ఆస్కార్ ఎంట్రీ లిస్ట్‌లో ‘డియ‌ర్ కామ్రేడ్‌’ | Vijay Deverakonda Dear Comrade in Oscar Entry List | Sakshi
Sakshi News home page

ఆస్కార్ ఎంట్రీ లిస్ట్‌లో ‘డియ‌ర్ కామ్రేడ్‌’

Published Sat, Sep 21 2019 5:29 PM | Last Updated on Sat, Sep 21 2019 5:44 PM

Vijay Deverakonda's ‘ear Comrade in Oscar Entry's List - Sakshi

క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన చిత్రం ‘డియ‌ర్ కామ్రేడ్‌’. ఈ చిత్రాన్ని ఫిల్మ్‌ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా క‌మిటీ ఆస్కార్ ఎంట్రీ లిస్టులోకి అధికారికంగా ఎంపికైంది. ఫిల్మ్‌ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ చిత్రంతో పాటు మ‌రో 28 చిత్రాల‌ను  ఈ జాబితాలోకి ఎంపిక‌య్యాయి. ఈ చిత్రాల‌న్నింటినీ స్క్రీనింగ్ చేసి, వాటిలో మంచి చిత్రాన్ని ఎంపిక చేసి బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేట‌గిరీలో ఆస్కార్‌కి పంపుతారు. `డియ‌ర్ కామ్రేడ్‌` మాత్ర‌మే ఈ లిస్టులోకి ఎన్నికైన ఏకైక తెలుగు చిత్రం. ప్ర‌స్తుతం స్క్రీనింగ్ జ‌రుగుతుంది. వీటిలో ఉత్తమ చిత్రాన్ని ప్ర‌క‌టిస్తారు. ప్ర‌ముఖ ఫిలిం మేక‌ర్ అప‌ర్ణ సేన్ అధ్య‌క్ష‌త‌న ఈ జ్యూరీ ప‌ని చేస్తుంది. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీమూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ బ్యాన‌ర్స్ డియ‌ర్ కామ్రేడ్‌ చిత్రాన్ని నిర్మించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement