సంప్రదాయ భారతావనికి దూరమయ్యాం
ఆస్ట్రేలియా టూరిస్టులు
గ్రామీణ ప్రాంతాలపై డాక్యుమెంటరీ నిమిత్త జిల్లాకు వచ్చిన విదేశీయులు
రాజవొమ్మంగి : 40 ఏళ్లనాటి సంప్రదాయ గ్రామీణ భారతావని, ఇప్పటికే ఎంతో మార్పు వచ్చిందని, నాటి సాంప్రదాయం, సంస్కృతిక గత భారతదేశాన్ని ఇప్పుడు చూడలేపోతున్నామని ఆస్ట్రేలియా దేశానికి చెందిన బాబ్ మెకే, స్టీఫెన్ బ్రౌన్ అన్నారు. చైన్నై నుంచి బుల్లెట్ మోటారు సైకిళ్లపై కోల్‌కత్తా వైపు వెళుతున్న వీరు బుధవారం మార్గమధ్యలో రాజవొమ్మంగి అటవీప్రాంతంలో కాసేపు సేదతీరగా.. ‘సాక్షి’ వీరిని పలుకరించింది. వారి రాక సంగతులు వారి మాటల్లోనే.. ‘‘భారత దేశంలోని సంప్రదాయ గ్రామీణ ప్రాంతంపై డాక్యుమెంటరీ ఫిల్మ్ చేయాలనే ఉద్దేశంతో ఇలా వచ్చాం. 'గో ప్రో– బీ హీరో' ఎక్విప్‌మెంట్ (మూవీ కేమెరాలు, జీపీఎస్, గూగుల్ మేప్స్ మొదలైన సరంజామా...)తో డాక్యుమెంటరీ ఫిల్మ్ తీసేందుకు ప్రణాళిక రూపొందించుకొన్న ముగ్గురులో ఒకరు చెన్నై వద్ద రోడ్ ప్రమాదానికి గురై గాయాలపాలై తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. ఇక మేమిద్దరం నెలరోజుల వ్యవధిలో ఈ పనిని పూర్తి చేయాలని చెన్నై నుంచి యానాం తదితర గ్రామాల మీదుగా రాజవొమ్మంగి చేరుకున్నాం. విశాఖజిల్లాలోని కొయ్యూరు, కేడీ పేట మీదుగా కొండల ప్రాంతం చింతపల్లికి వెళతాం. కోల్‌కత్తాలో మా యాత్ర ముగుస్తుంది. అభివృద్ధి అంటే ఫ్లై ఓవర్లు, పెద్ద పెద్ద ఆకాశహార్మోన్లు కాదని, సాంప్రదాయం మరువ కూడదు.’’ అని చెప్పారు. భార తీయ వంటకాలు అంటే ఇష్టమని, రోజు వారీ భోజనంలో పప్పు అన్నం, పెరుగు ఉంటే చాలని అన్నారు.