తెలుగు చిత్ర సీమను ప్రపంచానికి ఎలుగెత్తి చూపి ఆస్కార్ సొంతం చేసుకున్న 'ఆర్ఆర్ఆర్' గురించి, అందులో నటించిన నటీ, నటులను గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. రామ్ చరణ్, ఎన్టీఆర్ తమ నటనతో అందరిని ఆకట్టుకున్నారు. అయితే చరణ్ సినిమాల గురించి తెలిసిన చాలామందికి అతడు ఎలాంటి కార్లను ఉపయోగిస్తాడు, అతని ఆస్తుల విలువ ఎంత అనేది తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అలాంటి వారికోసం ప్రత్యేక కథనం..
చిరుత సినిమాతో తెలుగు సినీ రంగప్రవేశం చేసిన చరణ్.. మగధీరతో బాక్సాఫీస్ బద్దలు కొట్టి ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఖైదీ నంబర్ 150 నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు. అంతే కాకుండా పెప్సీ, టాటా డొకోమో, వోలానో, అపోలో జియా, హీరో మోటోక్రాప్, ఫ్రూటీ వంటి దాదాపు 34 బ్రాండ్‌లను అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ బాగా సంపాదిస్తున్నాడు.
కొణిదెల రామ్ చరణ్ మొత్తం ఆస్తుల విలువ దాదాపు 1370 కోట్లు ఉంటుందని అంచనా. ఈయన నెల సంపాదన రూ. 3 కోట్లకంటే ఎక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. RRR సినిమాలో తన పాత్ర కోసం రూ. 45 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. మొత్తం మీద మన దేశంలో ఎక్కువ ట్యాక్స్ చెల్లిస్తున్నవారిలో రామ్ చరణ్ ఒకరు కావడం గమనార్హం.
(ఇదీ చదవండి: సిట్రోయెన్ సి3 కొత్త ధరలు.. వాహన ప్రియులకు షాక్)
రామ్ చరణ్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో దాదాపు 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో బంగ్లా కలిగి ఉన్నారు. ఇందులో స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్, టెంపుల్, జిమ్, ఫిష్ పాండ్ వంటి అధునాతన సదుపాయాలు ఉన్నాయని తెలుస్తోంది. దీని విలువ రూ. 38 కోట్లు ఉంటుందని అంచనా. దీనితో పాటు ముంబైలో పెంట్ హౌస్ కూడా ఉందని చెబుతున్నారు.
ఇక చివరగా రామ్ చరణ్ ఎలాంటి వాహనాలు ఉపయోగిస్తారు అనే విషయానికి వస్తే, ఈయన వద్ద దాదాపు రూ.4 కోట్ల విలువైన కస్టమైజ్డ్ మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 తో పాటు, ఆడి మార్టిన్ V8 వాంటేజ్, రోల్స్ రాయిస్ ఫాంటమ్, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, ఆస్టన్ మార్టిన్ మరియు ఫెరారీ పోర్టోఫినో ఉన్నాయి. అంతే కాకుండా చరణ్ ఒక సొంత ప్రైవేట్ జెట్ కూడా కలిగి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment