Queen Elizabeth-2
-
బ్రిటన్ రాణి సమాధి ఫోటోలు వైరల్
లండన్: క్విన్ ఎలిజబెత్ ఇకలేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేక పలువురు ఆమెతో గడిపిన మధుర క్షణాలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ భావోద్వేగం చెందారు. ఆమెకు అంతిమ వీడ్కోలు ఇచ్చేందుకు ప్రపంచ దిగ్గజ నాయకులు కదలి వచ్చారు. ఎంతో అట్టహాసంగా ఆమె అంత్యక్రియలు జరిగాయి. యావత్తు బ్రిటన్ దేశం ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికింది. ఈ మేరకు బకింగ్‌హామ్ ప్యాలెస్ క్వీన్ ఎలిజబెత్ సమాధి ఫోటోలను విడుదల చేసింది. ఆమె సమాధిని కింగ్ జార్జ్ 6 మెమోరియల్ చాపెల్‌లో ఏర్పాటు చేశారు. మొత్తం సమాధిని బెల్జియన్ బ్లాక్ స్టోన్ రూపొందించిన లెడ్జర్ స్టోన్‌తో నిర్మించారు. అలాగే ఆ సమాధిపై బ్రిటన్ రాణి పేరు, ఆమె భర్త ఫిలిప్ తోపాటు, రాణి తల్లిదండ్రుల పేర్లను కూడా లిఖించారు. అంతేగాదు కింగ్ జార్జ్ 6 ఎవరో కాదు బ్రిటన్ రాణి తండ్రే. ఆయన విశ్రాంతి సమాధి వద్ద ఆమె సమాధిని కూడా ఏర్పాటు చేశారు. 1962లో ఈ మెమోరియల్ చాపెల్లోనే జార్జ్ 6 సమాధి ఏర్పాటు చేశారు. క్వీన్ ఎలిజబెత్ సెప్టెంబర్ 8న 96 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆమె తన ముత్తాతను వెనక్కినెట్టి 70 ఏళ్లపాటు సుదీర్ఘకాలం పాలించిన బ్రిటన్ రాణీగా చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం దివగంత బ్రిటన్ రాణి పెద్ద కుమారుడు కింగ్ చార్లెస్ 3 బ్రిటన్ రాజుగా బాధ్యతలు చేపట్టారు. (చదవండి: ఉక్రెయిన్‌కి హ్యాండ్ ఇచ్చిన ఇజ్రాయెల్...షాక్‌లో జెలెన్ స్కీ) -
భారత సంతతి యూకే మంత్రి సుయెల్లాకు క్వీన్ అవార్డు
లండన్: భారత సంతతికి చెందిన బ్రిటన్ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మాన్ (42) మొట్టమొదటి క్వీన్ ఎలిజబెత్–2 ఉమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నారు. లండన్‌లో శనివారం జరిగిన 20వ ఆసియన్ అఛీవర్స్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆమె తల్లిదండ్రులు అవార్డును అందుకున్నారు. బ్రేవర్మన్ తల్లి తమిళ మూలాలున్న ఉమ, తండ్రి గోవాకు చెందిన క్రీస్టీ ఫెర్నాండెజ్. సుయెల్లా లండన్‌లో జన్మించారు. బ్రిటన్‌లో పలు రంగాల్లో విజయాలు సాధించిన దక్షిణాసియాకు చెందిన వారిని ఈ అవార్డులకు ఎంపిక చేస్తుంటారు. -
బ్రిటన్ రాణి శవపేటిక వద్ద ఊహించని ఘటన.. రాయల్ గార్డ్‌కి ఏమైంది!
బ్రిటన్ను సుదీర్ఘ కాలం పాలించిన క్వీన్ ఎలిజబెత్-2 ఇటీవలే తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. కాగా. రాణి అంత్యక్రియలు సెప్టెంబర్ 19న ఉదయం చారిత్రక వెస్ట్ మినిస్టర్ అబేలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. వందల ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాన్ని పాటిస్తూ.. రాణి అంతిమ సంస్కారాలను నిర్వహించనున్నారు. విండ్సర్ క్యాజిల్‌లోని సెయింట్ జార్జ్ చాపెల్‌లో భర్త చార్లెస్ సమాధి పక్కనే ఖననం చేస్తారు. ఇక, రాణి పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం సెప్టెంబర్ 14 నుంచి 4 రోజులు ప్రజల సందర్శనార్థం వెస్ట్‌మినిస్టర్ హాల్లో ఉంచుతారు. ఇందులో భాగంగా రాణి పార్థివ దేహాన్ని ఆమె మృతి చెందిన బాల్మోరల్ కోట నుంచి ఆదివారం ఉదయం రోడ్డు మార్గాన ఎడింబరోలోని హోలీ రుడ్‌హౌజ్ కోటకు తరలించారు. మంగళవారం అక్కడి నుంచి విమానంలో లండన్‌కు తీసుకొచ్చారు. https://t.co/OzckR639WV#RoyalGuard #Queen's #coffin #collapsed #QueenElizabethII #video #Westminster #Watch: Royal Guard collapses in front of Queen Elizabeth II's coffin at Westminster#viralvdoz #BreakingNews pic.twitter.com/97x7dCMHL5 — ViralVdoz (@viralvdoz) September 15, 2022 ఇదిలా ఉండగా.. వెస్ట్‌మినిస్టర్ హాల్లో క్వీన్స్ శవపేటికను కాటాఫాల్క్ అని పిలిచే ఎత్తైన వేదికపై ఉంచారు. రాణి పార్థివదేహాన్ని సందర్శించి పెద్ద సంఖ్యలో ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. ఈ తరుణంలో ఎవరూ ఊహించని ఘటన చోటుచేసుకుంది. శవపేటిక వద్ద విధులు నిర్వహిస్తున్న రాయల్స్ బాడీగార్డ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అప్పటి వరకు నిల్చున్న ఓ గార్డ్.. కిందపడిపోవడంలో అక్కడున్న ఇతర గార్డ్స్ అతడి వద్దకు పరిగెత్తుకుని వచ్చారు. కాగా, సదరు గార్డ్ నీరసంగా ఉన్న కారణంగా కుప్పకూలిపోయినట్టు తెలుస్తోంది. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'Thousands have travelled from all corners of the UK and the world to pay their respects to the Queen.' GB News' Theo Chikomba reports as Queen Elizabeth II's coffin Lies-In-State in Westminster Hall, where she will remain until the morning of the funeral on Monday. pic.twitter.com/K5ypw5FD8B — GB News (@GBNEWS) September 15, 2022 -
విమానంలో క్వీన్ మృతదేహాన్ని మోసుకెళ్లి....
లండన్: బ్రిటన్‌ని సుదీర్ఘకాలం పాలించిన రాణి ఎలిజబెత్ సెప్టెంబర్ 8న స్కాట్లాండ్లోని బల్మోరల్లో మరణించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె భౌతిక దేహాన్ని ప్రజల సందర్శనార్ధం స్కాట్లాండ్ రాజధాని ఎడిన్‌బర్గ్‌లోని రాణి అధికారిక నివాసం రుడ్‌హౌస్ ప్యాలెస్‌కు తరలించారు. తదనంతరం విమానంలో లండన్‌కి తరలిస్తారు. ఇది ఆమె చివరి ఫ్లైట్ జర్నీగా చెప్పవచ్చు. ఈ మేరకు విమాన ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ రాడార్24 ద్వారా బోయింగ్ సీ17 విమానంలో ఆమె భౌతిక దేహాన్ని తీసుకువెళ్తున్న చివరి ప్రయాణాన్ని అత్యధిక మంది ఆన్లైన్లో ప్రత్యక్షంగా వీక్షించారు. అంతేకాదు ఎడిన్బర్గ్ విమానాశ్రయంలో బోయింగ్ సీ17ఏ ఎగరడానికి సిద్ధంగా ఉన్న మొదటి నిమిషంలోనే సుమారు 6 మిలియన్ల మంది విమానాన్ని ట్రాక్ చేయడానికి ప్రయత్నించారు. బోక్ అర్గోనాట్ అటలాంటాలో క్వీన్‌గా ఆమె తొలి ఫైట్ ప్రయాణానికి 70 సంవత్సరాల తర్వాత క్వీన్ ఎలిజబెత్ 2 చివరి విమానమే చరిత్రలో అత్యధికాంగా ట్రాక్ చేయబడిన విమానం. అమెరికా సభ ప్రతినిధుల స్పీకర్ నాన్సీ తైవాన్ వివాదాస్పద పర్యటనను ఫ్లైట్ రాడార్24 వెబ్సైట్లో ట్రాక్ చేసిన దానికంటే రికార్డు స్థాయిలో 2.2 మిలియన్ల ఎక్కువ అని పేర్కొంది. 📊 Flight tracking statistics regarding the final flight of Queen Elizabeth II In the minute after the transponder of C-17 ZZ177 activated, an unprecedented 6 million people attempted to follow the flight. This unfortunately impacted the stability of our platform. pic.twitter.com/VBB7vOhk3A — Flightradar24 (@flightradar24) September 13, 2022 (చదవండి: ఎలిజబెత్ కోట బయట ఏడుస్తున్న చిన్నారిని ఓదార్చిన మేఘన్) -
రాణి కడసారి చూపునకు... మెగన్‌ను రానివ్వలేదు!
లండన్: బ్రిటన్ నూతన రాజు చార్లెస్–3 కుటుంబంలో కొన్నేళ్లుగా నెలకొన్న విభేదాలు రాణి ఎలిజబెత్–2 అస్తమయం సందర్భంగా మరోసారి తెరపైకి వచ్చాయి. చార్లెస్, ఆయన పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియంతో చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీకి చాలా ఏళ్లుగా సత్సంబంధాలు లేని విషయం తెలిసిందే. రాజకుటుంబం అభ్యంతరాలను పట్టించుకోకుండా అమెరికా నటి మెగన్ మార్కెల్‌ను హ్యారీ పెళ్లాడటంతో విభేదాలు బాగా ముదిరాయి. తర్వాతి పరిణామాల నేపథ్యంలో హ్యారీ దంపతులు సంచలన రీతిలో రాజరిక హోదానే వదులుకునేందుకు దారితీశాయి. ఈ నేపథ్యంలో గురువారం స్కాట్లండ్‌లోని బాల్మోరల్ కోటలో మృత్యుశయ్యపై ఉన్న రాణిని చూసేందుకు మెగన్ రావడానికి వీల్లేదని చార్లెస్ పట్టుబట్టారట. హ్యారీ దంపతులు గురువారం లండన్‌లోనే ఉన్నారు. రాణి కడసారి చూపుకు వారిద్దరూ బాల్మోరల్ బయల్దేరుతున్నట్టు తెలియగానే చార్లెస్ నేరుగా హ్యారీకి ఫోన్ చేసి, ‘‘అతి కొద్దిమంది రక్త సంబంధీకులం తప్ప ఎవరూ రావడం లేదు. కేట్ మిడిల్టన్ (విలియం భార్య) కూడా రావడం లేదు. కాబట్టి మెగన్ రాక అస్సలు సరికాదు’’ అని చెప్పినట్టు సమాచారం. దాంతో హ్యారీ ఒంటరిగానే వెళ్లి నాయనమ్మకు నివాళులు అర్పించారు. గురువారమే మొదటిసారిగా కొత్త స్కూల్‌కు వెళ్తున్న తన ఇద్దరు పిల్లల కోసం మిడిల్టన్ లండన్‌లోనే ఉండిపోయారు. ముందునుంచీ విభేదాలే విలియం, హ్యారీ సోదరుల మధ్య ఏనాడూ పెద్దగా సఖ్యత లేదు. తండ్రితో, అన్నతో మనస్ఫర్ధలను పలుమార్లు టీవీ ఇంటర్వ్యూల్లో హ్యారీ బాహాటంగానే వెల్లడించారు. అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకున్న అమెరికా నటి అయిన మెగన్తో తన ప్రేమాయణం వారికి నచ్చకపోయినా పట్టించుకోలేదు. గొడవల నేపథ్యంలో హ్యారీ దంపతులు రాచరిక హోదాను వదులుకుని రెండేళ్లుగా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్నారు. 2021లో ప్రఖ్యాత అమెరికా టాక్ షో హోస్ట్ ఓప్రా విన్ఫ్రేకు వారిచ్చిన ఇంటర్వ్యూ పెను సంచలనం సృష్టించింది. రాజ కుటుంబీకుల జాత్యహంకార వ్యాఖ్యలు, ప్రవర్తన తననెంతగానో గాయపరిచాయంటూ మెగన్ తీవ్ర ఆరోపణలు చేసింది. ‘‘పెళ్లికూతురుగా ముస్తాబవుతున్న సమయంలో మిడిల్డన్ నన్ను సూదుల్లాంటి మాటలతో తీవ్రంగా గాయపరిచింది. తట్టుకోలేక ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నా’’ అంటూ దుయ్యబట్టింది. ఈ ఆరోపణలు, మొత్తంగా బ్రిటన్ రాచరిక వ్యవస్థపైనే ఆమె ఎక్కుపెట్టిన పదునైన విమర్శలు అప్పట్లో పెను దుమారం రేపాయి. రాజ కుటుంబానికి మాయని మచ్చగా మిగల్చడమే గాక వారి హృదయాల్లో మంటలు రేపాయి. అన్నదమ్ముల మధ్య విభేదాలను మరింత పెంచాయి. తల్లిదండ్రులుగా చార్లెస్, కెమిల్లా పూర్తిగా విఫలమయ్యారంటూ హ్యారీ కూడా దుయ్యబట్టారు. తండ్రి అయితే తన ఫోన్ కూడా ఎత్తడం మానుకున్నారని ఆరోపించారు. ఒకవైపు రాణి ఎలిజబెత్ భర్త ఫిలిప్ మరణించిన దుఃఖంలో ఉన్న రాజ కుటుంబాన్ని ఈ ఆరోపణలు మరింత కుంగదీశాయి. ఆ సమయంలో నిండుచూలాలిగా ఉన్న మెగన్ ఫిలిప్ అంత్యక్రియల్లో కూడా పాల్గొనలేదు. అయితే హ్యారీతో పాటు మెగన్‌ను కూడా రాణి ఎంతో ఇష్టపడేవారనే చెబుతారు. మెగన్ అమెరికా వెళ్లి రాణి అంత్యక్రియల సమయానికి లండన్ తిరిగొస్తారని సమాచారం. దూరమైన కుటుంబీకులను విషాద సమయాలు దగ్గర చేస్తాయంటారు. బ్రిటిష్ రాజ కుటుంబం విషయంలో అది నిజమవుతుందో లేదో అంత్యక్రియల నాటికి స్పష్టత వస్తుంది. -
భారత రాష్ట్రపతి స్వాగతం కోసం స్వయంగా బ్రిటన్ రాణి
క్వీన్ ఎలిజబెత్-2 జీవితం.. బ్రిటన్ మాత్రమే కాదు యావత్ ప్రపంచం గుర్తుంచుకోదగిన ఒక అధ్యాయం. సుదీర్ఘకాలంగా ఒక రాజ్యాన్ని పాలించిన సామ్రాజ్ఞిగా ఆమె తనకంటూ ఓ చెరగని ముద్రవేసుకుని వెళ్లిపోయారు. అంతేకాదు.. తన హయాంలో పలు దేశాలపై ప్రత్యేకమైన శ్రద్ధ కనబరిచారామె. అందులో భారత్ కూడా ఉండగా.. ఆ ఆదరాభిమానాలకు అద్దం పట్టిన ఘటనే ఇది.. క్వీన్ ఎలిజబెత్-2 ప్రయాణంలో భారత ఆధ్యాయం కూడా ఎంతో ప్రత్యేకమైనదే. ఆమె భారత్‌కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో ఒకప్పటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ లండన్ పర్యటన సందర్భంగా స్వయంగా ఆమె కదిలివచ్చి స్వాగతం పలికారు. 1962 నుంచి 1967 వరకు భారత రాష్ట్రపతిగా సేవలందించిన డా.సర్వేపల్లి రాధాకృష్ణన్.. 1963లో బ్రిటన్‌లో పర్యటించారు. ఉపాధ్యాయుడిగా, విద్యావేత్తగా, సంస్కరణల వాదిగా ఎంతో పేరున్న డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు మునుపెన్నడూ లేనంతగా బ్రిటన్‌లో రాయల్ స్వాగతం లభించింది. క్వీన్ ఎలిజబెత్-2 స్వయంగా విక్టోరియా రైల్వే స్టేషన్‌కు వచ్చి సర్వేపల్లికి స్వాగతం పలికింది. తనతో పాటు ప్రిన్సెస్ మెరీనా, ప్రిన్సెస్ మార్గరేట్‌ను కూడా స్టేషన్‌కు తోడ్కోని వచ్చింది. ప్రిన్సెస్ మెరీనా, ప్రిన్సెస్ మార్గరేట్లను పరిచయం చేసిన రాణి(photo credit : BFI) రాజకుటుంబ ప్రముఖులతో పాటు, దేశంలోని అత్యున్నత సైన్యాధికారులు వెంట రాగా సర్వేపల్లిని జాతీయ గీతం జనగణమన ఆలాపనతో రాజమర్యాదలు చేసి తన వెంట తీసుకెళ్లారు రాణి. సర్వేపల్లి రాధాకృష్ణన్ మొత్తం 11 రోజుల పాటు బ్రిటన్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో పర్యటించారు. బ్రిటన్ సాధనసంపత్తికి అద్దం పట్టే పరిశ్రమలు, భవనాలు, వంతెనలతో పాటు పర్యాటక ప్రాంతాల్లో సర్వేపల్లి పర్యటించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ నాటి బ్రిటన్ సాంప్రదాయ గుర్రపు పందాలను చూడడానికి వచ్చినప్పుడు రాణి ఎలిజబెత్ స్వయంగా వెంట వచ్చారు. నాటి రాష్ట్రపతి సర్వేపల్లికి రాణి ఎలిజబెత్ ఆహ్వానం(photo credit : BFI) నాటి వీడియోలో ఎలిజబెత్ ఎంతో హుందాగా, మరెంతో అందంగా కనిపించారు. వీడియోలో మూడు వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు బ్రిటీష్ వస్త్రధారణలో రాణి కనిపించగా, చాలా మంది భారతీయ మహిళలు ఆనాటి సంప్రదాయ చీరలో కనిపించారు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఎలిజబెత్ కన్నుమూసిన సందర్భంగా బ్రిటీష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వీడియో నాటి చరిత్రను కళ్ల ముందుంచింది. కర్టెసీ : BFI (బ్రిటీష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నేషనల్ ఆర్కైవ్ నుంచి సేకరించిన వీడియో ఆధారంగా) -
తరతరాలుగా అందరివారు.. ప్రముఖులతో క్వీన్ ఎలిజబెత్-2 (ఫొటోలు)
-
క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు వెళ్లనున్న అమెరికా అధ్యక్షుడు
బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ‘వెళ్లే వివరాలు ఇంకా తెలియవు. కానీ నేను తప్పకుండా వెళ్తాను’ అని శుక్రవారం మీడియాతో పేర్కొన్నారు. రాణి ఎలిజబెత్ అంత్యక్రియల తేదీ ఇప్పటి వరకు నిర్ణయించలేదు. అయితే సెప్టెంబర్ 19న లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబ్బేలో ఎలిజబెత్ అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. ఒహియోలోని కొలంబస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో బిడెన్ మీడియాతో మాట్లాడుతూ.. ఎలిజబెత్ కుమారుడు, ప్రస్తుత బ్రిటన్ కింగ్ చార్లెస్-3 తనకు తెలుసని అన్నారు. కానీ ఆయనకు ఎలాంటి కాల్ చేయలేదన్నారు. కాగా బ్రిటన్ను 70 ఏళ్లపాటు పాలించిన రాణి ఎలిజబెత్-2 గురువారం బాల్మోరల్ కోటలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆమెకు ప్రిన్స్ ఫిలిఫ్‌లా.. రాజరిక అంత్యక్రియలు కాకుండా ప్రభుత్వ లాంఛనలతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఏడు రోజుల వరకూ రాజ కుటుంబం సంతాప దినాలు పాటిస్తుందని బకింగ్‌హామ్ ప్యాలెస్ శుక్రవారం ప్రకటించింది. అయితే, అంత్యక్రియలను ఎప్పుడు నిర్వహిస్తారన్నది మాత్రం వెల్లడించలేదు. ఎలిజబెత్ మృతితో ఆమె పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్ సింహాసనమెక్కారు. కింగ్ చార్లెస్–3గా ఆయనకు త్వరలో లాంఛనంగా పట్టాభిషేకం జరగనుంది. ఇక ఎలిజబెత్–2 విషయానికొస్తే తండ్రి మరణంతో 1952 ఫిబ్రవరి 6న రాణిగా మారారు. 16 నెలల తర్వాత.. 1953 జూన్ 2న పట్టాభిషక్తురాలయ్యారు. -
చెన్నైతో ‘రాణి’కి అనుబంధం.. కమల్‌హాసన్ సినిమా షూటింగ్..
సాక్షి, చెన్నై: బ్రిటన్ రాణి ఎలిజబెత్‌కు చెన్నైతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఇక్కడికి ఆమె రెండు సార్లు వచ్చి వెళ్లారు. ఆమె మృతిపై సీఎం ఎంకే స్టాలిన్‌తో పాటు పలువురు నేతలు సంతాపం తెలిపారు. బ్రిటన్ను సుదీర్ఘ కాలం పాలించిన రాణిగా చరిత్రలోకి ఎక్కిన ఎలిజబెత్ గురువారం స్కాట్లాండ్లోని బల్మోరల్ కోటలో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆమె మరణ సమాచారంతో చెన్నైలోని బ్రిటీష్ రాయబార కార్యాలయం వద్ద అధికారులు నివాళులర్పించారు. తమ సంతాపం తెలియజేశారు. అలాగే, బ్రిటీష్ ఎడ్యుకేషన్ సెంటర్లలోనూ సంతాప కార్యక్రమాలు జరిగాయి. రాణి చిత్ర పటం వద్ద అంజలి ఘటించారు. ఎలిజబెత్‌తో కామరాజర్, కరుణానిధి.. ఎలిజబెత్‌తో కమలహాసన్ సంతాపం అత్యధిక కాలం రాణిగా అధికారంలో కొనసాగిన ఆమె లేరన్న సమాచారం దిగ్భ్రాందికి గురి చేసిందని స్టాలిన్ పేర్కొన్నారు. తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆమెతో భేటీ అయిన జ్ఞాపకాలను గుర్తు చేశారు. రాణి ఎలిజబెత్ జీవితంలో ఎక్కువ కాలం ప్రజలతో మమేకమయ్యారని వ్యాఖ్యానించారు. సినీ నటుడు , మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమలహాసన్ సంతాపం తెలిపారు. తన చిత్రం మరుద నాయగం షూటింగ్ కోసం ఆమె వచ్చారని గుర్తు చేశారు. కామరాజర్‌తో కరచాలనం ఇదిలా ఉండగా, రాణి ఎలిజబెత్ చెన్నైకు రెండు సార్లు వచ్చారు. ఆమె ఢిల్లీకి వచ్చినప్పుడల్లా చెన్నైకు వచ్చి వెళ్లారు. ఆ మేరకు చెన్నైతో ఆమెకు అనుంబంధం ఉంది. 1997లో ఎంజీఆర్ ఫిల్మ్‌నగర్‌లో కమలహాసన్ మరుదనాయగం చిత్రం షూటింగ్‌ను వీక్షించేందుకు ఆమె వచ్చారు. అప్పటి సీఎం కరుణానిధి, కమలహాసన్‌లతో ఎలిజబెత్ ఎక్కువ సేపు మాట్లాడారు. అయితే, ఈ చిత్రం షూటింగ్ నేటికి పెండింగ్‌లోనే ఉంది. అంతకు ముందు 1961లో చెన్నైకు వచ్చారు. అప్పటి తమిళనాడు గవర్నర్ విష్ణురాం, సీఎం కామరాజర్, మంత్రి భక్తవత్సలం ఆమెకు ఆహ్వానం పలికారు. తన కుమారుడి బర్తడే ఆ సమయంలో ఇక్కడే ఆమె జరిపినట్టు సమాచారం. -
‘ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్’గా కేట్ మిడిల్టన్
లండన్: బ్రిటన్ నూతన రాజు చార్లెస్–3 తన పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియమ్స్‌ను ‘ప్రిన్స్ ఆఫ్ వేల్స్’గా, ఆయన భార్య కేట్ మిడిల్టన్ను ‘ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్’గా ప్రకటించారు. అంతేకాకుండా డ్యూక్ ఆఫ్ కార్న్‌వాల్‌గానూ విలియమ్స్ కొనసాగుతారు. ప్రిన్సెస్ డయానా తర్వాత ‘ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్’ హోదా పొందిన తొలివ్యక్తి కేట్ మిడిల్టన్ కావడం గమనార్హం. డయానా మరణం తర్వాత ఈ హోదా ఇన్నాళ్లూ ఖాళీగానే ఉంది. యునైటెడ్ కింగ్డమ్(యూకే)తోపాటు కామన్వెల్త్ దేశాలకు విధేయుడిగా ఉంటానని, అంకితభావంతో సేవలందిస్తానని కింగ్ చార్లెస్ అన్నారు. బ్రిటన్ రాజు హోదాలో ఆయన శుక్రవారం సాయంత్రం తొలిసారిగా టీవీలో జాతినుద్దేశించి ప్రసంగించారు. తన ప్రియమైన తల్లి ఎలిజబెత్–2 తనపై అమితమైన ప్రేమ చూపించారని, ఆప్యాయత అందించారని, మార్గదర్శిగా నిలిచారని గుర్తుచేసుకున్నారు. జీవితాంతంప్రజా సేవలో గడిపారని అన్నారు. ఆమె జీవితం తనకొక ఉదాహరణగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. ఆమె లోటును తనతోపాటు ఎంతోమంది అనుభవిస్తున్నారన్నారు. రెండో కుమారుడు హ్యారీ, అతడి భార్య మేఘన్‌కు కింగ్ చార్లెస్–3 శుభాకాంక్షలు తెలిపారు. జీవితాలను చక్కగా తీర్చిదిద్దుకుంటున్న వారిద్దరి పట్ల తన ప్రేమను వ్యక్తీకరించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. హ్యారీ రాచరిక హోదా వదులుకుని భార్యతో పాటు అమెరికాలో ఉంటున్నారు. -
రాకుమారునిగా వెళ్లి... రాజుగా లండన్‌కు చార్లెస్
లండన్: రాణి ఎలిజబెత్–2 ఆరోగ్యం విషమించిన విషయం తెలియగానే గురువారం ఉదయం రాకుమారుని హోదాలో లండన్ వీడిన చార్లెస్, ఆమె మరణానంతరం శుక్రవారం బ్రిటన్ రాజు హోదాలో తిరిగి రాజధానిలో అడుగు పెట్టారు. ఆయన తల్లి రాణి ఎలిజబెత్–2 వృద్ధాప్యంతో గురువారం స్కాట్లాండ్లో మరణించడం తెలిసిందే. దాంతో నిబంధనల ప్రకారం ఆ మరుక్షణం నుంచే చార్లెస్ బ్రిటన్ రాజయ్యారు. శుక్రవారం స్కాట్లండ్ నుంచి లండన్ చేరుకున్న ఆయనకు ప్రజలు ‘గాడ్ సేవ్ ద కింగ్’ అంటూ జాతీయ గీతం పాడుతూ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం రాజు హోదాలో చార్లెస్ తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. దివంగత రాణికి నివాళులర్పించారు. అనంతరం ప్రధాని లిజ్ ట్రస్‌తో భేటీ అయ్యారు. అంత్యక్రియలపై అస్పష్టత ఎలిజబెత్ అంత్యక్రియలు ఎప్పుడు జరిగేదీ ఇంకా తేలలేదు. రెండు వారాల్లోపు చారిత్రక వెస్ట్‌మినిస్టర్ అబేలో అంత్యక్రియలు జరుగుతాయని బీబీసీ వెల్లడించింది. పార్లమెంటు శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమై రాణికి నివాళులర్పించింది. 96 ఏళ్లపాటు జీవించిన రాణి గౌరవార్థం సెంట్రల్ లండన్‌లో 96 రౌండ్ల గన్ సెల్యూట్ జరిగింది. శనివారం హౌజ్ ఆఫ్ కామన్స్ ప్రత్యేక భేటీలో ఎంపీలంతా కింగ్ చార్లెస్–3కి విధేయత ప్రకటిస్తూ ప్రతిజ్ఞ చేస్తారు. అనంతరం యాక్సెషన్ కౌన్సిల్ సమావేశమై చార్లెస్‌ను రాజుగా లాంఛనంగా ప్రకటించనుంది సంతాపాల వెల్లువ ఎలిజబెత్ అస్తమయం పట్ల ప్రపంచ దేశాధినేతలు దిగ్భా్రంతి వెలిబుచ్చారు. అంతర్జాతీయ సమాజం నుంచి సంతాపాలు వెల్లువెత్తాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జిల్ దంపతులు వాషింగ్టన్‌లోని బ్రిటన్ రాయబార కార్యాలయానికి వెళ్లి మరీ నివాళులర్పించారు. ‘‘రాణిది అరుదైన, గొప్ప వ్యక్తిత్వం. అమెరికన్లందరి తరఫున మా ప్రగాఢ సానుభూతి’’ అంటూ సంతాపాల పుస్తకంలో రాశారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తదితరులు కూడా సంతాప ప్రకటన విడుదల చేశారు. భారత్‌లో 11న ఆదివారం ఒక్కరోజు సంతాప దినంగా పాటించనున్నారు. -
రాణి ఎలిజబెత్–2కు భారత్ అంటే అభిమానం
లండన్: భారత్ అంటే రాణి ఎలిజబెత్–2కు ప్రత్యేకాభిమానం. బ్రిటిష్ పాలన నుంచి మనకు స్వాతంత్య్రం వచ్చాక బ్రిటన్ రాణిగా పట్టాభిషిక్తు్తరాలైన తొలి పాలకురాలు ఆమే. 1952లో రాణిగా బాధ్యతలు స్వీకరించారు. భారత సంస్కృతీ సంప్రదాయాల గురించి తెలుసుకొనేందుకు అమితాసక్తి చూపేవారు. 1961, 1983, 1997ల్లో మూడుసార్లు భారత్‌ను సందర్శించారు. ‘జలియన్‌వాలాబాగ్’పై విచారం.. 1961లో క్వీన్ ఎలిజబెత్, ప్రిన్స్ ఫిలిప్ దంపతులు తొలిసారిగా ఇండియా వచ్చారు. నాటి బాంబే, మద్రాస్, కలకత్తాలను సందర్శించారు. తాజ్మహల్నూ తిలకించారు. ఢిల్లీలో రాజ్‌ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాదరక్షలు విప్పి గౌరవం చాటుకున్నారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఢిల్లీలో రాంలీలా మైదానంలో నాటి ప్రధాని నెహ్రూ అధ్యక్షతన జరిగిన సభలో వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ భవనాన్ని ప్రారంభించారు. కామన్వెల్త్ దేశాధినేతల భేటీలో పాల్గొనేందుకు 1983లో ఎలిజబెత్ రెండోసారి భారత్ వచ్చారు. మదర్ థెరిసాకు ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్’ ప్రదానం చేశారు. ఇక భారత 50వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా 1997లో భర్తతో కలిసి మూడోసారి భారత్ వచ్చారు. వలస పాలన నాటి చేదు అనుభవాలను ప్రస్తావిస్తూ జలియన్‌వాలా బాగ్ ఉదంతం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. అమృత్‌సర్‌లో జలియన్‌వాలా బాగ్ స్మారకాన్ని సందర్శించారు. కాల్పుల్లో అమరులైన వారికి నివాళులర్పించారు. ముగ్గురు భారత రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్.వెంకట్రామన్, ప్రతిభా పాటిల్‌కు ఇంగ్లండ్‌లో రాణి ఆతిథ్యమిచ్చారు. 1983లో భారత్ పర్యటన సందర్భంగా ఇందిరాగాంధీతో... -
క్వీన్ ఎలిజబెత్–2 మృతి.. కోహినూర్ అంశం మళ్లీ తెరపైకి.. హక్కుదారు ఎవరు?
న్యూఢిల్లీ: క్వీన్ ఎలిజబెత్–2 మరణంతో కోహినూర్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. 105 క్యారెట్ల అత్యంత విలువైన ఈ వజ్రాన్ని వెనక్కి ఇచ్చేయాలంటూ భారత్‌లో పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. కోహినూర్‌ను ఇకనైనా స్వదేశానికి అప్పగించాలంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కోహినూర్ అంటే వెలుగుల కొండ అని అర్థం. 14 శతాబ్దం ఆరంభంలో దక్షిణ భారతదేశంలో తవ్వకాల్లో లభించినట్లు చరిత్రలో నమోదయ్యింది. తర్వాత పలువురు రాజులు, చక్రవర్తుల చేతులు మారుతూ వచ్చింది. చివరకు బ్రిటిష్ రాణి కిరీటంలోకి చేరింది. కోహినూర్ తమదేనంటూ భారత్, పాకిస్తాన్, ఇరాన్, అఫ్గానిస్తాన్ దేశాలు వాదిస్తున్నాయి. వజ్రానికి అసలు హక్కుదారులు ఎవరన్నదానిపై శతాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. ఇప్పుడు బ్రిటన్ రాణి మృతిచెందారంటూ కాబట్టి కోహినూర్‌ను భారత్‌కు అప్పగించాలని ట్విట్టర్లో జనం డిమాండ్ చేస్తున్నారు. బ్రిటన్ నూతన రాజుగా చార్లెస్ సింహాసనాన్ని అధిష్టించబోతున్నారు. కోహినూర్ వజ్రం పొదిగిన కిరీటాన్ని రాణి హోదాలో ఆయన భార్య కెమిల్లా పార్కర్ ధరిస్తారు. కోహినూర్ వెనక్కి రప్పించడానికి ప్రయత్నిస్తామని కేంద్రం గతంలో ప్రకటించింది. -
క్రికెటర్ చెంపపై ఆటోగ్రాఫ్ నిరాకరించిన క్వీన్ ఎలిజబెత్-2
బ్రిటన్ను 70 ఏళ్లకు పైగా పాలించి ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్షిగా నిలిచిన రాణి ఎలిజబెత్–2 96 ఏళ్ల వయసులో కన్నుమూసిన సంగతి తెలిసిందే. వేసవి విరామం కోసం స్కాట్లాండ్లోని బల్మోరల్ కోటలో ఉన్న రాణి గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని బకింగ్‌హామ్ ప్యాలెస్ ధ్రువీకరించింది. 1952లో 25 ఏళ్లకే బ్రిటన్ రాణి కిరీటం ధరించిన ఎలిజబెత్ అత్యధిక కాలం రాణిగా కొనసాగారు. ఇదిలాఉంటే 70 ఏళ్ల పాలనలో ఎన్నో చూసిన క్వీన్ ఎలిజబెత్‌కు క్రీడలతోనూ మంచి అనుబంధం ఉంది. ఆటలకు అతీతంగా ఆమె క్రీడాకారులను ప్రోత్సహించేది. ఇక క్రికెట్‌తోనూ బంధం ముడిపడి ఉన్న క్వీన్ ఎలిజబెత్.. ఇంగ్లండ్ పర్యటనకు వచ్చిన ప్రతీ జట్టును తన నివాసమైన బకింగ్హమ్ ప్యాలెస్‌కు పిలిపించుకునేది. వారితో ఫోటో సెషన్ అనంరతం అతిథి మర్యాదలు ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. అయితే క్వీన్ ఎలిజబెత్-2 గురించి ఒక ఆసక్తికర విషయం తెలుసుకుందాం. ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డెన్నిస్ లిల్లీకి.. క్వీన్ ఎలిజబెత్-2తో ప్రత్యేక అనుబంధం ఉంది. 1977లో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో సెంటనరీ టెస్టు మ్యాచ్ నిర్వహించారు. ఆ మ్యాచ్‌కు క్వీన్ ఎలిజబెత్-2 ముఖ్య అతిథిగా విచ్చేశారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరుజట్ల ఆటగాళ్లను రాణి ఎలిజబెత్ పరిచయం చేసుకున్నారు. ఈ క్రమంలో అప్పటి ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీ తనను తాను పరిచయం చేసుకొని.. ఆటోగ్రాఫ్ ఇవ్వాలంటూ అతని చెంపను చూపించాడు. అయితే ప్రోటోకాల్ సమస్య వల్ల క్వీన్ ఎలిజబెత్ ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి నిరాకరించింది. అయితే తర్వాత తన రాయబారితో సంతకంతో కూడిన ఫోటోగ్రాఫ్‌ను డెన్నిస్ లిల్లీకి పంపించడం అప్పట్లో ఆసక్తి కలిగించింది. తాజాగా క్వీన్ ఎలిజబెత్-2 మరణంపై స్పందించిన డెన్నిస్ లిల్లీ మరోసారి రాణితో ఉన్న అనుబంధాన్ని గుర్తుకుతెచ్చకున్నాడు. ఇక క్వీన్ ఎలిజబెత్-2 మరణంతో శుక్రవారం ఇంగ్లండ్, సౌతాఫ్రికా మధ్య మూడో టెస్టు తొలిరోజు ఆటను రద్దుచేశారు. క్వీన్ ఎలిజబెత్ మరణంపై స్పందించిన ఈసీబీ.. ''రాణి ఎలిజబెత్-2 ఇక లేరన్న దురదృష్టకరమైన వార్త వినాల్సి వచ్చింది. ఆమె మృతికి నివాళి అర్పిస్తూ సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు తొలిరోజు ఆటను రద్దు చేస్తున్నాం. వీటితో పాటు ఇంగ్లండ్‌లో జరిగే మిగతా టోర్నీలోని మ్యాచ్‌లను కూడా రద్దు చేశాం. దీనికి సంబంధించి ఇప్పటికే సర్కులర్ జారీ చేశాం'' అని తెలిపింది. The England and Wales Cricket Board is deeply saddened at the death of Her Majesty Queen Elizabeth II. The thoughts of everyone involved in the game are with the whole Royal Family. — England and Wales Cricket Board (@ECB_cricket) September 8, 2022 చదవండి: Queen Elizabeth II: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 ఇకలేరు రాజరికంలో క్వీన్ ఎలిజబెత్-2 సరికొత్త రికార్డు.. ఆమె ప్రస్థానంలో కీలక ఘట్టాలివే! -
Queen Elizabeth II: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 ఇకలేరు
లండన్: బ్రిటన్ను సుదీర్ఘకాలం, 70 ఏళ్లకు పైగా పాలించి ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్షిగా నిలిచిన రాణి ఎలిజబెత్–2(96) ఇకలేరు. వేసవి విరామం కోసం స్కాట్లాండ్లోని బల్మోరల్ కోటలో ఉన్న రాణి గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని బకింగ్‌హామ్ ప్యాలెస్ ధ్రువీకరించింది. రాణి ఆరోగ్యం విషమించిందనే వార్తల నేపథ్యంలో సన్నిహిత రాజకుటుంబీకులంతా ఉదయమే బల్మోరల్‌కు చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో లండన్ వాసులు, పర్యాటకులు బకింగ్‌హామ్ ప్యాలెస్ వద్దకు చేరుకుంటున్నారు. 1952లో 25 ఏళ్లకే బ్రిటన్ రాణి కిరీటం ధరించిన ఎలిజబెత్ అత్యధిక కాలం రాణిగా కొనసాగారు. ఆమె ఆరోగ్యం గత ఏడాది అక్టోబర్ నుంచి క్షీణిస్తూ వస్తోంది. వయో సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దైనందిన కార్యకలాపాలను సరిగ్గా నిర్వహించలేకపోతున్నారు. ప్రయాణాలను బాగా తగ్గించుకున్నారు. బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ నియామకాన్ని కూడా ఆమె ఇటీవల బల్మోరల్ నుంచే చేపట్టారు. ప్రభుత్వ సీనియర్ సలహాదారులతో బుధవారం వర్చువల్‌గా రాణి పాల్గొనాల్సిన ప్రీవీ కౌన్సిల్ సమావేశం ఆఖరు నిమిషంలో వాయిదా పడటంతో ఆమె ఆరోగ్య పరిస్థితులపై అనుమానాలు మొదలయ్యాయి. రాణి ఆరోగ్యాన్ని వైద్యుల బృందం దగ్గరుండి పరిశీలిస్తోందని బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటించడం ఇందుకు ఊతమిచ్చింది. ఈ నేపథ్యంలో రాణి సన్నిహిత కుటుంబ సభ్యులు బల్మోరల్ కోటకు చేరుకున్నారు. కుమారుడు ప్రిన్స్ చార్లెస్, కెమిల్లా దంపతులు, కూతురు ప్రిన్సెస్ అన్నె, మనవడు ప్రిన్స్ విలియమ్, యూకేలోనే ఉన్న ప్రిన్స్ హ్యారీ దంపతులు కూడా బల్మోరల్ వెళ్లారు. బీబీసీ ఇతర కార్యక్రమాలను రద్దు చేసి, రాణి గురించిన అప్డేట్స్ను అందిస్తోంది. రాణి ఆరోగ్యం విషమంగా ఉందని తెలియగానే పార్లమెంట్లో ఇంధన బిల్లులపై జరుగుతున్న చర్చను హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ లిండ్సే హోలె నిలిపివేశారు. ఎలిజబెత్–2 మరణంతో ఆమె కుమారుడు ప్రిన్స్ చార్లెస్ బ్రిటన్ రాజుగా, 14 కామన్వెల్త్ దేశాల అధినేతగా సంతాప కార్యక్రమాలను నిర్వహిస్తారు. తీవ్ర వేదన చెందుతున్నాం: చార్లెస్ రాజకుటుంబం తరఫున నూతన రాజు చార్లెస్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘నా ప్రియమైన తల్లి, హర్ మెజెస్టీ ది క్వీన్ మరణం నాకు, నా కుటుంబ సభ్యులందరికీ తీవ్ర వేదన కలిగిస్తోంది. ఆమె మరణంపై మేము ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాం’ అని తెలిపారు. దిగ్భ్రాంతికి గురయ్యాం: లిజ్ ట్రస్ రాణి ఎలిజబెత్ మృతితో యూకేతోపాటు యావత్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైందని నూతన ప్రధాని లిజ్ ట్రస్ పేర్కొన్నారు. డౌనింగ్ స్ట్రీట్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఆమె కృషి వల్లనే నేడు బ్రిటన్ గొప్పదేశంగా ఎదిగింది. ఆమె అంకితభావం మనందరికీ ఆదర్శం’ అని పేర్కొన్నారు. 10వ రోజున అంత్యక్రియలు ► ఎలిజబెత్–2 రాణి మరణంతో ‘ఆపరేషన్ లండన్ బ్రిడ్జి’ పేరిట తదనంతర కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ► నూతన రాజుగా ప్రిన్స్ చార్లెస్ బాధ్యతలు స్వీకరిస్తారు. ► యూకేలో జాతీయ పతాకాలను అవనతం చేశారు. ► పార్లమెంట్ వ్యవహారాలను 10 రోజులపాటు రద్దు చేశారు. జాతీయ సంతాప దినాలను ప్రకటిస్తారు. ► రాణి భౌతికకాయాన్ని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లోని థ్రోన్ రూమ్‌కు తరలిస్తారు. ఐదు రోజులపాటు అక్కడే ఉంచుతారు. ► ఆ తర్వాత వెస్ట్‌మినిస్టర్ హాల్‌కు చేరుస్తారు. అక్కడ 3 రోజులపాటు ఉంచుతారు. ► రాణికి నివాళులర్పించడానికి రోజుకు 23 గంటలపాటు సాధారణ ప్రజలను అనుమతిస్తారు. ► పదో రోజున లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబ్బే చర్చిలో క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు నిర్వహిస్తారు. ప్రధాని మోదీ సంతాపం.. క్వీన్ మరణం పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాణి మృతి బాధాకరమని, మన కాలంలో ఆమె ఒక దృఢమైన నేతగా గుర్తుండిపోతారని చెప్పారు. మాతృదేశం బ్రిటన్‌కు స్ఫూర్తిదాయక నాయకత్వాన్ని అందించారని కొనియాడారు. ప్రజా జీవితంలో గౌరవ, మర్యాదలతో మెలిగారని, తనపై ఆమె చూపిన ఆదరాభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు. 2015, 2018లో ఎలిజబెత్ రాణితో జరిగిన తన సమావేశాలను గుర్తుచేసుకున్నారు. మరణం పట్ల సంతాపం ప్రకటించారు. I had memorable meetings with Her Majesty Queen Elizabeth II during my UK visits in 2015 and 2018. I will never forget her warmth and kindness. During one of the meetings she showed me the handkerchief Mahatma Gandhi gifted her on her wedding. I will always cherish that gesture. pic.twitter.com/3aACbxhLgC — Narendra Modi (@narendramodi) September 8, 2022 -
ఎలిజబెత్ బార్బీ రాణి!
చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా ఆడుకునే బొమ్మల్లో బార్బీ చాలా ముఖ్యమైనది. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఇష్టపడేటట్టుగా ఉంటుంది బార్బీ. ఏడాదికేడాది సరికొత్త మెరుగులు దిద్దుకుంటూ వస్తోన్న బార్బీ ఇప్పుడు మహారాణి అయ్యింది. బొమ్మేంటీ మహారాణి అవడమేంటీ అనుకుంటున్నారా? ఎప్పుడూ అందంగా కనిపించే బార్బీ ఇప్పుడు మహారాణి డ్రెస్‌లో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న మహారాణులందరిలోకి బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ ఎంత ప్రత్యేకంగా ఉంటారో అందరికీ తెలిసిందే! అయితే ‘ఆమెకు నేనేమి తీసుకుపోను’ అన్నట్టుగా ఎలిజబెత్ రాణి గెటప్‌తో రెడీ అయ్యింది మన చిట్టి బార్బీ. మామూలు బార్బీ బొమ్మగా కంటే క్వీన్ ఎలిజబెత్ రూపంలో ధగధగా మెరిసిపోతూ దర్పం వెలిబుచ్చుతోంది. బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 ఇటీవల 96వ పుట్టిన రోజు జరుపుకున్నారు. క్వీన్ ఎలిజబెత్–2 బ్రిటన్ రాజవంశంలో డెబ్బైఏళ్లుగా విజయవంతంగా పాలన కొనసాగిస్తూ ప్లాటినం జూబ్లి జరుపుకోబోతున్న మొదటి వ్యక్తిగా నిలవడంతో ఆమె రూపంతో బార్బీని రూపొందించారు. ఈ పుట్టినరోజుకు బార్బీ బొమ్మను ఎలిజబెత్ రాణిలా రూపొందించి విడుదల చేసింది బార్బీ బొమ్మల కంపెనీ. గత డెభ్బై సంవత్సరాలుగా ఏడాదికో థీమ్, ప్రత్యేకతలతో బార్బీ సంస్థ మ్యాటెల్ సందర్భానుసారం బార్బీ బొమ్మలను విడుదల చేస్తోంది. ఈ ఏడాది ఎలిజబెత్ రాణి–2 పుట్టిన రోజుని పురస్కరించుకుని ఆమె రూపాన్ని బార్బీలో ప్రతిబింబించేలా చేసింది. చూబడానికి ఈ బార్బీ నిజమైన క్వీన్‌లాగే కనిపిస్తుంది జూన్ 2–5 వరకు నాలుగురోజుల పాటు ప్లాటినం జూబ్లి సెలబ్రేషన్స్‌ను నిర్వహించబోతున్నారు. బ్రిటన్ మహారాణిగా డెబ్బై ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్లాటినం జూబ్లి వేడుకలను అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలు ఉన్నందున ఏప్రిల్ 21న మహారాణి పుట్టిన రోజు వేడుకలు ప్రైవేటు ప్లేసులో కొంతమందితో మాత్రమే నిర్వహించారు. ఈ వేడుకల్లో క్వీన్ బార్బీని విడుదల చేశారు. మ్యాటెల్ విడుదల చేసిన క్వీన్ బార్బీ బొమ్మ ఐవరీ తెలుపు గౌన్ వేసుకుని నీలం రంగురిబ్బన్, తల మీద మిరుమిట్లు గొలిపే అంచున్న తలపాగ ధరించడం విశేషం. అచ్చం రాయల్ కుటుంబ సభ్యులు ధరించే గౌను, రిబ్బన్‌తో బార్బీ ఎలిజబెత్ రాణిగా మెరిసిపోతుంది. ఈ గౌనుకు సరిగ్గా నప్పే యాక్సెసరీస్‌తోపాటు ఎలిజబెత్–2 కు తన తండ్రి జార్జ్–4 ఇచ్చిన పింక్ రిబ్బన్, తలకు అలంకరించిన కిరీటంతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ‘‘మహారాణి ఏ ఈవెంట్లో కనిపించినా ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తారు. ఆమె మార్క్ కనిపించేలా ఈ డిజైన్‌ను రూపొందించాము. భవిష్యత్ ప్రపంచం కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన మహిళామణులకి గుర్తుగా ఈ సీరిస్‌ను మొదలుపెట్టాం. ఈ క్రమంలోనే క్వీన్ బార్బీని కూడా రూపొందించాం’’ అని బార్బీ సీనియర్ డిజైన్ డైరెక్టర్ రాబర్ట్ బెస్ట్ చెప్పారు. -
ఎర్త్‌షాట్ ప్రైజ్ గెలుచుకున్న భారత్
లండన్: క్వీన్ ఎలిజబెత్ II మనవడు ప్రిన్స్ విలియం లండన్‌లో జరిగిన ఎర్త్‌షాట్ ప్రైజ్ అవార్డు వేడుకల్లో కోస్టారికా, ఇటలీ, బహామాస్, భారతదేశాల ఎర్త్‌షాట్ ప్రైజ్‌లను గెలుచుకున్నాయి. వాతావరణ మార్పు గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో మన భూమిని ఏవిధంగా రక్షించుకోవాలి అనే అంశంలోని సరికొత్త ఆవిష్కరణలకు ఈ వార్షిక అవార్డులను ప్రకటించారు. మొత్త ఐదుగురు ఈ అవార్డులను గెలుచుకున్నారు. పైగా ఒక్కొక్కరిక 1.4 మిలియన్ డాలర్ల్ పౌండ్లు అందజేస్తారు. అంతేకాదు ఈ ఆవిష్కరణలు స్కాంట్లండ్లో జరిగే కాప్56 శిఖరాగ్ర సదస్సుకు ఎంతోగానో ఉపకరిస్తాయని ప్రిన్స్ విలియమ్స్ అన్నారు. (చదవండి: "అంతరిక్షంలో సినిమా షూటింగ్ విజయవంతం") ఈ మేరకు అడవుల రక్షణకు సంబంధించిన పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణ విభాగంలో కోస్టారికా రిపబ్లిక్ "ప్రకృతిని రక్షించండి పునరుద్ధరించండి" అనే అవార్డును, భారత్ వ్యవసాయ వ్యర్థాలను ఎరువుగా మార్చే పోర్టబుల్ మెషిన్‌ను సృష్టించినందుకు భారతీయ కంపెనీ తకాచర్ "క్లీన్ అవర్ ఎయిర్" అవార్డును గెలుచుకోగా, బహమాస్ పగడాలకు సంబంధించిన ప్రాజెక్టు విభాగంలోనూ, ఉత్తర ఇటాలియన్ నగరం "ఫుడ్ వేస్ట్ హబ్స్" విభాగంలోనూ, థాయ్ జర్మనీ పరిశుభ్రమైన హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే ఎలక్ట్రోలైజర్‌ను ఆవిష్కరించినందుకు అవార్డులను గెలుచుకున్నాయి . ఈ మేరకు మానవ జాతి పరిష్కరించలేని వాటిని కూడా పరిష్కరించగలదు అంటూ విలియమ్స్ ఆవిష్కర్తలపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా విలియమ్స్ మాట్లాడుతూ....."మనం పర్యావరణం కోసం తీసుకునే చర్యలు రానున్న పది సంవత్సరాల కాలంలో మనం భూమి మనుగడను నిర్దేశిస్తాయి. మన భవిష్యత్తును మనమే నిర్ధేసించుకోవాలి. మనం అనుకోవాలే గానీ సాధ్యం కానీదంటూ ఉండదు." అని అన్నారు. అయితే విలియం తండ్రి, ప్రిన్స్ చార్లెస్ కూడా దీర్ఘకాల పర్యావరణవేత్తగా ఎన్నో సేవలందించడం విశేషం. ఈ ఎర్త్‌షాట్ ప్రైజ్ వేడుకను గతేడాది అక్టోబర్ నుంచి ప్రారంభించారు. తదుపరి ఎర్తషాట్ ప్రైజ్ వేడుక యూఎస్‌లో జరుగుతుందని విలియమ్స్ ప్రకటించారు. (చదవండి: బలశాలి బామ్మ) -
మేఘన్ మార్కెల్‌పై తండ్రి ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, లండన్: బ్రిటన్ యువరాజు ప్రిన్స్హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కెల్ రాజకుటుంబం నుంచి అధికారికంగా తప్పుకున్నారు. తమకున్న రాయల్ గుర్తింపుని వదులుకున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ఒప్పందంపై హ్యారీ దంపతులు సంతకాలు చేశారు. ఇకపై వారిద్దరి పేర్లకు ముందు రాచరికాన్ని ప్రతిబింబించే గౌరవ సూచకాలు ఉండవు. అంతేకాదు బ్రిటన్ రాజ కుటుంబం వారసులుగా వారు నిర్వహించే బాధ్యతలకుగాను పన్ను రూపంలో బ్రిటన్ వాసులు చెల్లించే ఆదాయం కూడా ఇకపై వారికి అందదు. కొద్ది రోజుల క్రితమే హ్యారీ దంపతులు రాయల్ ఫ్యామిలీని విడిచిపెట్టి వెళ్లనున్నట్టు చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియకు బ్రెగ్జిట్‌ను తలపించేలా మెగ్జిట్ అన్న హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ‘హ్యారీ, మేఘన ఇక రాయల్ కుటుంబ సభ్యులు కాదు. వారి పేర్లకు ముందు గౌరవసూచకంగా వాడే టైటిల్స్‌ను (హెచ్ఆర్హెచ్) ఇకపై వాడకూడదు’’ అని బకింగ్హమ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో పేర్కొంది. చదవండి: ప్రిన్స్ హ్యారీ, మేఘన్ ఉండే బంగ్లా ఇదే! నెలల తరబడి నిర్మాణాత్మకంగా సుదీర్ఘమైన చర్చలు జరిగిన తర్వాత హ్యారీ దంపతులు రాజభవనం వీడి వెళ్లడానికి తాము సంపూర్ణంగా మద్దతునిస్తున్నట్టుగా రాణి ఎలిజబెత్ చెప్పారు. హ్యారీ, మేఘన్, వారి ముద్దుబిడ్డ ఆర్కీని రాజ కుటుంబ సభ్యులు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటారని 93 ఏళ్ల వయసున్న రాణి తన వ్యక్తిగత ప్రకటనలో తెలిపారు. తన మనవడు, మనవరాలు సొంతంగా తమ కాళ్ల మీద తాము నిలబడాలన్న నిర్ణయానికి తాను మద్దతిస్తున్నట్టు వెల్లడించారు. హ్యారీ కుటుంబం ఇకపై కెనడాలో నివసించనుంది. అయితే అప్పుడప్పుడు బ్రిటన్‌లో కూడా కాలం గడుపుతారు. అందుకోసం హ్యారీ ఫ్రాగ్మోర్ కాటేజీని తన వద్దే ఉంచుకున్నారు. ఈ కాటేజీని తన సొంతానికి వినియోగించుకుంటున్నందుకు 24 లక్షల పౌండ్లు చెల్లించాలని హ్యారీ నిర్ణయించారు. చదవండి: ‘నా గుండెను ముక్కలు చేశావు.. నాన్నా!’ మేఘన్‌కు రాణి ప్రత్యేక సందేశం మేఘన్ మార్కెల్‌కు రాణి ఎలిజబెత్ ప్రత్యేక సందేశాన్ని పంపించారు. ‘‘మేఘన్ని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. ఎంత త్వరగా ఆమె ఒక ఇంటిదైంది. ఈ రోజు జరిగిన ఒప్పందంతో ఆమె కొత్త జీవితం మరింత సంతోషంగా, శాంతిగా ముందుకు సాగాలని మా కుటుంబం ఆకాంక్షిస్తోంది’ అని ఆ సందేశంలో పేర్కొన్నారు. మిలటరీ అపాయింట్మెంట్లు సహా రాజకుటుంబం నిర్వర్తించే విధుల నుంచి కూడా వారిద్దరూ తప్పుకున్నట్టు బకింగ్హమ్ ప్యాలెస్ ధ్రువీకరించింది. ఈ పరిణామాన్ని దిగమింగుకోవడం భరించలేని కష్టంగా ఉందంటూ రాజకుటుంబం అభిమానులు పెద్ద సంఖ్యలో పోస్టులు పెట్టారు. మేఘన్ మార్కెల్ తండ్రి థామస్ మార్కెల్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ బ్రిటిష్ రాజ వంశాన్ని తమ కుమార్తె చాలా చులకన చేసిందని మేఘన్ మార్కెల్ తండ్రి థామస్ మార్కెల్ ఆరోపించారు. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన కుమార్తె ప్రవర్తనను తీవ్రంగా ఖండించారు. ప్రిన్స్ హారీ, ఆయన సతీమణి మేఘన్ ఇకపై రాజ వంశ సభ్యులుగా వ్యవహరించబోరని బకింగ్ హాం ప్యాలెస్ శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. వారు తమ జీవితాలను తమదైన రీతిలో జీవిస్తారని కూడా తెలిపింది. తాము రాజ వంశానికి సంబంధించిన విధులను తగ్గించుకుంటామని ప్రిన్స్ హారీ, మేఘన్ మార్కెల్ దంపతులు గత నెలలో ప్రకటించారు. దీంతో క్వీన్ ఎలిజబెత్, ఆమె కుటుంబ సభ్యులు, అధికారులు చర్చలు జరిపి, ఈ నిర్ణయం తీసుకున్నారు. చదవండి: తప్పంతా మేఘన్ మీదకు నెడుతున్నారు.. ఈ నేపథ్యంలో థామస్‌ను ఓ ఛానల్ ఇంటర్వ్యూలో.. ప్రతి అమ్మాయి యువరాణి కావాలని కోరుకుంటుందని థామస్ చెప్పారు. అలాంటి కల తన కుమార్తె మేఘన్‌కు సాకారమైందన్నారు. అటువంటి దానిని ఆమె వదులుకుంది. ఈ పరిణామం చాలా నిరాశ కలిగిస్తోందన్నారు. ఆమె డబ్బు కోసమే ఈ విధంగా చేసినట్లు కనిపిస్తోందని దుయ్యబట్టారు. బ్రిటిష్ రాజ వంశం సుదీర్ఘ కాలం మనగలుగుతున్న గొప్ప వ్యవస్థల్లో ఒకటని ఆయన అన్నారు. 2018లో హారీని మేఘన్ పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి, ఆ దంపతులు రాజ వంశంలో భాగమని.. వారు రాజ వంశానికి ప్రాతినిథ్యం వహించవలసి ఉంటుందని చెప్పారు. అటువంటి రాజ వంశాన్ని వీరిద్దరూ చులకన చేశారని, అగౌరవపరిచారని మండిపడ్డారు. -
కోటను విడిచినా వారు మా కుటుంబ సభ్యులే..
లండన్ : బ్రిటన్ రాజకుటుంబం నుంచి వేరుపడాలని ప్రిన్స్ హ్యారీ మేఘన్ మార్కెల్ దంపతుల నిర్ణయానికి సాండ్రింగ్‌హామ్ ఎస్టేట్‌లో జరిగిన సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం క్వీన్ ఎలిజబెత్ ’టూ)వారి నిర్ణయానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. కానీ రాజకుటుంబంలో ఈ జంట పాత్రకు సంబంధించి మరిన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని ఆమె నొక్కి చెప్పారు. తీవ్ర తర్జనభర్జనల అనంతరం శనివారం రాత్రి క్వీన్ ఒక ప్రకటనను విడుదల చేశారు. ఇక రాజకుటుంబం నుంచి విడిపోవాలని వారు నిర్ణయించిన క్రమంలో రాయల్ ఫ్యామిలీలో సభ్యులు కానందున సస్సెక్స్ వారి హెచ్ఆర్హెచ్ శీర్షికలను ఉపయోగించరాదని స్పష్టం చేశారు. అయితే, నివేదికల ప్రకారం వారిని డ్యూక్ మరియు డచెస్ ఆఫ్ సస్సెక్స్ అని పిలుస్తారు. మరోవైపు వారి బ్రటిన్ కుటుంబ ఇల్లుగా కొనసాగే ఫ్రాగ్మోర్ కాటేజ్ పునరుద్ధరణపై ప్రభుత్వం వెచ్చించిన సొమ్మును వారు తిరిగి చెల్లించాలని ప్యాలెస్ ప్రకటించింది. వార్తాకథనాల ప్రకారం ఇంటి పునరుద్ధరణకు వెచ్చించిన రూ 22.2 కోట్లను వారు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. రాజకుటుంబం నుంచి వేరుపడాలని వారు నిర్ణయం తీసుకున్నా హ్యారీ, మేఘన్, ఆర్చీ తమ కుటుంబ సభ్యుల్లో భాగంగానే ఉంటారని, గత రెండేళ్లుగా వారిపై కొనసాగుతున్న నిఘాతో వారు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నట్టు తాను గుర్తించానని ఆమె వ్యాఖ్యానించారు. నెలల తరబడి సాగిన సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయానికి వచ్చామని తెలిపారు. రాజకుటుంబం నుంచి వెనుదిరుగుతూ వారు సకల సౌకర్యాలను కాలదన్నడంతో పాటు హ్యారీ తాను నిర్వర్తించే అధికారిక సైనిక నియామకాల నుంచి కూడా వైదొలగనున్నారు. కాగా మేఘన్ ప్రస్తుతం తన కుమారుడు అర్చీతో కలిసి కెనడాలో ఉన్నారు. కాగా 2018 మేలో తనకంటే మూడేళ్లు పెద్దదైన మేఘన్‌తో ప్రిన్స్ హ్యారీ వివాహ బంధంతో ఒక్కటవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం కల్గించింది. ప్రిన్స్ హ్యారీది రాజకుటుంబం అయితే.. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మేఘన్ మార్కెల్‌తో కామన్ ఫ్రెండ్ ద్వారా కలిగిన పరిచయం పరిణయానికి దారితీసింది. ప్రిన్స్ పెళ్లాడిన మేఘన్‌కు ఇది రెండవ వివాహం కావడం గమనార్హం. చదవండి : మేఘన్ మార్కెల్ కొత్త అవతారం చదవండి :ప్రిన్స్ హ్యారీ, మేఘన్ ఉండే బంగ్లా ఇదే! -
ఫోర్బ్స్ జాబితాలో నిర్మలా సీతారామన్ హవా
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. బీజేపీ ప్రభుత్వంలో తొలి ఆర్థిక మంత్రిగా రికార్డు దక్కించుకున్న ఆమో ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఒకరిగా నిలిచారు. అంతేకాదు ఈ లిస్ట్‌లో క్వీన్ ఎలిజబెత్-2, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె,సలహాదారు ఇవాంకా ట్రంప్‌ను కూడా వెనక్కి నెట్టి ముందుకు దూసుకొచ్చారు. న్యూజిలాండ్ ప్రధాని జసిందా ఆర్డెర్న్ కంటే నిర్మలా సీతారామన్ ముందున్నారు. 'ది వరల్డ్స్ 100 మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్' జాబితాలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రపంచంలో 34 వ ర్యాంకులో నిలిచారు. క్వీన్ ఎలిజబెత్-2 15 పాయింట్లు క్షీణించి 38వ స్థానం, ఇవాంకా ట్రంప్ 18 ర్యాంకులు పడిపోయి 42 వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఇతర భారతీయ మహిళల్లో రోష్ని నాదర్ మల్హోత్రా, 54 వ స్థానంలో నిలవగా, కిరణ్ మజుందార్ షా 65 వ స్థానంలో ఉన్నారు. 61 వ స్థానంలో రిహానా, 66 వ స్థానంలో బెయోన్స్ నోలెస్, 71 వ స్థానంలో టేలర్ స్విఫ్ట్, 81 వ స్థానంలో సెరెనా విలియమ్స్, 90 వ స్థానంలో రీస్ విథర్స్ స్పూన్, స్వీడిష్బాలిక గ్రెటా థన్‌బెర్గ్ 100 వ స్థానాన్ని దక్కించుకున్నారు. కాగా జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్ వరుసగా తొమ్మిదిసారి కూడా ఈ జాబితాలో నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకోవడం విశేషం. యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు ప్రెసిడెంట్ క్రిస్టీన్ లగార్డ్ (2), నాన్సీ పెలోసి (3), యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ (4), జనరల్ మోటార్స్ సీఈవో మేరీ బార్రా (5) మేరీ బార్రా (5), మెలిండా గేట్స్, అబిగైల్ జాన్సన్, అనా ప్యాట్రిసియా బోటిన్, గిన్ని రోమెట్టి, మారిలిన్ హ్యూసన్ మిగిలిన టాప్ 5 స్థానాలను దక్కించుకున్నారు. -
మీడియా మేనేజర్ ఉద్యోగం : రూ.26 లక్షల జీతం
బకింగ్‌హ్యామ్ ప్యాలెస్ : బ్రిటిష్ రాజ కుటుంబం భారీ వేతనంతో సోషల్ మీడియా మేనేజర్ ఉద్యోగానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా క్వీన్ ఎలిజబెత్ -2 ఉనికిని మరింత గొప్పగా ఫోకస్ చేసే ఉద్దేశంతో ఈ జాబ్‌ను ఆఫర్ చేస్తోంది. సోషల్ మీడియా మేనేజర్ కావాలంటూ ది బ్రిటీష్ రాయల్ కమ్యూనికేషన్స్ టీమ్ తన జాబ్ లిస్టింగ్ వెబ్సైట్లో పేర్కొంది. ఈ మేరకు కొత్తగా ఎంపిక కాబోయే మీడియా మేనేజర్ రాణిగారిని కొత్తగా సోషల్ మీడియాలో ప్రెజెంట్ చేయాల్సి వుంటుంది. అందుకు సంబంధించిన సరికొత్త మార్గాలను అన్వేషించాలి. ఇన్స్టాగ్రామ్, ట్విటర్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీకి మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను ఆకట్టుకువాలి. వేతనం : 30వేల బ్రిటీష్ పౌండ్లు అంటే సుమారు రూ. 26,57,655 (26.5 లక్షలు). పనిగంటలు: వారానికి 37.5 గంటలు (సోమవారం నుంచి శుక్రవారం వరకు) ఇతర ప్యాకేజీలు జీతంలో 15 శాతం పెన్షన్ పథకం (6 నెలల తర్వాత). 33 రోజుల వార్షిక సెలవు (బ్యాంకు సెలవుతో కలిపి). ఉచిత భోజనం. దీంతోపాటు మీ వృత్తిపరమైన నిరంతర అభివృద్ధికి శిక్షణ ఇవ్వడం. అర్హతలు : డిగ్రీతోపాటు వెబ్సైట్లో పనిచేసిన అనుభవం, అద్భుతమైన ప్లానింగ్ ఫోటోగ్రఫీ , వీడియో నైపుణ్యాలు చాలా అవసరం. ప్రాధాన్యతలను బట్టి చురుకుగా స్పందించాలి. డిజిటల్, సోషల్ మీడియా కంటెంట్‌ను క్రియేట్ చేయాలి. లేటెస్ట్ డిజిటల్ కమ్యూనికేషన్ డెవలప్మెంట్స్ మీద పూర్తిగా పట్టు వుండాలి. సృజనాత్మక నైపుణ్యం మెండుగా ఉండాలి. డిజిటల్ కంటెంట్ రూపకల్పనలో నైపుణ్యంతోపాటు, రైటింగ్, ఎడిటోరియల్ స్కిల్స్ ఉండాలి. డిజిటల్, సోషల్ నెట్వర్క్ ప్లాట్‌ఫాంలలో రోజువారీ వార్తా విశేషాలను, ఫీచర్ కథనాలను నిశితంగా గమనించాలి, పరిశోధించాలి. తద్వారా వివిధ ఆడియెన్స్ గ్రూపులను మీడియా మేనేజర్‌గా ఆకర్షించాలన్నమాట. -
స్త్రీలోక సంచారం
♦ బ్రిటన్ రాజవంశంలో ఈ ఏడాది జరిగిన రెండో పెళ్లి అనామకంగా ఉండిపోయింది! మే 19 జరిగిన మొదటి పెళ్లి క్వీన్ ఎలిజబెత్–2 మనవడు (క్వీన్ తొలి సంతానం ప్రిన్స్ చార్ల్స్ రెండో కొడుకు) ప్రిన్స్ హ్యారీది కాగా.. రెండోది అక్టోబర్ 12న జరిగిన యూజీనీ (28) వివాహం. యూజినీ.. రాణిగారి మూడో సంతానం ప్రిన్స్ ఆండ్రూ, ఆయన మాజీ భార్య సారా ఫెర్గూసన్‌ల చిన్న కూతురు. 32 ఏళ్ల వైన్ మర్చంట్, బాయ్ ఫ్రెండూ అయిన జాక్ బ్రూక్స్బ్యాంక్తో జరిగిన యూజినీ పెళ్లికి నటి లివ్ టేలర్, మోడల్ నవోమీ క్యాంప్‌బెల్, గాయకుడు జేమ్స్ బ్లంట్, గాయని ఎల్లీ గోల్డింగ్ వంటి కొద్దిమంది ప్రముఖులు మాత్రమే ఆహ్వానాలపై హాజరయ్యారు. పదిహేనవ శతాబ్దపు సెయింట్ జార్జి చాపెల్‌లో ఏర్పాటైన కల్యాణ ప్రాంగణంలో అతి తక్కువ సంఖ్యలో చారిటీ గెస్టులు, 1200 మంది వరకు సామాన్య ప్రజలు కనిపించారు. ఏమైనా యూజినీ పెళ్లి మరికొంత ఘనంగా జరిగి ఉండాల్సిందని బ్రిటన్ పత్రికలు కొన్ని అప్పుడే రాయడం మొదలుపెట్టేశాయి. ♦ మీటూ ప్రభావంతో కార్పోరేట్ ఆఫీస్‌లన్నీ ఉద్వేగాలపరంగా ఘనీభవించిపోతున్నాయని తాజా సర్వేల ఫలితాలు వెలువడుతున్నాయి! ‘‘మీటూ కంటే ముందే, పనిచేసే చోట మహిళలపై జరిగే లైంగిక వేధింపులను నిరోధించడానికి చట్టాలు ఉన్నప్పటికీ ఇప్పటిలా స్వేచ్ఛగా మహిళా ఉద్యోగులు బయటపడేవారు కాదు. మీటూ వచ్చాక బాధితులకు రెక్కలు వచ్చినట్లయింది’’ అని ‘షీరోస్’ సంస్థ వ్యవస్థాపక సీఈవో సైరీ చాహల్.. మీటూ ప్రభావంపై సర్వే జరిపేందుకు వచ్చిన ప్రతినిధులతో అన్నారు. ‘షీరోస్’ అనే ఈ సంస్థ మహిళల సంక్షేమం, సాధికారతల కోసం పని చేస్తుంటుంది. ప్రొఫెషనల్ కౌన్సెలింగ్, వెల్నెస్ సేవలు అందిస్తుండే వన్ టు వన్ ‘హెల్ప్ డాట్ నెట్’ సంస్థ డైరెక్టర్ అర్చనా బిష్త్ కూడా మీటూ తర్వాత మహిళలకు భావప్రకటన స్వాతంత్య్రం వచ్చిందనే అభిప్రాయపడుతున్నారు. ‘‘ఏమైనా ఇప్పుడు వీస్తున్న బలమైన మీటూ గాలులు మూల మూలల నుంచి ‘ఆడవాళ్ల వేటగాళ్లను’ బయటికి లాగి పడేయబోతున్నాయని అర్థమౌతోంది. ఇది ఆరంభం మాత్రమే. జరగవలసింది ఎంతో ఉంది’’ అని అర్చన అన్నారు. ‘‘తమపై జరుగుతున్న లైంగిక వేధింపులపై మాట్లాడ్డానికే భయపడే మహిళా ఉద్యోగులు ఇప్పుడు కంప్లయింట్ ఇవ్వగలుగుతున్నారంటే.. సంస్థల యాజమాన్యాలు వారికి ఇస్తున్న మద్దతు కూడా ఒక ప్రధాన కారణమే’’ అని ముంబైలోని ప్రముఖ స్టార్‌అప్ కంపెనీ ప్రతినిధి ఒకరు తమ కార్యాలయానికి సర్వేకోసం వచ్చిన వారితో వ్యాఖ్యానించారు. ♦ అన్ని వయసుల మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశం కల్పిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా కేరళ వ్యాప్తంగా అయ్యప్ప భక్తులు (మహిళాభక్తులు సహా) ప్రదర్శనలు జరుపుతున్న నేపథ్యంలో తాజాగా.. జెండర్ కార్యకర్త తృప్తి దేశాయ్ తను శబరిమలను దర్శించి తీరుతానని, మహిళల ప్రాథమిక హక్కులను ఎవ్వరూ అడ్డుకోజాలరని ముంబైలోని ఒక మలయాళం టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడంతో భక్తుల ఆగ్రహావేశాలు మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో.. శబరిమలను దర్శించే సాహసం చేసే ఏ మహిళనైనా రెండు ముక్కలుగా చీల్చేస్తాని మలయాళ నటుడు కొల్లం తులసి (69) అనడం వివాదాస్పదమై, అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
రాయల్ ఫ్యామిలీ ఇంట ‘గే’ జంట పెళ్లి
సాక్షి, న్యూఢిల్లీ : బ్రిటన్ రాజ కుటుంబంలో విహహం అంటే ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు ఉంటుందని అందరికీ తెలుసు. గత నెలలో రాజ కుమారుడు హ్యారీ, మేఘన్ మార్కెల్ వివాహం కూడా అలాగే జరిగింది. ఇదంతా ఒకెత్తయితే రాయల్ ఫ్యామిలీలో ఇప్పుడొక ‘గే’ జంట వివాహాం జరగనుంది. క్వీన్ ఎలిజబెత్ సోదరుడు లార్డ్ ఇవార్ మౌంట్ బాటన్, తన సహచరుడు జేమ్స్ కోయల్ను పెళ్లాడనున్నారు. ఈ మేరకు రాయల్ ఫ్యామిలీ సోమవారం ప్రకటించింది. వచ్చే వేసవి కాలంలో ఈ పెళ్లి జరగనుందని తెలిపింది. గే పెళ్లిళ్లు గతంలో జరిగినా రాజ కుటుంబంలో ఇదే తొలిసారి. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల హాజరులో డివాన్ పట్టణంలోని ఒక చర్చిలో ఈ వేడుక జరగనుంది. కాగా, ఇవార్ మౌంట్ బాటన్ తన భార్య పెన్నీ బాటన్‌కు 2016లో విడాకులు ఇచ్చారు. వీరికి ఎల్లా అనే కూతురు ఉంది. The Milford Haven Ruby Tiara: Lady Penelope Mountbatten wears the Milford Haven Ruby tiara at her wedding to Lord Ivar Alexander Michael Mountbatten on April 23, 1994. It was the last time it was seen until it showed up in Russia again...hmmm 👀#antique #atiaraaday #aristocracy #bolin #britain #crown #cabochon #diamonds #fluerdelys #gold #history #heart #jewelry #jewelrynerd #lordivarmountbatten #motif #monarchy #milfordhavenrubytiara #royal #rubies #royalty #russian #royalbrides #star #tiara #ladypenelopemountbatten #rubytiara A post shared by A Tiara A Day (@a.tiara.a.day) on Jan 6, 2016 at 8:10pm PST Royal family's first gay wedding: Queen Elizabeth’s cousin to tie the knot . Lord Ivar Mountbatten, a cousin of Queen Elizabeth (whose husband Prince Philip's last name is Mountbatten) is set to marry his partner James Coyle in what will be the first gay wedding in British royal family history. According to E! News, Lord Ivar became the first openly gay extended member of the royal family when he came out in 2016 and revealed his relationship with James. In an interview with Daily Mail, Lord Ivar opens up about struggling with his sexuality during his 16-year marriage to ex-wife, Penny, who he shares three children with. Following their divorce 8 years ago, the former couple are still friends with Penny even scheduled to give her ex-husband away when he marries James in the private chapel on his magnificent country estate in Devon. - “It makes me feel quite emotional. I'm really very touched,” Penny said of the honour. And, of course, the couple have the blessing of his entire family including lifelong friend, Prince Edward, Earl of Wessex - aka Queen Elizabeth’s youngest son - and his wife Sophie, Countess of Wessex. - “Sophie and Edward know of our plans and are really excited for us,” says Lord Ivar, adding that sadly the royal couple will not be able to attend the wedding due to prior engagements.” - The couple will tie the knot in a small, private ceremony in front of 120 family members and close friends. #royalfamily #queenelizabeth #jamescoyle #gaywedding #lordivarmountbatten A post shared by MediaGuide.NG (@mediaguide.ng) on Jun 18, 2018 at 4:03pm PDT -
రాచరిక విధులకు ఫిలిప్ స్వస్తి
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 భర్త, ప్రిన్స్ ఫిలిప్ (95) రాచరిక విధులకు దూరమవుతున్నారు. వచ్చే నవంబర్ నుంచి ఆయన ప్రిన్స్ హోదాలో బహిరంగ సభలు, కార్యక్రమాల్లో పాల్గొనబోరు. ఈ మేరకు బకింగ్‌హామ్ ప్యాలెస్ గురువారం అధికారిక ప్రకటన చేసింది. అయితే అంతకుముందే నిర్ణయించిన కార్యక్రమాల్లో ఈ ఏడాది ఆగస్టు వరకు పాల్గొంటారని.. ఇకపై కొత్త ఆహ్వానాలను మాత్రం స్వీకరించరని ఆ ప్రకటన వెల్లడించింది. అలాగే 780కి పైగా సంస్థలతో తన అనుబంధాన్ని కొనసాగిస్తారని.. కాకుంటే ఆయా సంస్థల కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనరని తెలిపింది. రాణి మాత్రం యథావిధిగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొంది. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని థెరెసా మే ఇప్పటివరకు సేవలు అందించినందుకు ఫిలిప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలంటూ ఆమె ఆకాంక్షించారు. అంతకుముందు బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారన్న వార్త కలకలం సృష్టించింది. దీంతో బ్రిటన్ రాణి ఎలిజబెత్, ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ ఆరోగ్యంపై ఊహాగానాలు చెలరేగాయి.