
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న వ్యక్తి పేరు మాథ్యూ లెప్రీ. ఆస్ట్రేలియాలో ఉంటూ ఆన్‌లైన్ వ్యాపారం చేస్తుంటాడు. ‘ఈకామ్ వారియర్ అకాడమీ’ని నెలకొల్పాడు. వ్యాపారంలో కోట్లకు కోట్లు గడించాడు. ఇప్పుడు ఇతగాడు ప్రపంచయాత్ర చేయాలనుకుంటున్నాడు. గడచిన ఐదేళ్లలో ముప్పయి దేశాలు తిరిగి, అక్కడి తన క్లయింట్ల వ్యాపారాలు పుంజుకొనేందుకు సహాయపడ్డాడు. ప్రపంచవ్యాప్తంగా సంచరించే తనకు తన ప్రయాణాల్లో సహకరించేందుకు ఒక సహాయకుడు కావాలంటూ ఇటీవల ఇతగాడు ప్రకటన ఇచ్చాడు.
వెంటనే ఈ ప్రకటన వైరల్‌గా మారింది. తగిన వ్యక్తి దొరికితే తనకు సహాయకుడిగా నియమించుకుంటానని, జీతంగా ఏడాదికి 30,500 పౌండ్లు (రూ.31 లక్షలు) చెల్లించడమే కాకుండా, హెల్త్ ఇన్సూరెన్స్, ట్రావెల్ అలవెన్స్ తదితర సౌకర్యాలు కూడా కల్పించనున్నట్లు ప్రకటించాడు. ఈ ఉద్యోగం కోసం ఇప్పటికే 70 వేలకు పైగా దరఖాస్తులు పోటెత్తాయి.
(చదవండి: అదొక శాపగ్రస్త గ్రామం! అరవై ఏళ్లుగా మనుషులే లేని ఊరు)
Comments
Please login to add a commentAdd a comment