సెన్సెక్స్ రయ్ .. రయ్...
Published Tue, Jan 24 2017 4:10 PM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM
కొనుగోలు జోరుతో సెన్సెక్స్ డబుల్ సెంచరీ బీట్ చేసింది. 250 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ 27375.58వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 84.30 పాయింట్ల లాభంలో 8475.80 వద్ద క్లోజ్ అయింది. క్యాపిటల్ గూడ్స్, పవర్, మెటల్, బ్యాంకింగ్, ఆటో షేర్లలో నెలకొన్న కొనుగోలు మద్దతు మంగళవారం సెషన్కు మంచి ఊపునిచ్చింది. అయితే ఐటీ షేర్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి నేడు కూడా అదేమాదిరి కొనసాగింది. డిసెంబర్ క్వార్టర్ ఫలితాల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు 2 శాతం పైకి ఎగిసింది. ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లు మినహా మిగతా రంగాల షేర్లలో నెలకొన్న కొనుగోలు మద్దుతు మధ్యాహ్నం మార్కెట్లు ఎక్కువగా కలిసి వచ్చింది.
బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్, బీహెచ్ఈఎల్, మహింద్రా అండ్ మహింద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంకు సెన్సెక్స్లో లాభాలు పండించగా.. భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, హెచ్యూఎల్, ఐసీఐసీఐ బ్యాంకు, విప్రోలు నష్టపోయాయి. మరోవైపు యూరోపియన్ మార్కెట్లు లాభాల్లో నడిచాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలసీల్లో అనిశ్చితి ఏర్పడటంతో ఆసియన్ స్టాక్స్ మిక్స్డ్గా ముగిశాయి. అటు డాలర్తో రూపాయి మారకం విలువ 0.07 పైసలు లాభపడి 68.14గా నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 73 రూపాయలు పడిపోయి 28,730 వద్ద ముగిసింది.
Advertisement
Advertisement