రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌తో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. తాజాగా ఆయనకు అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్‌లో సభ్యత్వాన్ని దక్కించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ సినీ ప్రముఖులు, అభిమానులు జూనియర్‌కు అభినందనలు తెలుపుతున్నారు.
(ఇది చదవండి: లియోకు మరో షాక్.. రిలీజైన కొద్ది గంటల్లోనే!! )
తాజాగా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ కొత్త సభ్యులను ఎంపిక చేసింది. అందులో మన టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పేరును అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ జాబితాలో జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు కే హుయ్ క్వాన్, మార్షా స్టెఫానీ బ్లేక్, కెర్రీ కాండన్, రోసా సలాజర్ కూడా ఉన్నారు.
కాగా.. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో జూనియర్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించనున్నారు. ఆ తర్వాత హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్2’లో ఎన్టీఆర్ నటిస్తున్నారు.
(ఇది చదవండి: ఖరీదైన కారు కొన్న స్టార్ హీరోయిన్.. ధర ఎన్ని కోట్లంటే?)
Comments
Please login to add a commentAdd a comment