో బైయింగ్ ట్రెండ్ , ఎఫ్ఎంసీజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్ట బోయే బడ్టెట్ మార్కెట్ పై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.