Metal Stocks
-
మెటల్ షాక్: నష్టాల్లోకి స్టాక్‌మార్కెట్లు
సాక్షి, హైదరాబాద్: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 114పాయింట్ల నష్టంతో 54173వద్ద నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో 16169 వద్ద ట్రేడింగ్‌ను కొన సాగిస్తున్నాయి. మెటల్ స్టాక్స్ రికవరీతో ఓపెనింగ్‌లో మంగళవారం ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఉక్కు తయారీ ముడిసరుకులపై కేంద్రం ఎగుమతి సుంకాలను విధించడంతో గత సెషన్లో మెటల్ షేర్లు భారీగా పతనమైన సంగతి తెలిసిందే. 1.56 శాతం లాభంతో M&M టాప్ గెయినర్‌గా ట్రేడ్ అవుతోంది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, కోల్ ఇండియా కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు హిందుస్థాన్ యూనిలీవర్, భారతీ ఎయిర్టెల్, టైటాన్, టీసీఎస్, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. -
మళ్లీ రికార్డుల పరుగు..!
ముంబై: స్టాక్ మార్కెట్ మళ్లీ రికార్డుల బాటపట్టింది. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు కలిసిరావడంతో సూచీలు సోమవారం మరోసారి జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. ఐటీ, ఫార్మా, మెటల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ 195 పాయింట్లు పెరిగి 44 వేల పైన 44,077 వద్ద స్థిరపడింది. నిప్టీ 67 పాయింట్లను ఆర్జించి 12900 ఎగువున 12,926 వద్ద నిలిచింది. కోవిడ్–19 కట్టడికి ఫార్మా కంపెనీలు రూపొందిస్తున్న వ్యాక్సిన్లు ట్రయల్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తున్నాయనే వార్తలు ఈక్విటీలకు ఉత్సాహాన్నిచ్చాయి. తాజాగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ– ఆస్ట్రాజెనికాల సంయుక్త ఆధ్వర్యంలో రూపకల్పన చేసిన వ్యాక్సిన్ సైతం తుది దశలో మెరుగైన ఫలితాలనిచ్చింది. అలాగే రిలయన్స్ – ఫ్యూచర్ గ్రూప్ డీల్‌కు సీసీఐ ఆమోదం తెలపడంతో రిలయన్స్ షేరు 3 శాతం లాభపడి సూచీల ర్యాలీకి అండగా నిలిచింది. డాలర్ మారకంలో రూపాయి రివకరీ కలిసొచ్చింది. మార్కెట్లో జరిగిన విస్తృతస్థాయి కొనుగోళ్ల భాగంగా చిన్న, మధ్య తరహా షేర్లకు అధికంగా డిమాండ్ నెలకొంది. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 1.25% లాభపడ్డాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 389 పాయింట్లు ఎగసి 44,271 వద్ద, నిఫ్టీ 110 పాయింట్లు లాభపడి 12,969 వద్ద సరికొత్త జీవితకాల గరిష్టాలను తాకాయి. బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు... ప్రైవేట్ బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటా పరిమితి 26 శాతానికి పెంచాలని ఆర్బీఐ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ (ఐడబ్ల్యూజీ) ప్రతిపాదనతో బ్యాంకింగ్ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఐసీఐసీఐ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు 2.50 శాతం నుంచి 1% నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 1% పతనమైంది. 3 శాతం లాభపడ్డ రిలయన్స్ షేరు... ఆర్ఐఎల్–ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీఐఐ) ఆమోదం తెలపడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 3 శాతం లాభపడి రూ.1,951 వద్ద ముగిసింది. ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్, గిడ్డంగుల వ్యాపారాలను కొనుగోలు చేయాలన్న రిలయన్స్ రిటైల్ సంస్థ ప్రతిపాదనకు శుక్రవారం సీఐఐ ఆమోదం తెలిపింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఆర్ఐఎల్ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించండంతో షేరు ఇంట్రాడేలో 4 శాతం ఎగసి రూ.1,970 స్థాయిని అందుకుంది. కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్ రూ.34,892 కోట్లు పెరిగి రూ.13.19 లక్షల కోట్లకు చేరుకుంది. ఫ్యూచర్ గ్రూప్ షేర్లలోనూ కొనుగోళ్లే... రూ.24,173 కోట్ల ఆర్ఐఎల్–ఫ్యూచర్ గ్రూప్ డీల్‌కు సీఐఐ అనుమతులు లభించడంతో కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ షేర్లు పరుగులు పెట్టాయి. రిటైల్ ఫ్యూచర్ 10% లాభపడి రూ.70 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్ షేరు 10% ఎగిసి రూ.90.30 స్థాయిని తాకింది. ఫ్యూచర్ ఎంటర్ ప్రైజెస్ షేరు ఇంట్రాడేలో 5% ర్యాలీతో రూ.10.45 స్థాయిని అందుకుంది. -
మెటల్ షేర్ల మెరుపులు
మంగళవారం ఎన్ఎస్ఈలో మెటల్ షేర్లు జోరుగా ర్యాలీ చేస్తున్నాయి. ఉదయం 11:08 గంటల ప్రాంతంలో నిఫ్టీ మెటల్ ఇండక్స్2.5 శాతం పెరిగి రూ.1,753.30 వద్ద ట్రేడ్ అవుతోంది.ఉదయం రూ.1,724.95 ప్రారంభమైన నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఒక దశలో రూ.1,756.55 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇక ఈ ఇండెక్స్‌లో భాగమైన జిందాల్ స్టీల్ 9 శాతం లాభపడి రూ.105.40 వద్ద, జేఎస్‌డబ్ల్యూస్టీల్ 5.5 శాతం లాభపడి రూ.175.35 వద్ద, టాటా స్టీల్ 3శాతం లాభపడి రూ.283 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. హిందాల్కో 2.9శాతం పెరిగి రూ.128.55 వద్ద, నేషనల్ అల్యూమినియం 2.2శాతం పెరిగి రూ.27.5 వద్ద, సెయిల్ 2 శాతం లాభపడి రూ.27.85 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఎన్ఎండీసీ 1.7శాతం లాభపడి రూ.73.75 వద్ద, హిందుస్థాన్ జింక్ 1.5 శాతం లాభపడి రూ.167.75 వద్ద. హిందుస్థాన్ కాపర్ 1.2 శాతం లాభపడి రూ.24.80 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.కోల్ఇండియా,ఏపీఎల్అపోలో,వేదాంతా కంపెనీలు స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతుండగా, రత్నమణి మెటల్స్, వెలస్పన్ కార్పొరేషన్, మొయిల్లు స్వల్పంగా నష్టపోయి ట్రేడ్ అవుతున్నాయి. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై : లాభనష్టాల ఊగిసలాటలో నడిచిన సోమవారం స్టాక్ మార్కెట్లు చివరికి లాభాల్లో ముగిశాయి. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ఎంసీజీ షేర్లకు సెషన్ చివరిలో నెలకొన్న కొనుగోలు మద్దతుతో మార్కెట్లు లాభాల్లోకి పయనించాయి. సెన్సెక్స్ 82.84 పాయింట్ల లాభంలో 27117.34 వద్ద, నిఫ్టీ 42.15 పాయింట్ల లాభంలో 8391.50 వద్ద ముగిశాయి. గెయిల్, హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్, టాటా స్టీల్ నేటి మార్కెట్లో టాప్ గెయినర్లుగా నిలువగా.. ఐసీఐసీఐ బ్యాంకు, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంకు, సన్ ఫార్మా, రిలయన్స్ నష్టాలు గడించాయి. నేటి సెషనంతా మార్కెట్లు లాభనష్టాల ఊగిసలాటలో నడిచాయి. క్యాపిటల్ గూడ్స్, ఫార్మా, బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. కేంద్రప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై పెట్టుబడిదారులు ఎక్కువగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఎక్కువ విలువ గల్గిన నోట్లను రద్దు చేసిన అనంతరం దేశంలో నెలకొన్న నగదు కొరత పరిస్థితికి ఉపశమనంగా ఎకానమీకి సపోర్టుగా కేంద్రం ఏమైనా ప్రోత్సహకాలు ప్రవేశపెడుతుందని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. ట్రంప్ ప్రారంభోత్సవ ప్రసంగంపై ఆందోళన చెందిన మార్కెట్లు సోమవారం 200 పాయింట్లకు పైగా కుప్పకూలిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మార్కెట్లు కొద్దిగా కోలుకుని పైకి ఎగిశాయని విశ్లేషకులంటున్నారు. నేటి సెషన్లో మెటల్ స్టాక్స్‌కు మంచి కొనుగోలు మద్దుతు లభించింది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.02 పైసలు బలపడి 68.16గా నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు కూడా 155 రూపాయలు పెరిగి 28,780 వద్ద ముగిసింది. -
బ్యాంక్, మెటల్ స్టాక్స్ బతికించాయి!
ముంబై : స్వల్పనష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు బ్యాంకింగ్, మెటల్ స్టాక్స్ లాభాలతో పునరుద్ధరించుకున్నాయి. సెన్సెక్స్ 50.11 పాయింట్ల లాభంతో 27,288 వద్ద, నిఫ్టీ 12.45 పాయింట్ల లాభంలో 8,412వద్ద ముగిశాయి. మూడు బ్యాంకుల ఫలితాలు మెరుగ్గా వెల్లడికావడంతో ఫైనాన్సియల్ షేర్లలో సెంటిమెంట్ బలపడింది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్సియల్ షేర్లు లాభాల బాట పట్టాయి. 2016 నవంబర్ 21 నుంచి మొదటిసారి నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ 1 శాతం పైగా ట్రేడ్ అయి, ఆఖరికి 0.97వద్ద ముగిసింది. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా 2.19 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 0.84 శాతం పైకి దూసుకెళ్లాయి. ఇదే క్రమంలో ఐటీ స్టాక్స్‌లో సెంటిమెంట్ బలహీనపడింది. సాఫ్ట్వేర్ సర్వీసుల అతిపెద్ద ఎగుమతిదారి ఇన్ఫోసిస్ లిమిటెడ్ మళ్లీ రెవెన్యూ అవుట్‌లుక్(గైడెన్స్) తగ్గించడంతో సెంటిమెంట్ వీక్‌గా ఉందని, ట్రంప్ పాలసీల్లో తదుపరి క్లారిటీ కోసం పెట్టుబడిదారులు వేచిచూస్తున్నారని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్న డొనాల్డ్ ట్రంప్ తన ఎకనామిక్ ప్లాన్స్‌పై ఏమైనా క్లారిటీ ఇస్తారేమోనని పెట్టుబడిదారులందరూ ఎంతో ఆతృతగా వేచిచూస్తున్నట్టు తెలుస్తోంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 2.57 శాతం, ఇన్ఫోసిస్ 1.88 శాతం పడిపోవడంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 0.88 శాతం నష్టాల్లోకి పడిపోయింది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.02 పైసల లాభంతో 68.13వద్ద ముగిసింది. ఎంసీఎక్స్ మార్కెట్లోనూ 10 గ్రాముల బంగారం ధర 164 రూపాయల లాభంతో 28,554గా నమోదైంది. -
మెటల్ జోరుతో మెరిసిన మార్కెట్లు
ముంబై : పవర్ స్టాక్స్, క్యాపిటల్ గూడ్స్, మెటల్ స్టాక్స్ లో చూపిన కొనుగోలు మద్దతుతో శుక్రవారం నాటి స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసేనాటికి లాభాలను నమోదుచేశాయి. సెన్సెక్స్ 92.72 పాయింట్ల లాభంతో, 27,803వద్ద, నిఫ్టీ 31.10 పాయింట్ల లాభంతో 8,541 దగ్గర ముగిసింది. ఆటో, క్యాపిటల్ గూడ్స్, మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ నేటి ట్రేడింగ్ లో కొనుగోలు జోరు సాగించాయి. టాటా మోటార్స్, గెయిల్, హెచ్డీఎఫ్సీ, ఎన్టీపీసీ, ఎల్&టీలు లాభాలను పండించగా.. బజాజ్ ఆటో, హెచ్‌యూఎల్, సన్ ఫార్మా, ఎస్బీఐ, ఇన్ఫోసిస్ నష్టాలను గడించాయి. సెన్సెక్స్ 27,832.45 గరిష్ట స్థాయి నుంచి 27,646.21 కనిష్ట స్థాయిలో నడిచింది. చివరికి 27,803వద్ద ముగిసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల అసెంట్ క్వాలిటీపై ఆందోళన చెందిన పెట్టుబడిదారులు అమ్మకాలపై ఎక్కువగా ఆసక్తి చూపారని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. హెచ్డీఎఫ్సీ, కొటక్ మహింద్రా బ్యాంకులు ప్రకటించిన మొండి బకాయిల తీవ్రతతో ఈ షేర్లపై భారీ అమ్మకాల ఒత్తిడి కొనసాగిందన్నారు. మరోవైపు మెరుగైన ఆర్థిక ఫలితాల ప్రకటనతో 2.2 శాతం ఎక్కువగా ట్రేడ్ అయిన ఐటీసీ, చివరకు 0.3శాతం కిందకు దిగజారి రూ.249.85గా ముగిసింది. కాగా కరెన్సీ మార్కెట్లో రూపాయి కొద్దిగా కోలుకుని, 0.05 లాభంతో 67.13గా నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి రూ.132లు నష్టపోయి రూ.30,873గా ముగిసింది. -
ఊగిసలాటలో దేశీయ సూచీలు
ముంబై: అంతర్జాతీయంగా వచ్చిన ప్రతికూల అంశాల ప్రభావంతో నేటి(శుక్రవారం) ట్రేడింగ్ లో పెట్టుబడిదారులు ఆచీ తూచీ అడుగులు వేస్తున్నారు. నష్టాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు, కొంత మేర కోలుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్సేంజీ నిఫ్టీ స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 53.06 పాయింట్ల లాభంతో, 25,656 వద్ద నమోదవుతుండగా..నిఫ్టీ 15.50 పాయింట్ల లాభంతో 7864.40 గా ట్రేడ్ అవుతోంది. నిఫ్టీలో మెటల్, ఫార్మా షేర్లు లాభాలను పండిస్తున్నాయి. ఈ షేర్లు ట్రేడింగ్ ప్రారంభంలో దాదాపు 2.3 శాతం పైగా లాభాల్లో నడిచాయి. టాటా పవర్, హిందాల్కో, అంబుజా సిమెంట్స్, టాటా స్టీల్ కూడా లాభాలనే నమోదుచేస్తున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాల పాలైన బ్యాంకింగ్ షేర్లు తర్వాత కొంత పుంజుకున్నాయి. ముందస్తు అంచనాలకు భిన్నంగా బ్యాంక్ ఆఫ్ జపాన్ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించకపోవడంతో నిరుత్సాహానికి లోనైన ఇన్వెస్టర్లు నిన్నటి స్టాక్ మార్కెట్లో భారీ అమ్మకాలు జరిపి అతిపెద్ద పతనానికి కారణమైన సంగతి తెలిసిందే. మరోవైపు మార్కెట్లో బంగారం, వెండి లాభాల్లో నడుస్తున్నాయి. బంగారం 319 పాయింట్ల లాభంతో 30 వేల వద్ద నమోదవుతుండగా, వెండి 686 పాయింట్ల రేజ్ లో 41,710 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 66.51గా ఉంది. -
సెన్సెక్స్ 96 పాయింట్లు ప్లస్
26,000కు పైన ముగింపు రెండు రోజుల నష్టాలకు చెక్ చివరి గంటన్నరలో కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్లు నష్టాల నుంచి కోలుకున్నాయి. తొలుత స్వల్ప నష్టాలతో మొదలైన సెన్సెక్స్ ఒక దశలో 140 పాయింట్ల వరకూ జారింది. 25,850 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. రోజులో అధిక భాగం నీరసించినప్పటికీ చివర్లో జరిగిన షార్ట్ కవరింగ్ కారణంగా లాభాల్లోకి మళ్లినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫలితంగా ట్రేడింగ్ ముగిసేసరికి 96 పాయింట్ల లాభంతో 26,087 వద్ద నిలిచింది. వెరసి రెండు రోజుల నష్టాలకు చెక్ పడింది. గత రెండు రోజుల్లో సెన్సెక్స్ 280 పాయింట్లు పడ్డ సంగతి తెలిసిందే. కాగా, నిఫ్టీ కూడా 43 పాయింట్లు పుంజుకుని 7,791 వద్ద ముగిసింది. జూలై డెరివేటివ్స్ ముగింపు నేపథ్యంలో మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనయ్యాయని నిపుణులు తెలిపారు. స్పైస్‌జెట్ షేరు 16% పతనం : కాగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందన్న వార్తల కారణంగా స్పైస్‌జెట్ షేరు బీఎస్ఈలో 16% దిగజారింది. రూ. 14 వ ద్ద ముగిసింది. -
మూడో రోజు కూడా సెన్సెక్స్ కు నష్టాలే!
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు వరుసగా మూడో రోజు నష్టాలతో ముగిసాయి. మంగళవారం ట్రేడింగ్ ముగింపులో సెన్సెక్స్ 165 పాయింట్ల నష్టంతో 22466 వద్ద, నిఫ్టీ 46 పాయింట్లు క్షీణించి 6715 వద్ద ముగిసాయి. మెటల్, బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాల కంపెనీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 22443 పాయింట్లు, నిఫ్టీ 6708 పాయింట్ల కనిష్టస్థాయిని తాకాయి. జిందాల్ స్టీల్ అత్యధికంగా 7.53 శాతం, టాటాస్టీల్ 4.77, హెచ్ యూఎల్ 3.19, హిండాల్కో 2.87, టాటా పవర్ 2.47 శాతం నష్టపోయాయి. అంబుజా సిమెంట్స్, టెక్ మహీంద్ర, ఏసీసీ, గ్రాసీం, బీపీసీఎల్ కంపెనీల షేర్లు 1 శాతం పైగా నష్టపోయాయి.