
రాజ కుటుంబం (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : బ్రిటన్ రాజ కుటుంబంలో విహహం అంటే ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు ఉంటుందని అందరికీ తెలుసు. గత నెలలో రాజ కుమారుడు హ్యారీ, మేఘన్ మార్కెల్ వివాహం కూడా అలాగే జరిగింది. ఇదంతా ఒకెత్తయితే రాయల్ ఫ్యామిలీలో ఇప్పుడొక ‘గే’ జంట వివాహాం జరగనుంది. క్వీన్ ఎలిజబెత్ సోదరుడు లార్డ్ ఇవార్ మౌంట్ బాటన్, తన సహచరుడు జేమ్స్ కోయల్‌ను పెళ్లాడనున్నారు. ఈ మేరకు రాయల్ ఫ్యామిలీ సోమవారం ప్రకటించింది. వచ్చే వేసవి కాలంలో ఈ పెళ్లి జరగనుందని తెలిపింది. గే పెళ్లిళ్లు గతంలో జరిగినా రాజ కుటుంబంలో ఇదే తొలిసారి. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల హాజరులో డివాన్ పట్టణంలోని ఒక చర్చిలో ఈ వేడుక జరగనుంది. కాగా, ఇవార్ మౌంట్ బాటన్ తన భార్య పెన్నీ బాటన్‌కు 2016లో విడాకులు ఇచ్చారు. వీరికి ఎల్లా అనే కూతురు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment