
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై: స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిసాయి. బుధవారం భారీ లాభాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు ముగింపు దశలో నష్టాలను చవిచూశాయి.
315 పాయింట్లతో 29,909 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 213 పాయింట్ల నష్టంతో 29,380 వద్ద ముగియగా, 73 పాయింట్లు కోల్పొయిన నిఫ్టీ 8,922 వద్ద ముగిసింది.