
న్యూఢిల్లీ: ఏ విషయమైనా ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకోవడం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి అలవాటు. ఒక్కోసారి ఆటపట్టించేలా కూడా పోస్టులు చేస్తుంటాడు. ఇలాగే తాను ఓ సినిమాలో నటిస్తున్నట్లు గత నెలలో కోహ్లి ట్విటర్‌లో ఓ పోస్టు చేశాడు. దాని పేరు ట్రైలర్ అని, నిర్మాత వ్రాన్ ప్రొడక్షన్స్ అని.. తన స్టిల్ ఉన్న ఓ పోస్టర్‌ను గత నెల 20న ట్వీట్ చేశారు. దీంతో ఆయన అభిమానులంతా అవాక్కయ్యారు.
కోహ్లి నిజంగా సినిమాలో నటిస్తున్నాడా అని ఆశ్చర్యపోయారు. అయితే ‘ఈ ఫేక్ సినిమాకు ఇప్పుడు నకిలీ ఆస్కార్ గెలిచాను’ అని ఆటపట్టిస్తూ ఓ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.‘నేను నటించని ట్రైలర్ సినిమాకు వచ్చిన నకిలీ ఆస్కార్ ఇది. ఈ సినిమాను నిర్మించని వ్రాన్ ప్రొడక్షన్‌కూ, దాన్ని చూడని ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఓ ఫేక్ చిత్రం కాబట్టి.. ఇదీ నకిలీ ఆస్కార్' అని 22 సెకన్ల వీడియోను పోస్ట్ చేశాడు.
Getting it right when you think you got it all WROGN 😂🤘🏻@StayWrogn #TrailerTheMovie pic.twitter.com/htlWP6L7wx
— Virat Kohli (@imVkohli) 17 October 2018
Comments
Please login to add a commentAdd a comment