
విలక్షణ నటుడు సూర్య తాజా సూపర్ హిట్ చిత్రం ‘సూరరై పోట్రు’(ఆకాశం నీ హద్దురా). సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అన్ని వర్గాల ప్రజలు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. కరోనా సమయంలో ఓటీటీ ద్వారా విడుదలైన పెద్ద తమిళ సినిమాగా రికార్డు సృష్టించింది. అంతేకాదు! ఈ సంవత్సరం ఉత్తమ నటుడు, నటి, దర్శకురాలు/దర్శకుడు, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాలలో ఈ సినిమా ఆస్కార్ రేసులోనూ నిలిచింది. మంగళవారం అకాడమీ స్క్రీనింగ్ రూములో దీన్ని ప్రదర్శించారు. ( అభిమాని పెళ్లికి హాజరైన సూర్య )
అపర్ణా బాలమురళీ, మోహన్ బాబు, పరేశ్ రావల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా గత నవంబర్ 12న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఎయిర్ డెక్కన్ అధినేత కెప్టెన్ గోపీనాథ్ జీవిత చరిత్ర ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. 670 పేజీలుండే ‘సింప్లీ ఫ్లై’ బుక్‌ను దర్శకురాలు సుధ రెండు గంటల సినిమాగా మలిచి సక్సెస్ అయ్యారు. (చదవండి: ‘ఆకాశమే నీ హద్దురా’ రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment