Sensex up
-
భారీ నష్టాల్లోంచి లాభాల్లోకి..
ముంబై: భారీ నష్టాల నుంచి పుంజుకున్న స్టాక్ సూచీలు సోమవారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ట్రేడింగ్‌లో 798 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ చివరికి 112 పాయింట్లు పెరిగి 72,776 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 234 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ ఆఖరికి 49 పాయింట్లు బలపడి 22,104 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.., మిడ్ సెషన్ తర్వాత కోలుకున్నాయి. ముఖ్యంగా అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టీవీఎస్ షేర్లు ఒక శాతానికి పైగా రాణించడంతో పాటు సూచీల రికవరీకి తోడ్పాటు అందాయి. సరీ్వసెస్, రియలీ్ట, ఫార్మా, పారిశ్రామికోత్పత్తి, కమోడిటీస్, బ్యాంకింగ్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. కన్జూమర్, టెలికమ్యూనికేషన్, యుటిలిటీస్, ఆటో షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లోకి ట్రేడవుతున్నాయి. ⇒ క్యూ4 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో టాటా మోటార్స్ షేరు ఎనిమిది శాతానికి పైగా నష్టపోయి రూ.960 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 9.44% క్షీణించి రూ.948 వద్ద నిలిచింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.29,016 కోట్లు కోల్పోయి రూ.3.19 లక్షల కోట్లకు దిగివచ్చింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో అత్యధికంగా నష్టపోయిన షేరు ఇదే. హెల్త్‌కేర్ టెక్ సంస్థ ఇండిజెన్ లిస్టింగ్ సక్సెస్ అయ్యింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.452)తో పోలిస్తే 45% ప్రీమియంతో 660 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో ఆరంభ లాభాలను కోల్పోయి 26% లాభంతో రూ.571 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.13,614 కోట్లుగా నమోదైంది. -
వరుస నష్టాలకు బ్రేక్
ముంబై: స్టాక్ సూచీలు వరుస నష్టాల నుంచి కోలుకున్నాయి. ఎన్నికల అప్రమత్తత, విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి, ద్రవ్యోల్బణం వంటి ప్రతికూలతలున్నా.., అధిక వెయిటేజీ రిలయన్స్, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్ షేర్ల రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి. ఫలితంగా శుక్రవారం సెన్సెక్స్ 260 పాయింట్లు లాభపడి 72,664 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 22,055 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ఇటీవల మార్కెట్ పతనంతో కనిష్టాలకు దిగివచి్చన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. లండన్ మెటల్ ఎక్సే్చంజీలో బేస్ మెటల్ ధరలు అనూహ్యంగా పెరగడంతో మెటల్ షేర్లకు డిమాండ్ నెలకొంది. అలాగే యుటిలిటీ, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, కమోడిటీ, టెలికం, ఆటో షేర్లు రాణించాయి. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 542 పాయింట్లు ఎగసి 72,947 వద్ద, నిఫ్టీ 174 పాయింట్లు బలపడి 22,131 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. మరోవైపు ఐటీ, బ్యాంకులు, టెక్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా ఆర్థిక గణాంకాలు ఆర్థిక ఫలితాలపై ఆశావహ అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. కాగా, ప్రతి రెండు షేర్లకు ఒక షేరు బోనస్ ప్రకటించడంతో బీపీసీఎల్ షేరు 4.5% లాభపడి రూ.619 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 5% పెరిగి రూ.622 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
బుల్ బౌన్స్‌బ్యాక్
ముంబై: మూడు రోజులుగా అమ్మకాల ఒత్తిడితో తడబడిన బుల్ శుక్రవారం లాభాల బాటలో దూసుకెళ్లింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూలతలను ఆసరాగా చేసుకొని ఇన్వెస్టర్లు ద్రవ్యోల్బణ భయాలను విస్మరించి కొనుగోళ్లు చేపట్టారు. ఇటీవల మార్కెట్ పతనంతో కనిష్టాలకు దిగివచ్చిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్సుల్లో షార్ట్ కవరింగ్ చోటుచేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు దిగిరావడం, ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల రికవరీ అంశాలు కలిసొచ్చాయి. ఇండెక్సుల్లో అధిక వెయిటేజీ షేర్లైన ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్‌లు మూడు శాతం మేర రాణించి సూచీల రికవరీకి తోడ్పడ్డాయి. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీలు అంతుకు ముందు కోల్పోయిన కీలకమైన 60వేలు, 18వేల స్థాయిని తిరిగి అందుకున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంక్స్, మీడియా షేర్లు మాత్రమే స్వల్ప నష్టాలను చవిచూశాయి. మిగతా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల పర్వం కొనసాగడంతో సెన్సెక్స్ 767 పాయింట్లు పెరిగి 60,687 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 229 పాయింట్లు లాభపడి 18,103 వద్ద నిలిచింది. ఈ ముగింపు స్థాయిలు సూచీలకు రెండు వారాల గరిష్టం కావడం విశేషం. సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లకు గానూ ఐదు షేర్లు మాత్రమే నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.511 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.851 కోట్ల షేర్లను కొన్నారు. సూచీల భారీ ర్యాలీతో ఇన్వెస్టర్లు రూ.2.77 లక్షల కోట్ల సంపదను సొంతం చేసుకున్నారు. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 619 పాయింట్లు, నిఫ్టీ 186 పాయింట్లు లాభపడ్డాయి. నిరాశపరిచిన ఫినో పేమెంట్స్ బ్యాంక్... లాభాల మార్కెట్లోనూ ఫినో పేమెంట్స్ బ్యాంక్ లిస్టింగ్ నిరాశపరిచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర రూ.577 కాగా.., రూ.548 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 11 శాతం వరకూ పతనమై రూ.534 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి ఐదున్నర శాతం నష్టంతో రూ.545 వద్ద ముగిసింది. బీఎస్ఈ ఎక్సే్చంజ్‌లో 6.24 లక్షల షేర్లు చేతులు మారాయి. మార్కెట్ విలువ రూ.4,537 కోట్ల వద్ద స్థిరపడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► విదేశీ పెట్టుబడులకు ప్రామాణికంగా భావించే ఎంఎస్సీఐ ఇండెక్స్‌లో చోటు దక్కించుకోవడంతో జొమాటో షేరు ఇంట్రాడేలో పది శాతం పెరిగి రూ.155 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. చివరికి రూ.153 వద్ద ముగిసింది. ► విమాన ప్రయాణికుల రద్దీ అక్టోబర్‌లో పెరగడం ఇండిగో షేరుకు కలిసొచ్చింది. బీఎస్ఈ లో ఏడు శాతం లాభంతో రూ.2305 వద్ద స్థిరపడింది. ఏకంగా 929.57 కోట్ల షేర్లు చేతులు మారినట్లు ఎక్సే్చంజీ గణాంకాలు తెలిపాయి. ► నైకా షేరుకు డిమాండ్ తగ్గడం లేదు. ఇంట్రాడేలో తొమ్మిది శాతం పెరిగి రూ.2410 వద్ద ఆల్ టైం హైని నమోదుచేసింది. చివరికి ఆరుశాతం లాభంతో రూ.2359 వద్ద స్థిరపడింది. -
రికార్డుల హోరు
ముంబై: ఇంధన, మౌలిక, బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సోమవారమూ సూచీల రికార్డుల ర్యాలీ కొనసాగింది. ఇంట్రాడేలో వెలువడిన అక్టోబర్ నెల టోకు, రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు ఇన్వెస్టర్లను మెప్పించగలిగాయి. అలాగే రూపాయి బలపడడం, కొనసాగిన విదేశీ పెట్టుబడుల నుంచి కూడా సానుకూల సంకేతాలు అందాయి. ఫలితంగా సెన్సెక్స్ 154 పాయింట్ల లాభంతో 46,253 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి 13,558 వద్ద ముగిసింది. ఈ స్థాయిలు సూచీలకు కొత్త జీవితకాల గరిష్టాలు కావడం విశేషం. మరోవైపు ఆటో, రియల్టీ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 46,373 వద్ద గరిష్టాన్ని, 45,951 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ సైతం 13,597–13,472 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నగదు విభాగంలో సోమవారం ఎఫ్ఐఐలు రూ.2,264 కోట్ల షేర్లను కొనగా, దేశీయ ఫండ్స్ (డీఐఐ) రూ.1,721 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీశారు. ఇక డాలర్ మారకంలో రూపాయి 9 పైసలు బలపడి 73.55 వద్ద స్థిరపడింది. అమెరికాలో అత్యవసర పరిస్థితుల్లో ఫైజర్ వ్యాక్సిన్ వాడకానికి అనుమతులు లభించడంతో పాటు బ్రెగ్జిట్ ట్రేడ్ డీల్‌పై బ్రిటన్–ఈయూల మద్య జరిగే చర్చలు ఓ కొలిక్కి వస్తున్నాయనే అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లలో సాను కూల సంకేతాలు నెలకొన్నాయి. ఆసియాలో ప్రధాన మార్కెట్లతో పాటు యూరప్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బర్గర్ కింగ్ బంపర్ లిస్టింగ్ ఫాస్ట్‌ఫుడ్ చైన్ల దిగ్గజం బర్గర్ కింగ్ షేర్లు స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌లో బంపర్ హిట్‌ను సాధించాయి. ఇష్యూ ధర రూ. 60తో పోలిస్తే బీఎస్ఈలో 92% ప్రీమియంతో రూ.115 వద్ద లిస్టయ్యాయి. చివరకు 130% లాభంతో రూ.138 వద్ద స్థిరపడ్డాయి. ట్రేడింగ్ ముగిసేసరికి ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 5,282.10 కోట్లుగా ఉంది. బీఎస్ఈలో 191.55 లక్షలు, ఎన్ఎస్ఈలో 18.67 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. ఇటీవలే ముగిసిన ఈ కంపెనీ ఐపీఓ 157 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. బర్గర్ కింగ్ కంపెనీ 2020 సెప్టెంబర్ నాటికి భారత్‌లో 268 దుకాణాలను కలిగి ఉంది. -
సెన్సెక్స్ మైనస్.. నిఫ్టీ ఫ్లస్..!
ముంబై: రికార్డు ర్యాలీతో దూసుకెళ్తున్న సూచీలకు బుధవారం చిన్న బ్రేక్ పడింది. ఆర్థిక రంగ షేర్లలో విక్రయాలు తలెత్తడంతో ట్రేడింగ్ ఆద్యంతం ఆటుపోట్లకు లోనైన సూచీలు... చివరి గంట కొనుగోళ్లతో మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 37 పాయింట్ల నష్టంతో 44,618 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 5 పాయింట్ల లాభంతో 13,114 వద్ద నిలిచి తన ముగింపు రికార్డును నిలుపుకుంది. ఆర్థిక రంగ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లకు స్వల్ప కొనుగోళ్ల మద్దతు లభించింది. అంతర్జాతీయ మార్కెట్ల నష్టాల ట్రేడింగ్, రూపాయి 13 పైసల క్షీణత మన మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 560 పాయింట్ల రేంజ్లో 44,730 – 44,170 మధ్య కదలాడింది. నిఫ్టీ 145 శ్రేణిలో 13,129–12,984 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ. 357 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,636 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. భారీ నష్టాల నుంచి రికవరీ...: అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలతో మన మార్కెట్ స్వల్ప నష్టంతో మొదలైంది. ప్రారంభం నుంచే అధిక వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగ షేర్ల పతనంతో సూచీలు భారీ పతనాన్ని చవిచూశాయి. ఒకదశలో సెన్సెక్స్ 44,170, నిఫ్టీ 12,984 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. ఆటో షేర్ల ర్యాలీ...: పండుగ సీజన్ కలిసిరావడంతో నవంబర్‌లో వాహన విక్రయాల జోరు కారణంగా బుధవారం ఈ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బజాజ్ ఆటో, ఎంఅండ్ఎం టాటా మోటర్స్, మారుతీ సుజుకీ, ఆశోక్ లేలాండ్ షేర్లు 1–3 శాతం స్థాయిలో లాభపడ్డాయి. -
రెండో రోజూ లాభాల బాట
సానుకూల అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో గురువారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. స్టాక్ సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. డిసెంబర్ డెరివేటివ్స్ కాంట్రాక్టులకు చివరి రోజు కావడంతో స్టాక్‌సూచీలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఇంట్రాడేలో 391 పాయింట్ల వరకూ ఎగసిన సెన్సెక్స్ సగం వరకూ లాభాలను పోగొట్టుకొని చివరకు 157 పాయింట్ల లాభంతో 35,807 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 పాయింట్లు పెరిగి 10,780 పాయింట్ల వద్దకు చేరింది. డాలర్‌తో రూపాయి మారకం క్షీణించినా, ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ సందర్భంగా లాభాల స్వీకరణ చోటు చేసుకున్నా, మార్కెట్ లాభాల్లోనే ముగిసింది. ముడి చమురు ధరలు మరింతగా దిగిరావడం కలసివచ్చింది. సగం తగ్గిన లాభాలు అమెరికా ఫెడరల్ రిజర్వ్‌కు, అమెరికా అధ్యక్షుడి మధ్య ఉన్న ఉద్రిక్తతలు సడలడంతో అంతర్జాతీయంగా సెంటిమెంట్ బలపడింది. అమెరికా వినియోగదారుల వినియోగ గణాంకాలు అంచనాలను మించడంతో బుధవారం అమెరికా స్టాక్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. దీంతో గురువారం ఆసియా మార్కెట్లు లాభాల్లోనే ఆరంభమయ్యాయి. ఈ జోష్‌తో మన మార్కెట్ కూడా భారీ లాభాల్లోనే ఆరంభమైంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 391 పాయింట్లు, నిఫ్టీ 104 పాయింట్ల వరకూ లాభపడ్డాయి. అయితే ట్రేడింగ్ చివర్లో బ్యాంక్, వాహన, లోహ, ఫార్మా రంగ షేర్లలో అమ్మకాలు జరగడంతో లాభాలు సగానికి తగ్గాయి. టాటా గ్రూప్‌ను దాటేసిన హెచ్డీఎఫ్సీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాటా గ్రూప్‌ను హెచ్డీఎఫ్సీ గ్రూప్ దాటేసింది. హెచ్డీఎఫ్సీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10.40లక్షల కోట్లకు చేరింది. ఇది టాటా గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాప్ కంటే రూ.1,000 కోట్లకుపైగా అదనం. దీంతో దేశంలో అత్యధిక మార్కెట్ క్యాప్ గల గ్రూప్‌గా హెచ్డీఎఫ్సీ గ్రూప్ అవతరించింది. హెచ్డీఎఫ్సీ గ్రూప్‌లో ఐదు కంపెనీలు ఉండగా, టాటా గ్రూప్‌లో 30 వరకూ కంపెనీలున్నాయి. ఒక ఎనిమిది కంపెనీల షేర్ల తప్ప మిగిలిన అన్ని టాటా గ్రూప్ కంపెనీల షేర్లు ఈ ఏడాది బాగా పతనమయ్యాయి. అత్యధిక మార్కెట్ క్యాప్ కంపెనీగా ఉన్న టీసీఎస్ మార్కెట్ క్యాప్ మొత్తం టాటా గ్రూప్ మార్కెట్ క్యాప్‌లో మూడింట రెండు వంతులు ఉంటుంది. -
వారాంతంలోనూ మార్కెట్లు అదుర్స్
మార్కెట్లో బడ్జెట్ ఆశల పల్లకి నడుస్తోంది. వచ్చే వారంలో పార్లమెంట్ ముందుకు రాబోతున్న బడ్జెట్ నేపథ్యంలో వరుసగా నాలుగో సెషన్ లాభాల్లో ముగిసింది. ఎనిమిది నెలల కాలంలో వారాంతంలో మొదటిసారి మార్కెట్లు మంచి లాభాలను నమోదుచేశాయి. 174.32 పాయింట్ల లాభంలో సెన్సెక్స్ 27882.46 వద్ద, 38.50 పాయింట్ల లాభంలో 8641.25 వద్ద నిఫ్టీ ముగిశాయి. బీహెచ్ఈఎల్, భారతీ, ఐసీఐసీఐ బ్యాంకు, ఎన్టీపీసీ, ఎస్బీఐ టాప్ గెయినర్లుగా లాభాలు పండించగా.. ఐటీసీ, విప్రో, లుపిన్, టాటా మోటార్స్, హెచ్‌యూఎల్ నష్టాలను గడించాయి. ఫైనాన్సియల్ కంపెనీలు జరిపిన ర్యాలీతో మార్కెట్లు లాభాల్లో క్లోజ్ అయ్యాయని విశ్లేషకులు చెప్పారు. ఇటీవల విడుదలైన కార్పొరేట్ ఫలితాలు అంచనావేసిన దానికంటే మెరుగ్గానే విడుదలయ్యాయని పేర్కొన్నారు. హఠాత్తుగా పెద్ద నోట్ల రద్దు చేస్తున్నట్టు తీసుకున్నట్టు నిర్ణయంతో ప్రభావితమైన ఆర్థికవ్యవస్థకు ఊతంగా బడ్జెట్ విడుదల కాబోతుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. దీంతో మార్కెట్లు లాభాల్లో నడుస్తున్నాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ స్వల్పంగా 0.02 పైసలు పడిపోయి, 68.10గా నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 237 రూపాయలు పడిపోయి 28,148 వద్ద ముగిసింది. -
సెన్సెక్స్ రయ్ .. రయ్...
కొనుగోలు జోరుతో సెన్సెక్స్ డబుల్ సెంచరీ బీట్ చేసింది. 250 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ 27375.58వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 84.30 పాయింట్ల లాభంలో 8475.80 వద్ద క్లోజ్ అయింది. క్యాపిటల్ గూడ్స్, పవర్, మెటల్, బ్యాంకింగ్, ఆటో షేర్లలో నెలకొన్న కొనుగోలు మద్దతు మంగళవారం సెషన్‌కు మంచి ఊపునిచ్చింది. అయితే ఐటీ షేర్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి నేడు కూడా అదేమాదిరి కొనసాగింది. డిసెంబర్ క్వార్టర్ ఫలితాల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు 2 శాతం పైకి ఎగిసింది. ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లు మినహా మిగతా రంగాల షేర్లలో నెలకొన్న కొనుగోలు మద్దుతు మధ్యాహ్నం మార్కెట్లు ఎక్కువగా కలిసి వచ్చింది. బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్, బీహెచ్ఈఎల్, మహింద్రా అండ్ మహింద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంకు సెన్సెక్స్‌లో లాభాలు పండించగా.. భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంకు, విప్రోలు నష్టపోయాయి. మరోవైపు యూరోపియన్ మార్కెట్లు లాభాల్లో నడిచాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలసీల్లో అనిశ్చితి ఏర్పడటంతో ఆసియన్ స్టాక్స్ మిక్స్‌డ్‌గా ముగిశాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.07 పైసలు లాభపడి 68.14గా నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 73 రూపాయలు పడిపోయి 28,730 వద్ద ముగిసింది. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై : లాభనష్టాల ఊగిసలాటలో నడిచిన సోమవారం స్టాక్ మార్కెట్లు చివరికి లాభాల్లో ముగిశాయి. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ఎంసీజీ షేర్లకు సెషన్ చివరిలో నెలకొన్న కొనుగోలు మద్దతుతో మార్కెట్లు లాభాల్లోకి పయనించాయి. సెన్సెక్స్ 82.84 పాయింట్ల లాభంలో 27117.34 వద్ద, నిఫ్టీ 42.15 పాయింట్ల లాభంలో 8391.50 వద్ద ముగిశాయి. గెయిల్, హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్, టాటా స్టీల్ నేటి మార్కెట్లో టాప్ గెయినర్లుగా నిలువగా.. ఐసీఐసీఐ బ్యాంకు, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంకు, సన్ ఫార్మా, రిలయన్స్ నష్టాలు గడించాయి. నేటి సెషనంతా మార్కెట్లు లాభనష్టాల ఊగిసలాటలో నడిచాయి. క్యాపిటల్ గూడ్స్, ఫార్మా, బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. కేంద్రప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై పెట్టుబడిదారులు ఎక్కువగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఎక్కువ విలువ గల్గిన నోట్లను రద్దు చేసిన అనంతరం దేశంలో నెలకొన్న నగదు కొరత పరిస్థితికి ఉపశమనంగా ఎకానమీకి సపోర్టుగా కేంద్రం ఏమైనా ప్రోత్సహకాలు ప్రవేశపెడుతుందని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. ట్రంప్ ప్రారంభోత్సవ ప్రసంగంపై ఆందోళన చెందిన మార్కెట్లు సోమవారం 200 పాయింట్లకు పైగా కుప్పకూలిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మార్కెట్లు కొద్దిగా కోలుకుని పైకి ఎగిశాయని విశ్లేషకులంటున్నారు. నేటి సెషన్లో మెటల్ స్టాక్స్‌కు మంచి కొనుగోలు మద్దుతు లభించింది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.02 పైసలు బలపడి 68.16గా నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు కూడా 155 రూపాయలు పెరిగి 28,780 వద్ద ముగిసింది. -
ఫెడ్ జోష్.. మార్కెట్లు లాభాల్లో ప్రారంభం
ఫెడరల్ రిజర్వు మీటింగ్‌పై దేశీయ సూచీలు సానుకూలంగా స్పందిస్తూ గురువారం నాటి ట్రేడింగ్‌లో లాభాల్లో ఎంట్రీ ఇచ్చాయి. సెన్సెక్స్ 150 పాయింట్లకు పైగా దూసుకెళ్లి ప్రస్తుతం 112.36 పాయింట్ల లాభంలో 28117 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ తన కీలక మార్కు 8,650ను పునరుద్ధరించి, 33.75 పాయింట్ల లాభంలో ట్రేడ్ అవుతోంది. ఫెడరల్ రిజర్వు నుంచి రాత్రి వెలువడిన సానుకూల సందేశాలతో మార్కెట్లు లాభాల బాట పట్టాయి. పాలసీని త్వరలోనే కఠినతరం చేస్తామని జూలై పాలసీ మీటింగ్‌లో ఫెడ్ రిజర్వు సంకేతాలు ఇచ్చినప్పటికీ.. వడ్డీరేట్ల పెంపుకు మరింత మెరుగైన ఎకానమిక్ డేటా అవసరమని పాలసీ మేకర్లు బుధవారం రాత్రి జరిగిన సమావేశంలో అభిప్రాయం వ్యక్తంచేశారు. ఈ సందేశాలతో 2016 ఫెడ్ రేటు పెంపు లేనట్టేనని వెల్లడవుతోంది. దీంతో అటు ఆసియన్ మార్కెట్లకు, ఇటు దేశీయ మార్కెట్లకు సానుకూల పవనాలు వీచాయి. ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్‌లు నిఫ్టీలో హెవీ వేయింట్గా నిలుస్తున్నాయి. 2.32 శాతం లాభంతో పవర్ గ్రిడ్ టాప్ నిఫ్టీ గెయినర్‌గా ట్రేడ్ అవుతోంది. హీరో మోటార్ కార్పొ, ఐసీఐసీఐ, అదానీ పోర్ట్స్, ఆల్ట్రా టెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంకు టాప్ గెయినర్లుగా ఉన్నాయి. కోల్ ఇండియా, విప్రో, ఎల్ అండ్ టీ, అరబిందో ఫార్మా, హిందుస్తాన్ యూనిలివర్, హెచ్‌డీఎఫ్‌సీలు నష్టాలను గడిస్తున్నాయి. అటు డాలర్‌తో పోలిస్తే రూపాయి 0.05 పైసలు బలహీనపడి 66.82గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 88 రూపాయల నష్టంతో 31,379.0 ట్రేడ్ అవుతోంది. -
జీఎస్టీ బూస్ట్‌తో తేరుకున్న మార్కెట్లు
ముంబై : దేశమంతటినీ ఏకీకృత పన్ను విధానంలోకి తీసుకొస్తూ రాజ్యసభ ఆమోదించిన జీఎస్టీ బిల్లు నేపథ్యంలో గురువారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. 100కు పైగా పాయింట్లకు ఎగిసిన సెన్సెక్స్ ప్రస్తుతం 21.10 పాయింట్ల లాభంతో 27,710 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 0.25 లాభంతో 8,545 దగ్గర కొనసాగుతోంది. జీఎస్టీ బిల్లు చర్చ నేపథ్యంలో బుధవారం ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడంతో, నిన్నటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 27,700 పాయింట్లు, నిఫ్టీ 8,600 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఈ బిల్లుకు రాజ్యసభ ఓకే చెప్పడంతో నేటి ట్రేడింగ్ ప్రారంభంలో మార్కెట్లు కొంత తేరుకున్నాయి.. రియాల్టీ, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంక్స్, ఆటో స్టాక్స్ మద్దతుతో నిఫ్టీ ప్రారంభంలో లాభాల్లో నడిచింది. టాటా మోటార్స్, ఓఎన్జీసీ, హీరో, బీహెచ్ఈఎల్, మారుతీ టాప్ గెయినర్లుగా కొనసాగుతుండగా.. లుపిన్, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీలు సెన్సెక్స్‌లో నష్టాలను గడిస్తున్నాయి. అటు సింగపూర్ స్టాక్ ఎక్చ్సేంజ్ కూడా పాజిటివ్ ట్రేడ్ అవుతుండటంతో, మార్కెట్లు లాభాల బాట పట్టినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఆసియన్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. అటు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 0.24 పైసలు బలహీనపడి 66.98గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.175 పడిపోయి రూ.31,600వద్ద నమోదవుతోంది. -
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
ముంబై: మంగళవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 103.70 పాయింట్ల లాభంతో 28,079దగ్గర, నిఫ్టీ 28.65పాయింట్ల లాభంతో 8,520.00 దగ్గర ప్రారంభమయ్యాయి. గత వారమంతా నష్టాల్లో ఉన్న మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిసి దలాల్ స్ట్రీట్‌లో మెరుపులు మెరిపించాయి. అయితే మంగళవారం బ్యాంక్ నిఫ్టీ స్వల్ప నష్టాలతో మొదలైంది. -
స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబై: బుధవారం మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 68 .57పాయింట్ల లాభంతో 28,230.95 దగ్గర, నిఫ్టీ 17.60పాయింట్ల లాభంతో 8,559.25 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. హెల్త్ కేర్, ఆటో సెక్టార్ లో కొనుగోళ్లు, రియాల్టీ సెక్టార్ లో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై: స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిసాయి. బుధవారం భారీ లాభాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు ముగింపు దశలో నష్టాలను చవిచూశాయి. 315 పాయింట్లతో 29,909 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 213 పాయింట్ల నష్టంతో 29,380 వద్ద ముగియగా, 73 పాయింట్లు కోల్పొయిన నిఫ్టీ 8,922 వద్ద ముగిసింది. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై: స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమైనా , మధ్యాహ్నానికి దాదాపు అన్ని షేర్లూ నష్టాల్లోకి జారుకున్నాయి. ఆటో షేర్ల ఫాల్ మార్కెట్ ను ప్రభావితం చేస్తోంది. రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్ట బోయే బడ్టెట్ మార్కెట్ పై ప్రభావాన్ని చూపెడుతోంది. . 78 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్, 24 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ట్రేడ్ అవుతున్నాయి. -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 49.19 లాభంతో 29,057 దగ్గర నిఫ్టీ 11.75 పాయింట్ల లాభంతో 8,779 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్, ఆటో షేర్లలో బైయింగ్ ట్రెండ్ , ఎఫ్ఎంసీజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్ట బోయే బడ్టెట్ మార్కెట్ పై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.