వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో అదానీ మైనింగ్
వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో అదానీ మైనింగ్
Published Wed, Dec 7 2016 12:33 AM | Last Updated on Fri, Aug 17 2018 2:39 PM
చివరి క్వార్టర్‌లో ప్రధాన కార్యక్రమాలు అదానీ అస్ట్రేలియా వెల్లడి
మెల్‌బోర్న్: భారత ఇంధన దిగ్గజం అదానీ సంస్థ అస్ట్రేలియాలోని కార్మిఖేల్ మైనింగ్ కార్యక్రమాలను వచ్చే ఏడాది నుంచి ప్రారంభించనుంది. ఈ మైనింగ్ కార్యకలాపాలను వచ్చే ఏడాది మధ్యలో ఆరంభిస్తామని అదానీ తెలిపింది. 2,170 కోట్ల డాలర్ల ఈ ప్రాజెక్ట్ కారణంగా పదివేల ఉద్యోగాలు వస్తాయని అదానీ ఆస్ట్రేలియా సీఈఓ జెయకుమార్ జనక్‌రాజ్ చెప్పా రు. ఈ ఉద్యోగాల్లో స్థానిక కార్మికులకే ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను వివిధ పర్యావరణ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ వివాదస్పద ప్రాజెక్ట్‌కు శాశ్వత రైల్వే లైన్‌కు తుది ఆమోదం సోమవారమే లభించింది.
వచ్చే ఏడాది జూన్-జూలైలో కొన్ని పనులు ప్రారంభించాలనుకుంటున్నామని, ప్రధాన కార్యకలాపాలను వచ్చే ఏడాది చివరి క్వార్టర్లో ప్రారంభిస్తామని జనక్‌రాజ్ వివరించారు. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి చాలా కష్టపడ్డామని, ప్రభుత్వం, ఈ ప్రాజెక్ట్ సంబంధిత వ్యక్తులు, సంస్థల సహకారంతో చివరకు విజయం సాధించామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్, సంబంధిత మౌలిక సదుపాయాల కల్పనలో తోడ్పాటునందించేందుకు ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. కాగా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని..క్వీన్‌సల్యాండ్ రాష్ట్ర ప్రీమియర్, అనస్టేసియా పలాస్‌జక్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రీజనల్ ప్రాజెక్ట్ సెంటర్లు, మైనింగ్ సంబంధిత మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై ఆయన చర్చించారు.
Advertisement
Advertisement