లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Published Mon, Jan 23 2017 4:36 PM | Last Updated on Tue, Sep 5 2017 1:55 AM
ముంబై : లాభనష్టాల ఊగిసలాటలో నడిచిన సోమవారం స్టాక్ మార్కెట్లు చివరికి లాభాల్లో ముగిశాయి. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ఎంసీజీ షేర్లకు సెషన్ చివరిలో నెలకొన్న కొనుగోలు మద్దతుతో మార్కెట్లు లాభాల్లోకి పయనించాయి. సెన్సెక్స్ 82.84 పాయింట్ల లాభంలో 27117.34 వద్ద, నిఫ్టీ 42.15 పాయింట్ల లాభంలో 8391.50 వద్ద ముగిశాయి. గెయిల్, హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్, టాటా స్టీల్ నేటి మార్కెట్లో టాప్ గెయినర్లుగా నిలువగా.. ఐసీఐసీఐ బ్యాంకు, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంకు, సన్ ఫార్మా, రిలయన్స్ నష్టాలు గడించాయి. నేటి సెషనంతా మార్కెట్లు లాభనష్టాల ఊగిసలాటలో నడిచాయి. క్యాపిటల్ గూడ్స్, ఫార్మా, బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
కేంద్రప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్పై పెట్టుబడిదారులు ఎక్కువగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఎక్కువ విలువ గల్గిన నోట్లను రద్దు చేసిన అనంతరం దేశంలో నెలకొన్న నగదు కొరత పరిస్థితికి ఉపశమనంగా ఎకానమీకి సపోర్టుగా కేంద్రం ఏమైనా ప్రోత్సహకాలు ప్రవేశపెడుతుందని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. ట్రంప్ ప్రారంభోత్సవ ప్రసంగంపై ఆందోళన చెందిన మార్కెట్లు సోమవారం 200 పాయింట్లకు పైగా కుప్పకూలిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మార్కెట్లు కొద్దిగా కోలుకుని పైకి ఎగిశాయని విశ్లేషకులంటున్నారు. నేటి సెషన్లో మెటల్ స్టాక్స్కు మంచి కొనుగోలు మద్దుతు లభించింది. అటు డాలర్తో రూపాయి మారకం విలువ 0.02 పైసలు బలపడి 68.16గా నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు కూడా 155 రూపాయలు పెరిగి 28,780 వద్ద ముగిసింది.
Advertisement
Advertisement