Royal Wedding
-
‘నా గుండెను ముక్కలు చేశావు.. నాన్నా!’
లండన్ : డచెస్ ఆఫ్ ససెక్స్, బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్కెల్ తనకు రాసిన భావోద్వేగ లేఖను ఆమె తండ్రి థామస్ మార్కెల్ బహిర్గతం చేశారు. యువరాణి హోదా పొందిన నాటి నుంచి తనకీ, తన కూతురికీ మధ్య బంధం పూర్తిగా తెగిపోయిందంటూ అనేకమార్లు థామస్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె నుంచి స్పందన రాలేదని, ఈ విషయంలో కలగజేసుకోవాల్సిందిగా బ్రిటన్ మహారాణి ఎలిజబెత్‌కు కూడా అభ్యర్థించారు. ఈ క్రమంలో గత వారం ఓ మ్యాగజీన్ ఇచ్చిన ఇంటర్య్యూలో భాగంగా మేఘన్ స్నేహితులు.. థామస్ ఎప్పుడూ మేఘన్‌ను సంప్రదించే ప్రయత్నం చేయలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గతేడాది ఆగస్టులో మేఘన్ తనకు రాసిన లేఖను థామస్ ఆదివారం బయటపెట్టారు. తన మెసేజ్‌లకు స్పందనగానే మేఘన్ ఈ లేఖ రాసిందని పేర్కొన్నారు. నా గుండె ముక్కలు చేశావు నాన్నా! ‘నాన్నా.. బరువెక్కిన హృదయంతో ఈ లేఖ రాస్తున్నా. నువ్వింత గుడ్డిగా ఎందుకు ప్రవర్తిస్తున్నావో అర్థం కావడం లేదు. నన్ను బాధ పెట్టడానికి ఈ దారి ఎందుకు ఎంచుకున్నావు. నువ్వు నా గుండెను పది లక్షల ముక్కలు చేశావు. నువ్విలా ఎందుకు చేస్తున్నావు. మీడియాతో చెప్పినట్లుగా నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే.. ఇలాంటి ఆరోపణలు ఆపెయ్. దయచేసి మా బతుకులు మమ్మల్ని బతకనివ్వు. ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నా. అబద్ధాలు చెప్పడం మానెయ్. నాకు బాధ కలిగించడం మానెయ్. నా భర్తతో నాకు ఉన్న అనుబంధాన్ని దూరం చేసేందుకు ప్రయత్నించకు. నా పెళ్లికి రాలేకపోయావెందుకు’ అని మేఘన్ పేరిట ఉన్న ఉత్తరాన్ని థామస్ మీడియా ‘డెయిలీ మెయిల్’ ద్వారా బహిర్గతం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ ఈ లేఖ నన్ను చాలా బాధించింది. నేను కుంగిపోయాను. ఈ లేఖను ఎవ్వరికీ చూపించలేదు. కానీ లేఖ రావడం మంచి విషయమే కదా. తను ఒక్క ఫోన్ చేస్తే చాలు ఇదంతా ముగిసిపోతుంది. నా కూతురు ఏదో ఒకరోజు దగ్గరవుతుందనే నమ్మకం ఉంది’ అని వ్యాఖ్యానించారు. కాగా హాలీవుడ్ నటి మేఘన్.. బ్రిటన్ యువరాజు హ్యారీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది మే నెలలో జరిగిన వీరి వివాహ వేడుకకు ఆమె తండ్రి హాజరుకాలేదు. ఇక అప్పటి నుంచి మేఘన్‌ను మారిపోయిందంటూ ఆమె తండ్రి ఆరోపిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. -
‘దయచేసి నా కూతురిని నాకు దగ్గర చేయండి’
లండన్ : తనకి, తన కూతురికి మధ్య ఏర్పడిన ‘అగాథాన్ని’పూడ్చేందుకు బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ చొరవ తీసుకోవాలని మేఘన్ మార్కెల్ తండ్రి థామస్ మార్కెల్ అభ్యర్థించారు. హాలీవుడ్ నటి మేఘన్.. బ్రిటన్ యువరాజు హ్యారీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో జరిగిన వీరి వివాహ వేడుకకు ఆమె తండ్రి హాజరుకాలేదు. ఈ క్రమంలో మేఘన్ పెళ్లైన నాటి నుంచి ఆమెతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని థామస్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మేఘన్‌ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. తను నాకోసం క్రిస్మస్ కార్డులు పంపుతుందని ఇన్నాళ్లూ ఎదురుచూశాను. తనకు ఎన్నోసార్లు మెసేజ్ కూడా చేశాను. కానీ ఆమె నుంచి ఎటువంటి స్పందనా లేదు. దయచేసి నా కూతురిని నాకు దగ్గర చేయండి. త్వరలోనే బుల్లి మేఘన్ లేదా బుల్లి హ్యారీ రాబోతున్నారు. కాబట్టి ఇటువంటి సంతోష సమయంలో నేను తనని కలవాలనుకుంటున్నాను. ఈ విషయంలో మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా నాకు సమ్మతమే రాణీగారు. కుటుంబంలో తలెత్తిన సమస్యలను క్వీన్ ఎలిజబెత్ పరిష్కరిస్తారనే నమ్మకం ఉంది. రాజ కుటుంబంలోనైనా, సాధారణ కుటుంబాల్లోనైనా కుటుంబ సభ్యులంతా కలిసి ఉంటేనే సంతోషం కదా. నా బాధను అర్థం చేసుకోండి’ అంటూ థామస్ మార్కెల్ సోమవారం ఎలిజబెత్‌కు విన్నవించారు. కాగా యువరాణి హోదా పొందిన నాటి నుంచి తన కూతురి మోముపై చిరునవ్వు మాయమైందంటూ థామస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ‘నా కూతురి నవ్వు ఎలా ఉంటుందో నాకు తెలుసు. చిన్నతనం నుంచి తన నవ్వుని చూస్తున్నాను. ఇప్పుడు ఆమె మొహంలో కనిపించే చిరునవ్వు నిజమైనది కాదు. ఆ చిరునవ్వు వెనక ఎంతో బాధ ఉంది’ అది నాకు స్పష్టంగా కనిపిస్తుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాక ‘మేఘన్‌కు వివాహం అయిన నాటి నుంచి ఆమెతో మాట్లాడలేదు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదు. స్వయంగా కలుద్దామంటే ఆమె చిరునామ నా దగ్గర లేదు’ అని ఆయన కంటతడి పెట్టారు. ఇక ఈ విషయంపై క్వీన్ ఎలిజబెత్ ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే. -
రాయల్ ఫ్యామిలీ ఇంట ‘గే’ జంట పెళ్లి
సాక్షి, న్యూఢిల్లీ : బ్రిటన్ రాజ కుటుంబంలో విహహం అంటే ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు ఉంటుందని అందరికీ తెలుసు. గత నెలలో రాజ కుమారుడు హ్యారీ, మేఘన్ మార్కెల్ వివాహం కూడా అలాగే జరిగింది. ఇదంతా ఒకెత్తయితే రాయల్ ఫ్యామిలీలో ఇప్పుడొక ‘గే’ జంట వివాహాం జరగనుంది. క్వీన్ ఎలిజబెత్ సోదరుడు లార్డ్ ఇవార్ మౌంట్ బాటన్, తన సహచరుడు జేమ్స్ కోయల్ను పెళ్లాడనున్నారు. ఈ మేరకు రాయల్ ఫ్యామిలీ సోమవారం ప్రకటించింది. వచ్చే వేసవి కాలంలో ఈ పెళ్లి జరగనుందని తెలిపింది. గే పెళ్లిళ్లు గతంలో జరిగినా రాజ కుటుంబంలో ఇదే తొలిసారి. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల హాజరులో డివాన్ పట్టణంలోని ఒక చర్చిలో ఈ వేడుక జరగనుంది. కాగా, ఇవార్ మౌంట్ బాటన్ తన భార్య పెన్నీ బాటన్‌కు 2016లో విడాకులు ఇచ్చారు. వీరికి ఎల్లా అనే కూతురు ఉంది. The Milford Haven Ruby Tiara: Lady Penelope Mountbatten wears the Milford Haven Ruby tiara at her wedding to Lord Ivar Alexander Michael Mountbatten on April 23, 1994. It was the last time it was seen until it showed up in Russia again...hmmm 👀#antique #atiaraaday #aristocracy #bolin #britain #crown #cabochon #diamonds #fluerdelys #gold #history #heart #jewelry #jewelrynerd #lordivarmountbatten #motif #monarchy #milfordhavenrubytiara #royal #rubies #royalty #russian #royalbrides #star #tiara #ladypenelopemountbatten #rubytiara A post shared by A Tiara A Day (@a.tiara.a.day) on Jan 6, 2016 at 8:10pm PST Royal family's first gay wedding: Queen Elizabeth’s cousin to tie the knot . Lord Ivar Mountbatten, a cousin of Queen Elizabeth (whose husband Prince Philip's last name is Mountbatten) is set to marry his partner James Coyle in what will be the first gay wedding in British royal family history. According to E! News, Lord Ivar became the first openly gay extended member of the royal family when he came out in 2016 and revealed his relationship with James. In an interview with Daily Mail, Lord Ivar opens up about struggling with his sexuality during his 16-year marriage to ex-wife, Penny, who he shares three children with. Following their divorce 8 years ago, the former couple are still friends with Penny even scheduled to give her ex-husband away when he marries James in the private chapel on his magnificent country estate in Devon. - “It makes me feel quite emotional. I'm really very touched,” Penny said of the honour. And, of course, the couple have the blessing of his entire family including lifelong friend, Prince Edward, Earl of Wessex - aka Queen Elizabeth’s youngest son - and his wife Sophie, Countess of Wessex. - “Sophie and Edward know of our plans and are really excited for us,” says Lord Ivar, adding that sadly the royal couple will not be able to attend the wedding due to prior engagements.” - The couple will tie the knot in a small, private ceremony in front of 120 family members and close friends. #royalfamily #queenelizabeth #jamescoyle #gaywedding #lordivarmountbatten A post shared by MediaGuide.NG (@mediaguide.ng) on Jun 18, 2018 at 4:03pm PDT -
ఆమె చెప్పుల ధర వింటే షాకవుతారు!
బెర్క్‌షైర్: బ్రిటన్ రాజకుమారుడు హ్యారీ(33), అమెరికా నటి మేఘన్ మార్కల్(36)ల వివాహం శనివారం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. బ్రిటన్‌లోని బెర్క్‌షైర్ కౌంటీ విండ్సర్లోని సెయింట్ జార్జి చర్చిలో జరిగిన ఈ వేడుకకు సుమారు 600 మంది విశిష్ట అతిథులు హాజరయ్యారు. మరో 2,640 మంది విండ్సర్ మైదానం నుంచి, లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా టీవీల్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ వివాహానికి హాజరైన ప్రముఖుల్లో భారత నటి ప్రియాంక చోప్రా కూడా ఉన్నారు. ప్రియాంక ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. బ్రిటన్ మహారాణి ఇంట జరుగుతున్న వివాహం కాబట్టి దానికి తగ్గట్టే ప్రియాంక కూడా రాయల్ లుక్‌లో ఆమె అదిరిపోయారు. డ్రస్ నుంచి ఆమె వేసుకున్న హీల్స్ వరకు ప్రతీది ఆకట్టుకునే రీతిలోనే ఉన్నాయి. ఈ వెడ్డింగ్‌లో ప్రియాంక వేసుకున్న హీల్స్ ఖరీదు వింటే మీకు మాటే రాకపోవచ్చు. స్వరోక్సి క్రిస్టల్స్‌తో ఇవి రూపొందిన ప్రియాంక చెప్పుల ఖరీదు రూ.1.35 లక్షలని తెలిసింది. ఆమె వీటిని ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్నట్టు తెలిసింది. మేఘన్, ప్రియాంకకు మంచి స్నేహితురాలు. ఈ వివాహంతో మేఘన్ జీవితం మారిపోతుందని, మేఘన్ చాలా తెలివైన నటి అని ప్రియాంక పేర్కొంది. -
రాకుమారుడికి కుర్తా...రాణిగారికి చీర
ముంబై : బ్రిటన్ రాజకుమారుడు హ్యారీ(33), అమెరికా నటి మేఘన్ మార్కల్(36)ల వివాహం శనివారం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. బ్రిటన్‌లోని బెర్క్‌షైర్ కౌంటీ విండ్సర్లోని సెయింట్ జార్జి చర్చిలో జరిగిన ఈ వేడుకకు సుమారు 600 మంది విశిష్ట అతిథులు హాజరయ్యారు. వారిలో మనదేశానికి చెందిన బాలీవుడ్ నటి ప్రియాంరా చోప్రాతో పాటు ముంబై కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ ‘మైనా మహిళా ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలు సుహానీ జలోటా కూడా హాజరయ్యారు. వివాహ వేడుక సందర్భంగా ఈ జంటకు వివిధ దేశాల నుంచి బహుమతులు అందుతుండగా, వాటిలో మన దేశానికి చెందినవి కూడా ఉన్నాయ. ఈ రాయల్ వెడ్డింగ్‌కు మన దేశం నుంచి ముంబైకి చెందిన డబ్బావాలాలు, భారతీయ ‘పెటా’ సంస్థ బహుమతులు పంపారు. చీరను పంపిన డబ్బా వాలాలు.... ముంబైకి చెందిన డబ్బావాలలతో బ్రిటన్ రాజ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. 2003 భారతదేశ పర్యటనకు వచ్చిన ప్రిన్స్ చార్లెస్‌కు తొలిసారి డబ్బావాలలతో పరిచయం ఏర్పడింది. డబ్బావాలాల పనితీరు, సమయ పాలన, నిబద్థత ప్రిన్స్ చార్లెస్‌ను ఎంతో ఆకట్టుకున్నాయి. వారి పనితీరును మెచ్చుకోవడమే కాక తన వివాహ వేడుకకు డబ్బావాలాలను కూడా ఆహ్వానించాడు చార్లెస్. నాటినుంచి డబ్బావాలాలకు రాజకుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. అయితే ప్రస్తుతం జరిగిన మేఘన్ మార్కెల్, ప్రిన్స్ హ్యారీల వివాహానికి వీరిని ఆహ్వానించలేదు. అయినప్పటికీ ప్రిన్స్ చార్లెస్‌తో ఉన్న అనుబంధం దృష్ట్యా నిన్న జరిగిన ప్రిన్స్ హ్యారీ వివాహానికి డబ్బావాలాల తరుపున వీరు ప్రత్యేక బహుమతులు పంపారు. రాకుమారుడు హ్యారీ కోసం కుర్తా, తలపాగాను, మేఘనా మార్కల్ కోసం పసుపు, ఆకుపచ్చ రంగుల కలయికలో ఉన్న ‘పైథానీ’ చీరను బహుమతిగా పంపారు. అంతేకాక వివాహ వేడుక సందర్భంగా ముంబై ప్రభుత్వ ఆస్పత్రిలోని రోగుల కుటుంబాలకు మిఠాయిలు పంచారు. ఈ విషయం గురించి డబ్బావాలా అసోసియేషన్ ప్రతినిధి సుభాష్ తాలేకర్ ‘గతంలో ప్రిన్స్ చార్లెస్ వివాహానికి మమ్మల్ని ఆహ్వానించారు. ఆ వేడకకు హాజరయిన మమ్మల్ని సాదరంగా ఆదరించిడమే కాక మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. అందుకే ప్రిన్స్ హ్యారీ వివాహా వేడుకకు మమ్మల్ని ఆహ్వానించనప్పటికి, మేము మా సంతోషాన్ని తెలపాలనుకున్నాం. అందుకే ఇలా మా తరఫున బహుమతులు పంపామ’న్నారు. పెటా బహుమతి ‘మెర్రి’... డబ్బావాలాలతో పాటు ‘పెటా’(పిపుల్ ఫర్ ద ఎథికల్ ట్రిట్మెంట్ ఆఫ్ ద అనిమల్స్) కూడా మేఘన్ మార్కెల్, ప్రిన్స్ హ్యారీల వివాహానికి బహుమతి పంపింది. వీరి వివాహానికి గుర్తుగా ‘పెటా’ ఒక ఎద్దుకు వీరిద్దరి పేర్లు కలిసేలా ‘మెర్రి’(మేఘన్లో మె, హ్యారీలో రి కలిపి మెర్రి) అనే పేరును పెట్టి, ఆ ఎద్దు ఫోటో తీసి దానితో పాటు ఒక సందేశాన్ని కూడా పంపారు. ‘మెర్’రి(ఎద్దు) ని పూలమాలతో అలంకరించి ఫోటో తీసారు. ఫోటోతో పాటు పంపిన సందేశంలో మెర్రి కథను తెలియజేసారు. ఆ సందేశంలో ‘కొన్నాళ్ల క్రితం మహారాష్ట్రలో గాయలతో, ఒంటరితనంతో బాధపడుతున్న మెర్రిని చూడటం జరిగింది. పాపం అది తన జీవిత కాలమంతా బరువులను మోస్తూ సేవ చేసింది. వయసు పైబడి, అనారోగ్యంతో బాధపడుతున్న మెర్రిని ఇప్పుడిలా ఒంటరిగా వదిలేసారు. మేము ‘మెర్రి’ బాధ్యతను తీసుకుని, దానికి వైద్యం చేయించి ఒక సంరక్షణా కేంద్రానికి తరలించాము. ప్రస్తుతం ‘మెర్రి’ సంరక్షణా కేంద్రంలో విశ్రాంతి తీసుకుంటూ తన మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతుంద’ని తెలిపారు. ‘ఈ రాయల్ వెడ్డింగ్ సందర్భంగా జనాలకు మూగ జీవుల పట్ల దయగా వ్యవహరించాలనే సందేశాన్ని ప్రచారం చేయాలని భావించాము...అందుకే మెర్రి(ఎద్దు) ఫొటోను బహుకరించామ’ని పెటా అసోసియేట్ డైరెక్టర్ సచిన్ బంగోరా తెలిపారు. -
ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్‌ల వివాహ వేడుక
-
రాయల్ వెడ్డింగ్ : ఒక్కటైన వధూవరులు
ఎన్నో రోజులుగా ప్రపంచవ్యాప్త అభిమానులను ఊరిస్తున్న రాయల్ వెడ్డింగ్ విండ్సర్ క్యాజిల్‌లో కన్నుల పండువగా జరిగింది. వరుడు ప్రిన్స్ హ్యారీ, వధువు మేఘన్ మార్కెల్లు ముసిముసి నవ్వులతో రింగులు మార్చుకుని ఒక్కటయ్యారు. మేఘన్, ప్రిన్స్‌లను భార్యభర్తలుగా జస్టిన్ వెల్బీ అధికారికంగా ప్రకటించారు.వీరి వివాహ వార్త అధికారికంగా ప్రకటించగానే చాపెల్ వెలుపల సంబురాలు ప్రారంభయ్యాయి. వేడుకకు ముందు.... ప్రిన్స్‌ను మనువాడేందుకు మేఘన్ చర్చిలోకి రాగానే వివాహానికి వచ్చిన అతిథులందరూ లేచి నిల్చున్నారు. రాయల్ వెడ్డింగ్‌కు వధువు తండ్రి థామస్ రాలేకపోవడంతో, వరుడు తండ్రి ప్రిన్స్ ఛార్లెస్ ఆమెకు తండ్రిగా విండ్సర్ క్యాజిల్లోకి నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఈ వివాహానికి భారీ ఎత్తున్న అతిథులు హజరయ్యారు. ఈ వేడుకలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా, డేవిడ్, విక్టోరియా బెక్హాం, జార్జ్, అమల్, టెన్నీస్ స్టార్ సెరెనా విలియమ్స్‌లు కూడా పాల్గొన్నారు. వివాహ వేడుకతో విండ్సర్ క్యాజిల్ చర్చి వీధులన్నీ గానా బజానాలతో, అతిథులతో కిటకిటలాడాయి. మేఘన్ మార్కెల్, బ్రిటీష్ డిజైనర్ క్లేర్ వెయిట్ కెల్లర్ డిజైన్ చేసిన డ్రెస్‌ను ధరించారు. ప్రిన్స్ హ్యారీ రింగ్ ప్లాటినం బాండ్‌తో ఉండగా... మార్కెల్ వెడ్డింగ్ రింగ్ వెల్ష్ గోల్డ్‌తో రూపొందినట్టు కెన్సింగ్టన్ ప్యాలెస్ చెప్పింది. ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్‌లకు బ్రిటన్ ప్రధాని థెరెస్సా మే ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘ఇందు మూలముగా తెలియజేయడం ఏమనగా.. బ్రిటన్ మహారాణి రెండవ ఎలిజబెత్ తన చిన్న మనవడు ప్రిన్స్ హ్యారీ వివాహానికి సమ్మతించారహో..’ బకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి మొన్న శనివారమే ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. వీరి వివాహ వేడుక నేడు ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. -
రాయల్ వెడ్డింగ్‌లో మేఘన్‌కు లోటు...
లాస్ ఏంజెల్స్ : బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీ, హాలీవుడ్ నటి మేఘన్ మార్కెల్‌ల వివాహం జరగనున్న విషయం తెలిసిందే. ఇరు కుటుంబాలకు ఎంతో ప్రత్యేకమైన ఈ వేడుకలో మేఘన్‌ను మాత్రం ఓ లోటు వెంటాడనుంది. ఈ నెల(మే) 19న లండన్‌లో అత్యంత వైభవంగా జరిగే పెళ్లి వేడుకకు మేఘన్ తండ్రి థామస్ మార్కెల్ హాజరుకావడం లేదని ఓ వెబ్సైట్ పేర్కొంది. గత వారం గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరిన మేఘన్ తండ్రి థామస్‌ను ప్రస్తుతం డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా హెచ్చరించారు. 74 ఏళ్ల థామస్‌కు బుధవారం హార్ట్ సర్జరీ జరగనున్న నేపథ్యంలో ఆస్పత్రి నుంచి కదలకూడదని వైద్యులు చెప్పడంతో కూతురు పెళ్లికి హాజరుకాలేకపోతున్నారు. ప్రస్తుతం ఆయన మెక్సికోలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం మేఘన్ సవతి సోదరుడు రాసిన లేఖ మరోసారి చర్చనీయాంశమైంది. 'మేఘన్ మార్కెల్ మీకు తగిన వధువు కాదు. ఆమె నిజ స్వరూపం మీకు తెలియదు. ఆమె మా నాన్నను ఒంటరిగా మెక్సికోలో వదిలేసి వెళ్లిపోయింది. మేఘన్‌ను నటిని చేసేందుకు నాన్న ఎన్నో కష్టాలు పడ్డారు. అప్పులు కూడా చేశారు. ఆమె నటి అయిన తర్వాత కూడా నాన్న అప్పులు తీర్చలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడి నుంచి ఈ స్థాయికి వచ్చిందో మేఘన్ మరిచి పోయింది. నటి అయ్యాక కుటుంబం కష్టాలు తీర్చాల్సిన బాధ్యతలను గాలికొదిలేసిన మేఘన్.. ఉన్నత కుటుంబంలో వ్యక్తి అయ్యాక ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోవాలి. పెళ్లికి రావాలంటూ తెలియని వారికి కూడా ఆహ్వానాలు పంపుతోంది. కానీ మా కుటుంబంలో ఒక్కరికీ కూడా వివాహ ఆహ్వానం అందలేదని’ అతడు లేఖలో పేర్కొన్నాడు. -
బ్రిటీష్ ప్రిన్స్ పెళ్లికి ప్రియాంక
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా బ్రిటీష్ రాయల్ వెడ్డింగ్‌కి హాజరు కానున్నారు. తన హాలీవుడ్ స్నేహితురాలు మేఘన్ మార్కెల్- బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీల వివాహ మహోత్సవంలో పాల్గొనాలని ఆమెకు పిలుపు అందింది. ఈ నెల 19న లండన్‌లోని విండ్సర్ క్యాజిల్‌లో జరగబోయే పెళ్లి వేడుకకు ప్రియాంక హాజరు కానున్నారు. తన స్నేహితురాలి పెళ్లి వేడుకకు ఆహ్వానం అందడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. పెళ్లి కూతురు మేఘన్‌తో తన మూడేళ్ల స్నేహ బంధాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ‘మార్కెల్ మాటతీరు, నడవడిక ఎంతో బాగుంటాయి. ఆమె తన కొత్త జీవితంలో చక్కగా ఒదిగిపోతుంద’ని ప్రియాంక అన్నారు. ప్రియాంక సన్నిహితురాలు రేచల్ రే దీనిపై స్పందించారు. ‘ఏమో మేఘన్ సాధారణ గృహిణి మాత్రమే కావచ్చునేమో’నని వ్యాఖ్యానించగా.. ‘ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి అనేంత చక్కని చుక్క నా ఫ్రెండ్. అమ్మాయిలకు మార్గదర్శిగా నిలిచే గొప్ప వ్యక్తిత్వం గల ముద్దుగుమ్మ మేఘన్’ అని ప్రియాంక తన స్నేహితురాలిపై అభిమానాన్ని చాటుకున్నారు. మార్కెల్‌తో మూడేళ్ల ప్రయాణంలో తాను ఎంతో నేర్చుకున్నానని ప్రియాంక అన్నారు. ఆమె గొప్పింటికి కోడలుగా వెళ్లబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. కాగా, ప్రియాంక తన పాపులర్ షో ‘క్వాంటీకో’ మూడో సీజన్‌ను ఈ వారం ప్రారంభించిన విషయం తెలిసిందే. -
ట్రంప్‌ను పిలువకుంటే.. ‘టైమ్బాంబ్’ పేలినట్టే!
త్వరలో జరగనున్న ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్‌ల రాచరిక వివాహం బ్రిటన్, అమెరికా మధ్య దౌత్య వివాదానికి తెరతీసేలా కనిపిస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఈ వేడుకకు ఆహ్వానించి.. ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ను పిలువకపోతే.. ‘డిప్లమాటిక్ టైమ్బాంబ్’ బద్దలయ్యే అవకాశముందని నిపుణులు అంటున్నారు. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత బ్రిటన్-అమెరికా దౌత్యబంధం ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు ఎదురుకాకుండా రాచకుటుంబం రంగంలోకి దిగింది. హ్యారీ పెళ్లి సందర్భంగా వివాదం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. పెళ్లిపీటలు ఎక్కబోతున్న ప్రిన్స్ హ్యారీ బరాక్ ఒబామాను స్నేహితుడిగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఆయనను పెళ్లికి అతిథిగా ఆహ్వానించే అవకాశముందని కథనాలు వచ్చాయి. అదే సమయంలో ఈ వివాహం బ్రిటన్ అధికారిక వేడుక కాకపోవడంతో ట్రంప్‌ను పిలిచే అవకాశం లేదని సన్నిహితులు తెలిపారు. అయితే, ఒబామాను పిలిచి తనను పిలువకపోవడం ట్రంప్ అవమానంగా భావించే అవకాశముందని, తనకు ఆహ్వానం అందని నేపథ్యంలో ఆయన తాజా బ్రిటన్ పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. అధ్యక్ష పదవి చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా బ్రిటన్‌లో పర్యటించాలని గతంలో ట్రంప్ భావించారు. అయితే, సరిగ్గా ఇదే సమయంలో హ్యారీ పెళ్లి జరుగుతుండటం, తనకు ఆహ్వానం అందకపోవడం ట్రంప్ తలవంపులుగా భావిస్తున్నట్టు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒబామాను ఈ పెళ్లికి ఆహ్వానిస్తే.. దౌత్యవివాదం మరింత తీవ్రమయ్యే అవకాశముందని, అందుకే ఒబామాను కూడా పిలువకూడదని నిర్ణయించినట్టు బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. -
మే 19న పెళ్లి చేసుకోనున్న హ్యారీ, మేఘన్
-
రాచరిక వైభవం: పెళ్లి ముహూర్తం ఇదే!
ఇప్పుడు హైప్రొఫైల్ పెళ్లిల సీజన్ కొనసాగుతున్నట్టుంది. నిన్నటికి నిన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మల పెళ్లి అంగరంగ వైభవంగా జరగగా.. తాజాగా ప్రిన్స్ హ్యారీ, హాలీవుడ్ నటి మేఘన్ మర్కెల్ పెళ్లికి ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది మే 19న వీరు పెళ్లి చేసుకోబోతున్నారు. విండ్సర్ క్యాస్టల్లోని సెయింట్ జార్జ్స్ చాపెల్‌లో వీరి వివాహం రాచరిక వైభవంతో జరగనుంది. ఇప్పటికే వీరి నిశ్చితార్థం జరిపించామని హ్యారీ తండ్రి ప్రిన్స్ చార్లెస్ ఇప్పటికే వెల్లడించారు. మేఘన్ మార్కెల్ (36), ప్రిన్స్ హ్యారీ(33)లు కొన్ని నెలల నుంచి ప్రేమించుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. బ్రిటన్ యువరాజు హ్యారీతో ప్రేమ వ్యవహారం నటి మేఘన్‌కు భలే పాపులారిటీని తెచ్చిపెట్టింది. ఎంతగా అంటే.. ఏకంగా మోస్ట్ సెర్చ్డ్ నటిగా 2016 ఏడాదికి గానూ మేఘన్ తన పేరు లిఖించుకుంది. తనకంటే వయసులో మూడేళ్లు పెద్దదైన నటి మేఘన్ తో డేటింగ్ చేస్తున్నట్లు హ్యారీ బహిరంగంగానే తెలిపాడు. 'మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం.. ఎంతో సంతోషంగా ఉన్నామంటూ' తమ ప్రేమ విషయాన్ని నటి మేఘన్ కూడా ఇటీవల పెదవి విప్పింది. గతేడాది జూలై నెలలో 'సూట్స్' షూటింగ్ సమయంలో టోరంటోలో తొలిసారి వీరి చూపులు కలిశాయి. అప్పటినుంచి వీరు తరచుగా కలుసుకోవడంతో సాన్నిహిత్యం పెరిగిపోయింది. నిర్మాత ట్రెవర్ ఇంగెల్సన్ తో మూడేళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకున్న మేఘన్ మార్కెల్ ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో యువరాజు హ్యారీతో పరిచయం పరిణయానికి దారితీసింది. His Royal Highness Prince Henry of Wales and Ms. Meghan Markle will marry on 19th May 2018. Today's announcement follows earlier confirmation of the month of the wedding and its location at St George's Chapel, Windsor Castle. pic.twitter.com/7pgdRM90Na — Kensington Palace (@KensingtonRoyal) 15 December 2017 -
వైభవంగా మైసూర్ యువరాజు పెళ్లి
-
వైభవంగా మైసూర్ యువరాజు పెళ్లి
మైసూర్: రాజవంశానికి చెందిన ప్రతిష్టాత్మక అంబా ప్యాలెస్‌లో మైసూరు యువరాజు యదువీర కృష్ణదత్త చామరాజ ఒడయార్, త్రిషికా కుమారి వివాహం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. బోస్టన్ యూనివర్సిటీలో చదువుకున్న 24 ఏళ్ల యదువీర 22 ఏళ్ల త్రిషికా కుమారిని హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లాడారు. రాజస్థాన్‌లోని దుంగార్పుర్ రాజవంశానికి చెందిన హర్షవర్థన్ సింగ్, మహేశ్రీకుమారి కూతురు త్రిషికా కుమారి. రాచరిక వైభవాన్ని తలపిస్తూ.. అట్టహాసంగా జరిగిన ఈ వివాహ వేడుకలో సంప్రదాయ రాజరిక దుస్తులు, తలపాగా ధరించిన వరుడు యుదవీర వధువు త్రిషికా పరస్పరం దండలు మార్చుకున్నారు. సంప్రదాయబద్ధంగా వివాహ వేడుకలు మైసూరు యువరాజు యదువీర కృష్ణదత్త చామరాజ ఒడయార్, త్రిషికా కుమారి సింగ్‌ల వివాహ వేడుకలు గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి వేడుకల్లో భాగంగా మూడోరోజైన ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు సమవర్దన హోమం తదితర సంప్రదాయ కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం వరుడికి తైలస్నానం చేయించి వాణివిలాస దేవుడి గృహంలోని ఆత్మవిలాస, గణపతి దర్శనం అనంత రం యదువీర్ సరవస్వతీ, రాజవంశస్థులు కులదేవల చాముండేశ్వరి దేవీలకు పూజలు నిర్వహించారు. చాముండి బెట్ట దేవస్థానం,శృంగేరి, మేలుకోటె,ఉత్తనహళ్లి, నంజనగూడు, శ్రీరంగపట్టణ, మహదేశ్వరబెట్ట తదితర ఆధ్యాత్మిక క్షేత్రాల నుంచి మైసూరు ప్యాలెస్‌కు చేరుకున్న తీర్థప్రసాదాలను వరుడు యదువీర్ భక్తి శ్రద్ధలతో స్వీకరించారు. రాజమాత ప్రమోదాదేవి పర్యవేక్షణలో జయంతి బళ్లాల్ డిజైన్ చేసిన వివిధ రకాల వస్త్రాలను యువరాజు యదువీర్ ధరించారు. అనంతరం యదువీర్ తండ్రి శ్రీకంఠదత్త చామరాజ ఒడయార్ భావచిత్రానికి పూజ నిర్వహించిన అనంతరం ప్యాలెస్ గురవుల సూచన మేరకు రాజమాత ప్రమోదాదేవి ఒడయార్‌కు పాదపూజ చేశారు. అనంతరం వరుడు కాశీ యాత్రలో పాల్గొన్నారు. శనివారం సాయంత్రం నగరానికి చేరుకున్న దుంగాపుర రాజకుమారి త్రిషికా సింగ్ కుమారి, ఆమె కుటుంబ సభ్యులు ప్యాలెస్‌కు చేరు కొని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ప్యాలెస్ సంప్రదాయాల ప్రకారం ఇరు రాజవంశాల బంధువర్గాల సమక్షంలో ఇరు రాజవంశస్థులు పట్టు వస్త్రాలు, బంగారు ఆభ రణాలను ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ వివాహ కార్యక్రమాలకు మేవాడ, జైపుర,జోధ్‌పుర, రాజపుత్, భరతపుర, గ్వాలియర్, కిసన్నగర, ఖల్విపుర, ఛత్తరపుర, రామాపుర,రఘోఫర్, సింధ్యా రాజవంశాలకు చెందిన వారిని ఆహ్వానించారు. మైసూరు రాజవంశస్థులు ఆచారం ప్రకారం వధూవరులను ఏనుగు అంబారిపై ఊరేగించేవారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ప్యాలెస్‌లో కారులోనే వధూవరులను ఊరేగించనున్నట్లు రాజమాత ప్రమోదాదేవి తెలిపారు. యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్, త్రిషికా సింగ్ కుమారిల వివాహ మహోత్సవం సందర్భంగా మైసూరు ప్యాలెస్ విద్యుత్ దీపాలతో కాంతిలీనుతుంది.