రాచరిక వైభవం: పెళ్లి ముహూర్తం ఇదే! | Prince Harry and Meghan Markle to marry on May 19 | Sakshi
Sakshi News home page

మే 19న పెళ్లి చేసుకోనున్న హ్యారీ, మేఘన్‌

Dec 16 2017 9:56 AM | Updated on Dec 16 2017 8:02 PM

Prince Harry and Meghan Markle to marry on May 19 - Sakshi

ఇప్పుడు హైప్రొఫైల్‌ పెళ్లిల సీజన్‌ కొనసాగుతున్నట్టుంది. నిన్నటికి నిన్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మల పెళ్లి అంగరంగ వైభవంగా జరగగా.. తాజాగా ప్రిన్స్‌ హ్యారీ, హాలీవుడ్‌ నటి మేఘన్‌ మర్కెల్‌ పెళ్లికి ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది మే 19న వీరు పెళ్లి చేసుకోబోతున్నారు. విండ్సర్‌ క్యాస్టల్‌లోని సెయింట్‌ జార్జ్స్‌ చాపెల్‌లో వీరి వివాహం రాచరిక వైభవంతో జరగనుంది. ఇప్పటికే వీరి నిశ్చితార్థం జరిపించామని హ్యారీ తండ్రి ప్రిన్స్ చార్లెస్ ఇప్పటికే వెల్లడించారు.

మేఘన్ మార్కెల్ (36), ప్రిన్స్ హ్యారీ(33)లు కొన్ని నెలల నుంచి ప్రేమించుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. బ్రిటన్ యువరాజు హ్యారీతో ప్రేమ వ్యవహారం నటి మేఘన్‌కు భలే పాపులారిటీని తెచ్చిపెట్టింది. ఎంతగా అంటే.. ఏకంగా మోస్ట్ సెర్చ్‌డ్‌ నటిగా 2016 ఏడాదికి గానూ మేఘన్ తన పేరు లిఖించుకుంది. తనకంటే వయసులో మూడేళ్లు పెద్దదైన నటి మేఘన్‌ తో డేటింగ్ చేస్తున్నట్లు హ్యారీ బహిరంగంగానే తెలిపాడు.   'మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం.. ఎంతో సంతోషంగా ఉన్నామంటూ' తమ ప్రేమ విషయాన్ని నటి మేఘన్ కూడా ఇటీవల పెదవి విప్పింది.

గతేడాది జూలై నెలలో 'సూట్స్‌' షూటింగ్ సమయంలో టోరంటోలో తొలిసారి వీరి చూపులు కలిశాయి. అప్పటినుంచి వీరు తరచుగా కలుసుకోవడంతో సాన్నిహిత్యం పెరిగిపోయింది. నిర్మాత ట్రెవర్ ఇంగెల్సన్ తో మూడేళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకున్న మేఘన్ మార్కెల్ ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో యువరాజు హ్యారీతో పరిచయం పరిణయానికి దారితీసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement