మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో మెటల్ షేర్లు జోరుగా ర్యాలీ చేస్తున్నాయి. ఉదయం 11:08 గంటల ప్రాంతంలో నిఫ్టీ మెటల్ ఇండక్స్2.5 శాతం పెరిగి రూ.1,753.30 వద్ద ట్రేడ్ అవుతోంది.ఉదయం రూ.1,724.95 ప్రారంభమైన నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఒక దశలో రూ.1,756.55 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇక ఈ ఇండెక్స్‌లో భాగమైన జిందాల్ స్టీల్ 9 శాతం లాభపడి రూ.105.40 వద్ద, జేఎస్‌డబ్ల్యూస్టీల్ 5.5 శాతం లాభపడి రూ.175.35 వద్ద, టాటా స్టీల్ 3శాతం లాభపడి రూ.283 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. హిందాల్కో 2.9శాతం పెరిగి రూ.128.55 వద్ద, నేషనల్ అల్యూమినియం 2.2శాతం పెరిగి రూ.27.5 వద్ద, సెయిల్ 2 శాతం లాభపడి రూ.27.85 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఎన్‌ఎండీసీ 1.7శాతం లాభపడి రూ.73.75 వద్ద, హిందుస్థాన్ జింక్ 1.5 శాతం లాభపడి రూ.167.75 వద్ద. హిందుస్థాన్ కాపర్ 1.2 శాతం లాభపడి రూ.24.80 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.కోల్‌ఇండియా,ఏపీఎల్‌అపోలో,వేదాంతా కంపెనీలు స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతుండగా, రత్నమణి మెటల్స్, వెలస్పన్ కార్పొరేషన్, మొయిల్‌లు స్వల్పంగా నష్టపోయి ట్రేడ్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment