రాయల్‌ వెడ్డింగ్‌ : ఒక్కటైన వధూవరులు | Meghan Markle, Prince Harry About To Exchange Wedding Vows | Sakshi
Sakshi News home page

రాయల్‌ వెడ్డింగ్‌ : ఒక్కటైన వధూవరులు

Published Sat, May 19 2018 5:09 PM | Last Updated on Sat, May 19 2018 6:59 PM

Meghan Markle, Prince Harry About To Exchange Wedding Vows - Sakshi

ఎన్నో రోజులుగా ప్రపంచవ్యాప్త అభిమానులను ఊరిస్తున్న రాయల్‌ వెడ్డింగ్‌ విండ్సర్‌ క్యాజిల్‌లో కన్నుల పండువగా జరిగింది. వరుడు ప్రిన్స్‌ హ్యారీ, వధువు మేఘన్‌ మార్కెల్‌లు ముసిముసి నవ్వులతో రింగులు మార్చుకుని ఒక్కటయ్యారు. మేఘన్‌, ప్రిన్స్‌లను భార్యభర్తలుగా జస్టిన్ వెల్బీ అధికారికంగా ప్రకటించారు.వీరి వివాహ వార్త అధికారికంగా ప్రకటించగానే చాపెల్‌ వెలుపల సంబురాలు ప్రారంభయ్యాయి. వేడుకకు ముందు.... ప్రిన్స్‌ను మనువాడేందుకు మేఘన్‌ చర్చిలోకి రాగానే వివాహానికి వచ్చిన అతిథులందరూ లేచి నిల్చున్నారు. రాయల్‌ వెడ్డింగ్‌కు వధువు తండ్రి థామస్‌ రాలేకపోవడంతో, వరుడు తండ్రి ప్రిన్స్‌ ఛార్లెస్‌ ఆమెకు తండ్రిగా విండ్సర్‌ క్యాజిల్‌లోకి నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఈ వివాహానికి భారీ ఎత్తున్న అతిథులు హజరయ్యారు. ఈ వేడుకలో బాలీవుడ్‌ భామ ప్రియాంక చోప్రా, డేవిడ్‌, విక్టోరియా  బెక్హాం‌, జార్జ్‌, అమల్‌, టెన్నీస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌లు కూడా పాల్గొన్నారు. వివాహ వేడుకతో విండ్సర్‌ క్యాజిల్‌ చర్చి వీధులన్నీ గానా బజానాలతో, అతిథులతో కిటకిటలాడాయి.

మేఘన్‌ మార్కెల్‌, బ్రిటీష్‌ డిజైనర్‌ క్లేర్‌ వెయిట్ కెల్లర్ డిజైన్‌ చేసిన డ్రెస్‌ను ధరించారు. ప్రిన్స్‌ హ్యారీ రింగ్‌ ప్లాటినం బాండ్‌తో ఉండగా... మార్కెల్‌ వెడ్డింగ్‌ రింగ్‌ వెల్ష్‌ గోల్డ్‌తో రూపొందినట్టు కెన్సింగ్టన్‌ ప్యాలెస్‌ చెప్పింది. ప్రిన్స్‌ హ్యారీ, మేఘన్‌ మార్కెల్‌లకు బ్రిటన్‌ ప్రధాని థెరెస్సా మే ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘ఇందు మూలముగా తెలియజేయడం ఏమనగా.. బ్రిటన్‌ మహారాణి  రెండవ ఎలిజబెత్‌ తన చిన్న మనవడు ప్రిన్స్‌ హ్యారీ వివాహానికి సమ్మతించారహో..’ బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ నుంచి మొన్న శనివారమే ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. వీరి వివాహ వేడుక నేడు ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/3

2
2/3

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement