వారాంతంలోనూ మార్కెట్లు అదుర్స్
Published Fri, Jan 27 2017 4:13 PM | Last Updated on Tue, Sep 5 2017 2:16 AM
మార్కెట్లో బడ్జెట్ ఆశల పల్లకి నడుస్తోంది. వచ్చే వారంలో పార్లమెంట్ ముందుకు రాబోతున్న బడ్జెట్ నేపథ్యంలో వరుసగా నాలుగో సెషన్ లాభాల్లో ముగిసింది. ఎనిమిది నెలల కాలంలో వారాంతంలో మొదటిసారి మార్కెట్లు మంచి లాభాలను నమోదుచేశాయి. 174.32 పాయింట్ల లాభంలో సెన్సెక్స్ 27882.46 వద్ద, 38.50 పాయింట్ల లాభంలో 8641.25 వద్ద నిఫ్టీ ముగిశాయి. బీహెచ్ఈఎల్, భారతీ, ఐసీఐసీఐ బ్యాంకు, ఎన్టీపీసీ, ఎస్బీఐ టాప్ గెయినర్లుగా లాభాలు పండించగా.. ఐటీసీ, విప్రో, లుపిన్, టాటా మోటార్స్, హెచ్యూఎల్ నష్టాలను గడించాయి.
ఫైనాన్సియల్ కంపెనీలు జరిపిన ర్యాలీతో మార్కెట్లు లాభాల్లో క్లోజ్ అయ్యాయని విశ్లేషకులు చెప్పారు. ఇటీవల విడుదలైన కార్పొరేట్ ఫలితాలు అంచనావేసిన దానికంటే మెరుగ్గానే విడుదలయ్యాయని పేర్కొన్నారు. హఠాత్తుగా పెద్ద నోట్ల రద్దు చేస్తున్నట్టు తీసుకున్నట్టు నిర్ణయంతో ప్రభావితమైన ఆర్థికవ్యవస్థకు ఊతంగా బడ్జెట్ విడుదల కాబోతుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. దీంతో మార్కెట్లు లాభాల్లో నడుస్తున్నాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్ను ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. అటు డాలర్తో రూపాయి మారకం విలువ స్వల్పంగా 0.02 పైసలు పడిపోయి, 68.10గా నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 237 రూపాయలు పడిపోయి 28,148 వద్ద ముగిసింది.
Advertisement
Advertisement