Oscars 2023 95th Academy: Suriya Casts His Vote For Oscars 2023 And Shares Screenshot - Sakshi
Sakshi News home page

Suriya: ఆస్కార్‌లో ఓటు హక్కు ఉపయోగించుకున్న సూర్య

Published Thu, Mar 9 2023 9:30 AM | Last Updated on Thu, Mar 9 2023 10:14 AM

Suriya Casts His Vote For Oscars 2023 And Shares Screenshot - Sakshi

ఆస్కార్‌ ఓటు హక్కును వినియోగించుకున్నారు సూర్య. ఈ నెల 12న లాస్‌ ఏంజిల్స్‌లో 95వ ఆస్కార్‌ అవార్డ్స్‌ వేడుక జరగనుంది. విజేతల ఎంపిక కోసం పదివేల మందికి పైగా ఉన్న ఆస్కార్‌ ఓటర్స్‌ ఈ నెల 2 నుంచి 7వరకు ఆన్‌లైన్‌లో ఓటు నమోదు చేశారు.

ఇందులో భాగంగానే సూర్య కూడా ఓటు వేశారు. ఆకాడమీ ‘క్లాస్‌ ఆఫ్‌ 2022’లో భాగంగా సూర్య ఆస్కార్‌ సభ్యునిగా ఎంపికైన సంగతి తెలిసిందే. అలాగే సూర్యతో ΄ాటు నటి కాజోల్, డైరెక్టర్, స్క్రీన్‌ రైటర్‌ రీమా ఖగ్తీలు కూడా ఆస్కార్‌ మెంబర్స్‌ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement