కల్లబొల్లి కబుర్లు చెప్పి ప్రజలను మభ్యపెట్టడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరితేరిపోయారని, మాటల గారడీలో ఆయనకు ఆస్కార్ అవార్డు
విజయనగరం ఫూల్‌బాగ్: కల్లబొల్లి కబుర్లు చెప్పి ప్రజలను మభ్యపెట్టడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరితేరిపోయారని, మాటల గారడీలో ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యు డు వి.శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. సీపీఎం ఆధ్వర్యాన ‘నవ్యాంధ్రప్రదేశ్-సమాగ్రాభివృద్ధి’ అనే అంశంపై గురువారం ఉద యం పట్టణంలోని ఎన్జీఓ హోంలో సదస్సు జరిగింది. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మర్రాపు సూర్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో మంచిపాలన అందిస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన ఇన్నిరోజుల్లో చేసిన అభివృద్ధి ఏమిటో తెలపాలని ప్రశ్నించారు.
1994 నుంచి 2003 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు వ్యవసాయ రంగాన్ని దారుణంగా దెబ్బతీశారని, అందువల్లే ఆయన పాలనాకాలంలో రైతాంగం ఆత్మహత్యలు అధికంగా జరిగాయని గుర్తుచేశారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ఎన్నికల లబ్ధికోసం రుణమాఫీ అని ప్రకటించిన చంద్రబాబునాయుడు నేడు లోటుబడ్జె ట్ అని కొత్తపల్లవి అందుకున్నారంటే ఆయన మాటలు గారడీ ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చన్నారు. రాష్ర్టంలో లభించే సహజవనరులైన ఖనిజాలు, ఇసుక, నీరు, భూములను కార్పొరేట్‌లకు ధారాదత్తం చేసేందు కు చంద్రబాబునాయుడు యత్నిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.కృష్ణమూర్తి ప్రసంగించారు. సదస్సులో అధికసంఖ్యలో సీపీఎం కార్యకర్తలు, సానుభూతిపరులు పాల్గొన్నారు.