మూడో రోజు కూడా సెన్సెక్స్ కు నష్టాలే!
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు వరుసగా మూడో రోజు నష్టాలతో ముగిసాయి. మంగళవారం ట్రేడింగ్ ముగింపులో సెన్సెక్స్ 165 పాయింట్ల నష్టంతో 22466 వద్ద, నిఫ్టీ 46 పాయింట్లు క్షీణించి 6715 వద్ద ముగిసాయి.
మెటల్, బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాల కంపెనీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 22443 పాయింట్లు, నిఫ్టీ 6708 పాయింట్ల కనిష్టస్థాయిని తాకాయి.
జిందాల్ స్టీల్ అత్యధికంగా 7.53 శాతం, టాటాస్టీల్ 4.77, హెచ్ యూఎల్ 3.19, హిండాల్కో 2.87, టాటా పవర్ 2.47 శాతం నష్టపోయాయి. అంబుజా సిమెంట్స్, టెక్ మహీంద్ర, ఏసీసీ, గ్రాసీం, బీపీసీఎల్ కంపెనీల షేర్లు 1 శాతం పైగా నష్టపోయాయి.