ప్రస్తుతం రికార్డు పరుగులన్నీ జమైకన్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్‌వే! అత్యంత వేగంగా పరిగెత్తి ఒలింపిక్ రికార్డులను సృష్టించిన బోల్ట్‌ను దాటి వేగంగా పరిగెత్తేవారు ఉండరేమో, పరుగుల పోటీలో బోల్డ్‌కు సరైన ప్రత్యర్థి లేడు... అని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్న తరుణంలో ఒక యువకుడు దూసుకొస్తున్నాడు. బోల్ట్ రికార్డులను బ్రేక్ చేస్తూ అంతర్జాతీయ స్థాయి గుర్తింపును సొంతం చేసుకొంటాడనే ఊహాగానాలను రేకెత్తిస్తున్నాడు. జమైకన్ చిరుత బోల్ట్‌కు సవాలు విసురుతున్న ఆ ఆస్ట్రేలియన్ చిరుతే జేమ్స్ గలాఫర్.
ఆస్ట్రేలియన్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్స్‌లో 200 మీటర్ల ట్రాక్‌ను 21.73 సెకన్లలో పూర్తి చేసి సంచలనం సృష్టించాడు జేమ్స్. ఇదే దూరాన్ని జమైకన్ అథ్లెట్ బోల్ట్ తన పద్నాలుగవ యేట 21.81 సెకన్లలో ఛేదించాడు. బోల్ట్ కన్నా 0.08 సెకన్ల ముందుగా లక్ష్యాన్ని చేరుకొన్నాడు జేమ్స్. దీంతో తన టీనే జ్‌లో బోల్ట్ స్థాపించిన రికార్డును జేమ్స్ చెరిపేసినట్టైంది. ఈ ఫీట్‌ద్వారా అథ్లెటిక్ ప్రపంచంలో కొత్త తారగా ఉదయించాననే విషయాన్ని ప్రపంచానికి చాటాడు, పశ్చిమ ప్రాంతానికి చెందిన జేమ్స్.
రికార్డు చిన్నబోయింది...
ప్రస్తుతం బోల్ట్ వయసు ఇరవైఏడు సంవత్సరాలు. పదమూడు సంవత్సరాల క్రితం 200 మీటర్ల దూరపు పరుగుపందెంలో రికార్డును సృష్టించాడు. ఆ తర్వాత ఇన్నేళ్లలో బోల్ట్ రికార్డును బ్రేక్ చేసిన వారెవరూ లేదు. బోల్ట్ జూనియర్ స్థాయి నుంచి ఒలింపిక్ స్థాయికి చేరాడు. అనేక కొత్త రికార్డులను స్థాపించాడు. ఒలింపిక్స్‌లో అయితే బోల్ట్ విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. 2008, 2012 ఒలింపిక్స్‌లో కొత్త రికార్డులను స్థాపించాడు బోల్ట్. అయితే ఇప్పుడు జేమ్స్ పరుగుధాటికి బోల్ట్ వేగం చిన్నబోయింది.
బోల్ట్‌ను మించుతాడా?
టీనేజర్‌గా బోల్ట్ స్థాపించిన రికార్డును బ్రేక్ చేసిన జేమ్స్ భవిష్యత్తులో పెద్ద అథ్లెట్‌గా ఎదిగే అవకాశం ఉందని, బోల్ట్‌తో సమానస్థాయికి చేరే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. టీనేజ్‌లో ఉండగా బోల్ట్‌లో ఎలాంటి సామర్థ్యం ఉండేదో పదమూడేళ్ల జేమ్స్‌కు అతడి కన్నా ఎక్కువ సామర్థ్యం ఉందని వారు అంటున్నారు.భవిష్యత్తులో బోల్ట్‌కి ప్రత్యామ్నాయం కాగలడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అథ్లెటిక్స్ విషయంలో ఆస్ట్రేలియాకు మంచి ప్రాతినిధ్యం ఉంది. ఈ నేపథ్యంలో జేమ్స్ అంతర్జాతీయ, ఒలింపిక్ స్థాయిల్లో బోల్ట్ రికార్డులను అధిగమించినా పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు.
అతడు ఉత్సాహంతో ఉన్నాడు!
ఒలింపిక్ ఛాంపియన్ అయిన ఒక వ్యక్తి తన కెరీర్ ఆరంభంలో సృష్టించిన రికార్డులను చెరిపేసిన ఉత్సాహంతో ఉన్నాడు జేమ్స్. ఇప్పుడు తను బోల్ట్ దృష్టిలో కూడా పడ్డానని జేమ్స్ సంతోషపడుతున్నాడు. బ్రెజిల్‌లో జరిగే 2016 ఒలింపిక్స్‌లో తమ దేశం తరఫున ప్రాతినిధ్యం దక్కుతుందని జేమ్స్ ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. కోచ్‌లు కూడా జేమ్స్ విషయంలో నమ్మకంతోనే ఉన్నారు. కొత్త రికార్డులను నెలకొల్పగలడని ఆశిస్తున్నారు. ఈ లిటిల్ ఛాంపియన్‌పై ఒత్తిడి లేకుండా చూస్తామని అంటున్నారు కోచ్‌లు. హైస్కూల్‌స్థాయిలోనే అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జిస్తున్న జేమ్స్‌ను అంతర్జాతీయ అథ్లెట్‌గా తీర్చిదిద్దగలమని వారు పూర్తి నమ్మకంతో ఉన్నారు. మరి వారి ప్రయత్నం, బోలెడు శ్రమకు ప్రతిఫలంగా జేమ్స్ మరో బోల్ట్ కావొచ్చునేమో!
ఒలింపిక్ ఛాంపియన్ అయిన బోల్ట్ తన కెరీర్ ఆరంభంలో సృష్టించిన రికార్డులను చెరిపేసిన ఉత్సాహంతో ఉన్నాడు జేమ్స్. ఇప్పుడు తను బోల్ట్ దృష్టిలో కూడా పడ్డానని జేమ్స్ సంతోషిస్తున్నాడు. బ్రెజిల్‌లో జరిగే 2016 ఒలింపిక్స్‌లో తమ దేశం తరఫున ప్రాతినిధ్యం దక్కుతుందని జేమ్స్ ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు.
దూసుకొస్తున్నాడు!
Published Sun, Dec 15 2013 11:29 PM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM
Advertisement