Olympic record
-
Neeraj Chopra: ఒలింపిక్ రికార్డును సవరించాల్సి ఉంది
ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించడంతోనే తన లక్ష్యం పూర్తి కాలేదని, మున్ముందు మరింతగా శ్రమించి 90.57 మీటర్ల ఒలింపిక్ రికార్డును సవరించాలని భావిస్తున్నట్లు స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా వ్యాఖ్యానించాడు. వచ్చే ఏడాది జరిగే కామన్వెల్త్, ఆసియా క్రీడలు, డైమండ్ లీగ్ కోసం త్వరలోనే సన్నాహకాలు మొదలు పెడతానని నీరజ్ చెప్పాడు. హ్యాండ్‌బాల్ అభివృద్ధికి రూ. 240 కోట్లు న్యూఢిల్లీ: దేశంలో హ్యాండ్‌బాల్ క్రీడకు మరింత గుర్తింపు తెచ్చేందుకు కార్పొరేట్ సంస్థ బ్లూ స్పోర్ట్ ఎంటర్టైన్మెంట్ ముందుకు వచ్చింది. వచ్చే ఐదేళ్లలో హ్యాండ్‌బాల్ అభివృద్ధికి రూ. 240 కోట్లు అందజేస్తామని బ్లూ స్పోర్ట్స్ ప్రకటించింది. పురుషుల, మహిళల టీమ్‌ల కోసం రూ. 120 కోట్ల చొప్పున, మరో రూ. 35 కోట్లు ప్రాధమిక స్థాయిలో ఆట కోసం ఇస్తామని వెల్లడించింది. హ్యాండ్‌బాల్ సమాఖ్య ఆధ్వర్యంలో జరగనున్న ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ నిర్వహణా హక్కులు ఈ సంస్థ వద్దే ఉన్నాయి. చదవండి: తాలిబన్ ముప్పు.. పాక్ చేరిన అఫ్ఘాన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు -
ఒలింపిక్స్‌లో సాధించలేకపోయా.. కానీ ఆ రికార్డు బద్దలుకొడతా
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారతీయుల బంగారు స్వప్నం సాకారమైంది. రెండు వారాలుగా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న పసిడి దృశ్యం శనివారం ఆవిష్కృతమైంది. అథ్లెటిక్స్ ఈవెంట్లో భాగంగా పురుషుల జావెలిన్ త్రోలో భారత ప్లేయర్ నీరజ్ చోప్రా అద్వితీయ ప్రదర్శన చేశాడు. రెండో ప్రయత్నంలో ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని తన మెడలో వేసుకున్నాడు. తద్వారా ఒలింపిక్స్ అథ్లెటిక్స్ చరిత్రలో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన అథ్లెట్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. అయితే నీరజ్ జావెలిన్ త్రోలో 90.57 మీటర్ల ఒలింపిక్స్ రికార్డును బద్దలు కొట్టాలని భావించాడు. కానీ దానిని అందుకోలేకపోయాడు. స్వర్ణ పతకం సాధించిన అనంతరం సెలబ్రేషన్స్‌లో భాగంగా నీరజ్ ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడాడు. ''ఈ సంవత్సరం తనకు చాలా ముఖ్యమైంది. రెండు మూడు అంతర్జాతీయ పోటీలలో పాల్గొనడం తనకు చాలా సహాయపడింది. అందువల్లే ఒలింపిక్స్‌కు ఎలాంటి ఒత్తిడి లేకుండా సన్నద్ధమయ్యాను. అంతేగాక నా ప్రదర్శనపై దృష్టి పెట్టగలిగాను. టోక్యో ఒలింపిక్స్‌లో 87.58 మీటర్లు విసిరి స్వర్ణం గెలిచాను. అయితే ఒలింపిక్స్‌లో బరిలోకి దిగినప్పుడు 90.57 మీటర్ల ఒలింపిక్ రికార్డును బద్దలు కొట్టాలని అనుకున్నా. ఇప్పడు అది సాధ్యపడలేదు.. కానీ రానున్న రోజుల్లో కచ్చితంగా ఆ రికార్డును బద్దలుకొడుతా. ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవాలనే ఆకాంక్షను నెరవేర్చుకున్నా.ఇక నా నెక్స్ట్ టార్గెట్ వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలవడమే. దాని సన్నద్దత కోసం లాసాన్నే, పారిస్, జూరిచ్ జావెలిన్ ఫైనల్లో పాల్గొనబోతున్నా. '' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఈ ఏడాదే జరగాల్సి ఉన్నప్పటికి టోక్యో ఒలింపిక్స్ జరగడంతో వచ్చే ఏడాదిలో జరగనుంది. #WATCH | My participation in the two-three international competitions helped me a lot. So there was no pressure on me while playing in #TokyoOlympics and I was able to focus on my performance: Javelin throw Gold medalist Neeraj Chopra pic.twitter.com/nefpG9Tla7 — ANI (@ANI) August 7, 2021 -
125 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో ఇలా తొలిసారి..
టోక్యో: 125 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఆదివారం జరిగిన పోటీల్లో జపాన్‌కు చెందిన అన్నాచెల్లెలు పసిడి పతకం సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు. జుడోలో వీరిద్దరూ ఒకేరోజు బంగారు పతకాలు సాధించి ఒలింపిక్స్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. 21 ఏళ్ల ఉటా అబే మహిళల 52 కేజీల కేటగిరీలో బంగారు పతకం సాధించగా, అంతకు కొన్ని గంటల ముందే ఆమె సోదరుడు హిఫుమి అబే 66 కేజీల పురుషుల ఫైనల్లో స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. ఇలా తోబుట్టువులు ఒకే రోజు పసిడి పతకాలు సాధించడం ఒలింపిక్స్ చరిత్ర ఇదే తొలిసారి. కాగా, ఫ్రాన్స్‌కు చెందిన అమండైన్ బుచర్డ్‌తో జరిగిన పోరులో ఉటా విజయం సాధించగా, ఆమె సోదరుడు 23 ఏళ్ల హిఫుమి అబే జార్జియాకు చెందిన వాజా మార్గ్వెలాష్విలితో జరిగిన పోరులో విజయం సాధించి పసిడిని పట్టేశాడు. కాగా, ఈ ఇద్దరు అన్నా చెలెల్లు తాము పాల్గొన్న తొలి ఒలింపిక్స్‌లోనే ఏకంగా పసిడి పతాకాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో ప్రస్తుత ఒలింపిక్స్‌లో జపాన్ పసిడి పతకాల సంఖ్య ఐదుకు చేరింది. ఓవరాల్‌గా ఆతిధ్య దేశం ఖాతాలో ఆరు పతకాలు(5 స్వర్ణాలు సహా ఓ రజతం) చేరాయి. -
దూసుకొస్తున్నాడు!
ప్రస్తుతం రికార్డు పరుగులన్నీ జమైకన్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్వే! అత్యంత వేగంగా పరిగెత్తి ఒలింపిక్ రికార్డులను సృష్టించిన బోల్ట్‌ను దాటి వేగంగా పరిగెత్తేవారు ఉండరేమో, పరుగుల పోటీలో బోల్డ్‌కు సరైన ప్రత్యర్థి లేడు... అని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్న తరుణంలో ఒక యువకుడు దూసుకొస్తున్నాడు. బోల్ట్ రికార్డులను బ్రేక్ చేస్తూ అంతర్జాతీయ స్థాయి గుర్తింపును సొంతం చేసుకొంటాడనే ఊహాగానాలను రేకెత్తిస్తున్నాడు. జమైకన్ చిరుత బోల్ట్‌కు సవాలు విసురుతున్న ఆ ఆస్ట్రేలియన్ చిరుతే జేమ్స్ గలాఫర్. ఆస్ట్రేలియన్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్స్‌లో 200 మీటర్ల ట్రాక్‌ను 21.73 సెకన్లలో పూర్తి చేసి సంచలనం సృష్టించాడు జేమ్స్. ఇదే దూరాన్ని జమైకన్ అథ్లెట్ బోల్ట్ తన పద్నాలుగవ యేట 21.81 సెకన్లలో ఛేదించాడు. బోల్ట్ కన్నా 0.08 సెకన్ల ముందుగా లక్ష్యాన్ని చేరుకొన్నాడు జేమ్స్. దీంతో తన టీనే జ్లో బోల్ట్ స్థాపించిన రికార్డును జేమ్స్ చెరిపేసినట్టైంది. ఈ ఫీట్ద్వారా అథ్లెటిక్ ప్రపంచంలో కొత్త తారగా ఉదయించాననే విషయాన్ని ప్రపంచానికి చాటాడు, పశ్చిమ ప్రాంతానికి చెందిన జేమ్స్. రికార్డు చిన్నబోయింది... ప్రస్తుతం బోల్ట్ వయసు ఇరవైఏడు సంవత్సరాలు. పదమూడు సంవత్సరాల క్రితం 200 మీటర్ల దూరపు పరుగుపందెంలో రికార్డును సృష్టించాడు. ఆ తర్వాత ఇన్నేళ్లలో బోల్ట్ రికార్డును బ్రేక్ చేసిన వారెవరూ లేదు. బోల్ట్ జూనియర్ స్థాయి నుంచి ఒలింపిక్ స్థాయికి చేరాడు. అనేక కొత్త రికార్డులను స్థాపించాడు. ఒలింపిక్స్‌లో అయితే బోల్ట్ విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. 2008, 2012 ఒలింపిక్స్‌లో కొత్త రికార్డులను స్థాపించాడు బోల్ట్. అయితే ఇప్పుడు జేమ్స్ పరుగుధాటికి బోల్ట్ వేగం చిన్నబోయింది. బోల్ట్‌ను మించుతాడా? టీనేజర్‌గా బోల్ట్ స్థాపించిన రికార్డును బ్రేక్ చేసిన జేమ్స్ భవిష్యత్తులో పెద్ద అథ్లెట్‌గా ఎదిగే అవకాశం ఉందని, బోల్ట్‌తో సమానస్థాయికి చేరే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. టీనేజ్‌లో ఉండగా బోల్ట్‌లో ఎలాంటి సామర్థ్యం ఉండేదో పదమూడేళ్ల జేమ్స్‌కు అతడి కన్నా ఎక్కువ సామర్థ్యం ఉందని వారు అంటున్నారు.భవిష్యత్తులో బోల్ట్కి ప్రత్యామ్నాయం కాగలడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అథ్లెటిక్స్ విషయంలో ఆస్ట్రేలియాకు మంచి ప్రాతినిధ్యం ఉంది. ఈ నేపథ్యంలో జేమ్స్ అంతర్జాతీయ, ఒలింపిక్ స్థాయిల్లో బోల్ట్ రికార్డులను అధిగమించినా పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు. అతడు ఉత్సాహంతో ఉన్నాడు! ఒలింపిక్ ఛాంపియన్ అయిన ఒక వ్యక్తి తన కెరీర్ ఆరంభంలో సృష్టించిన రికార్డులను చెరిపేసిన ఉత్సాహంతో ఉన్నాడు జేమ్స్. ఇప్పుడు తను బోల్ట్ దృష్టిలో కూడా పడ్డానని జేమ్స్ సంతోషపడుతున్నాడు. బ్రెజిల్లో జరిగే 2016 ఒలింపిక్స్‌లో తమ దేశం తరఫున ప్రాతినిధ్యం దక్కుతుందని జేమ్స్ ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. కోచ్‌లు కూడా జేమ్స్ విషయంలో నమ్మకంతోనే ఉన్నారు. కొత్త రికార్డులను నెలకొల్పగలడని ఆశిస్తున్నారు. ఈ లిటిల్ ఛాంపియన్‌పై ఒత్తిడి లేకుండా చూస్తామని అంటున్నారు కోచ్‌లు. హైస్కూల్‌స్థాయిలోనే అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జిస్తున్న జేమ్స్‌ను అంతర్జాతీయ అథ్లెట్‌గా తీర్చిదిద్దగలమని వారు పూర్తి నమ్మకంతో ఉన్నారు. మరి వారి ప్రయత్నం, బోలెడు శ్రమకు ప్రతిఫలంగా జేమ్స్ మరో బోల్ట్ కావొచ్చునేమో! ఒలింపిక్ ఛాంపియన్ అయిన బోల్ట్ తన కెరీర్ ఆరంభంలో సృష్టించిన రికార్డులను చెరిపేసిన ఉత్సాహంతో ఉన్నాడు జేమ్స్. ఇప్పుడు తను బోల్ట్ దృష్టిలో కూడా పడ్డానని జేమ్స్ సంతోషిస్తున్నాడు. బ్రెజిల్లో జరిగే 2016 ఒలింపిక్స్‌లో తమ దేశం తరఫున ప్రాతినిధ్యం దక్కుతుందని జేమ్స్ ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు.