ఆమె చెప్పుల ధర వింటే షాకవుతారు! | Priyanka Wore Shoes Worth Rs 1.34 Lakh To The Royal Wedding | Sakshi
Sakshi News home page

ప్రియాంక వేసుకున్న చెప్పులెంతో తెలుసా?

Published Mon, May 21 2018 4:34 PM | Last Updated on Mon, May 21 2018 4:50 PM

Priyanka Wore Shoes Worth Rs 1.34 Lakh To The Royal Wedding - Sakshi

రాయల్‌ వెడ్డింగ్‌లో ప్రియాంక వేసుకున్న హీల్స్‌

బెర్క్‌షైర్‌: బ్రిటన్‌ రాజకుమారుడు హ్యారీ(33), అమెరికా నటి మేఘన్‌ మార్కల్‌(36)ల వివాహం శనివారం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.  బ్రిటన్‌లోని బెర్క్‌షైర్‌ కౌంటీ విండ్సర్‌లోని సెయింట్‌ జార్జి చర్చిలో జరిగిన ఈ వేడుకకు సుమారు 600 మంది విశిష్ట అతిథులు హాజరయ్యారు. మరో 2,640 మంది విండ్సర్‌ మైదానం నుంచి, లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా టీవీల్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ వివాహానికి హాజరైన ప్రముఖుల్లో భారత నటి ప్రియాంక చోప్రా కూడా ఉన్నారు. ప్రియాంక ఈ వేడుకలో స్పెషల్‌ అ‍ట్రాక్షన్‌గా నిలిచారు.

బ్రిటన్‌ మహారాణి ఇంట జరుగుతున్న వివాహం కాబట్టి దానికి తగ్గట్టే ప్రియాంక కూడా  రాయల్‌ లుక్‌లో ఆమె అదిరిపోయారు. డ్రస్‌ నుంచి ఆమె వేసుకున్న హీల్స్‌ వరకు ప్రతీది ఆకట్టుకునే రీతిలోనే ఉన్నాయి. ఈ వెడ్డింగ్‌లో ప్రియాంక వేసుకున్న హీల్స్‌ ఖరీదు వింటే మీకు మాటే రాకపోవచ్చు. స్వరోక్సి క్రిస్టల్స్‌తో ఇవి రూపొందిన ప్రియాంక చెప్పుల ఖరీదు రూ.1.35 లక్షలని తెలిసింది. ఆమె వీటిని ప్రత్యేకంగా డిజైన్‌ చేసుకున్నట్టు తెలిసింది. మేఘన్‌, ప్రియాంకకు మంచి స్నేహితురాలు. ఈ వివాహంతో మేఘన్ జీవితం మారిపోతుందని, మేఘన్ చాలా తెలివైన నటి అని ప్రియాంక పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement