Aparna Sen
-
అపర్ణ సినీ ప్రపూర్ణ
తండ్రి సినిమా క్రిటిక్, తల్లి కాస్ట్యూమ్ డిజైనర్. ఈ దంపతుల పదేళ్ల కూతురు..ఓ రోజూ ఉదయాన్నే బ్రష్ చేసుకుంటూ..‘‘అమ్మా నేను భవిష్యత్‌లో మంచి నటిని కాబోతున్నాను’ అని చెప్పింది. తల్లిదండ్రులు ఇద్దరూ సినీపరిశ్రమతో సంబంధాలు ఉన్నవారే అయినప్పటికీ తమ చిన్నారి చెప్పిన బుజ్జిబుజ్జి మాటలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ అ చిన్నారి పదహారేళ్లకే సత్యజీత్ రే సినిమాలో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అప్పుడు ఆరంభమైన అపర్ణాసేన్ ప్రయాణం నటిగా, దర్శకురాలిగా, స్క్రీన్ రైటర్‌గా... ఎడిటర్‌గా అంచలంచెలుగా ఎదుగుతూ దేశంలోనే పాపులర్ వ్యక్తుల జాబితాలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. ప్రస్తుతం 75 ఏళ్ల వయసులోనూ ‘ద రేపిస్ట్’ సినిమా తీసి ప్రతిష్టాత్మక ‘కిమ్ జిసెక్’ పురస్కారాన్ని అపర్ణ గెలుచుకున్నారు. అనేక అంతర్జాతీయ చిత్రాలతో పోటీ పడి ఆసియాలోనే అతిపెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును దక్కించుకోవడం విశేషం. కుమార్తె కొంకణసేన్ శర్మతో అపర్ణాసేన్ అప్పటి కలకత్తాలోని బెంగాలీ దంపతులు చిదానంద్ దాస్‌గుప్తా, సుప్రియ దాస్‌గుప్తాలకు 1945లో అక్టోబర్ 25న అపర్ణ జని్మంచింది. ఆమె బాల్యం అంతా కలకత్తాలోనే గడిచింది. బిఏ(ఇంగ్లిష్) డిగ్రీ పూర్తిచేసింది. 1961లో మ్యాగ్నమ్ ఫోటోగ్రాఫర్ బ్రేయిన్ బ్రాకేను కలిసిన అపర్ణ అతను తీస్తోన్న మాన్సూన్ సీరిస్‌లో నటించింది. పదహారేళ్లకే మోడల్‌గా మారిన అపర్ణ ..ఈ అనుభవంతో సత్యజీత్రే నిర్మించిన తీన్ కన్యలో మూడో భాగం ‘సమాప్తి’ లో నటించింది. ఈ సినిమాలో అపర్ణాకు మంచి గుర్తింపు లభించింది. మరోపక్క తన చదువును కొనసాగిస్తూనే కోల్‌కతా ప్రెసిడెన్సీ కాలేజీలో డిగ్రీ బిఏ(ఇంగ్లిష్) చదివింది. సమాప్తి తర్వాత ‘బక్సాబాదరల్’, ‘ఆకాశ్ కుసుమ్’లో నటించినప్పటికీ అవి అంతగా ఆకట్టుకోలేదు. తరువాత నటించిన ‘అపరాజితో’ మంచి కమర్షియల్ హిట్‌ను అందించింది. ఒక పక్క సినిమా, మరోపక్క థియేటర్లలో నటిస్తూ సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. తరువాత సత్యజీత్ రే నిర్మించిన అనేక సినిమాల్లో నటించింది. రేకు వారసురాలిగా.. అపర్ణ తండ్రి సత్యజిత్ రేలు మంచి స్నేహితులు కావడం, వల్ల రేకు సన్నిహితంగా పెరిగిన అపర్ణ ...తన మొదటి సినిమా కూడా రే దర్శకత్వం వహించడంతో..ఆయనను ఆదర్శంగా తీసుకుని ఆయనలా విభిన్న సినిమాలు తీయడం ప్రారంభించింది. రాజకీయాలు, వివిధ రకాల మానవ సంబంధాలపై అపర్ణా అనేక సినిమాలు నిర్మించారు. 1981లో విడుదలైన ‘36 చౌరంగీ లేన్’ అనే ఇంగ్లిష్ సినిమాతో అపర్ణాకు రచయితగా, డైరెక్టర్‌గా గుర్తింపు లభించింది. అపర్ణ సిని పరిశ్రమకు చేసిన కృషికి గాను 1986లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. బెస్ట్ డైరెక్టర్ నేషనల్ అవార్డులను అందుకుంది. జాతీయ, అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో జ్యూరీగా వ్యవహరించడమేగాక అనేక లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డులను అందుకున్నారు. 2009లో ‘అంతహీన్’ లో నటించగా ..ఈ సినిమాకు నాలుగు జాతీయ అవార్డులు వచ్చాయి. బెస్ట్ లుకింగ్ ఉమెన్.. బెస్ట్ లుకింగ్ ఇండియన్ ఉమెన్ జాబితాలో నిలిచిన అపర్ణ..నటిగా, దర్శకురాలిగా ఎదిగినప్పటికీ, వ్యక్తిగత జీవితంలో కొంత ఒడిదుడుకులకు లోనయ్యారు. అయినప్పటికీ తన ఇద్దరు కూతుర్లు, మనవ సంతానంతో ఆమె ఆనందంగా గడుపుతున్నారు. ప్రస్తుతం బెంగాల్లో బాగా పాపులర్ అయిన మహిళా మ్యాగజీన్ ‘సనంద’కు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. మ్యాగజీన్ లో సామాజిక సమస్యలపై ఆమె ఎడిటోరియల్స్ రాస్తున్నారు. ద రేపిస్ట్.. ఈ సినిమాను పదిహేనేళ్ల క్రితమే తియ్యాలని అపర్ణాసేన్ అనుకుంది. ఆ తరువాత భారత్‌లో చోటుచేసుకున్న అత్యాచార ఘటనలను గమనిస్తూ ఉండేది. ఎవరూ కూడా పుట్టుకతో రేపిస్ట్ కారు. చిన్నప్పుడు అమాయకంగా ఉండే అబ్బాయిలు యవ్వనంలోకి వచ్చాక వారిలో ఎందుకు అత్యాచార మనస్తత్వం ఏర్పడుతుంది? రేపిస్ట్‌గా ఎలా మారుతున్నారు? ఇది కేవలం సమాజంలో ఉన్న అసమానతలు, లేదా జన్యువుల వల్ల జరుగుతోందా? ఇటువంటి ప్రశ్నలు అపర్ణ మనసులో మెదిలాయి. కానీ వేటికీ జవాబు దొరకలేదు. వీటన్నింటికి జవాబులు అన్వేషించే క్రమంలోనే ‘ద రేపిస్ట్’ సినిమా తీశారు. ఈ సినిమా కోసం ఆమె ఎన్నో పుస్తకాలు చదివారు, అనేక మంది లాయర్లు, ఫెమినిస్టులు, స్నేహితులతో కలిసి చర్చించి తన కూతురు, ప్రముఖ నటి కొంకణా సేన్ శర్మ ప్రధాన పాత్రధారిగా సినిమాను తీశారు. ఇప్పటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా సినిమా తీయడం, దానికి అంతర్జాతీయ అవార్డు వరించడంతో..75 ఏళ్ల వయసులోనూ తన ప్రతిభను నిరూపించుకుని ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ఇండియన్ మూవీకి ఇంటర్నేషనల్ అవార్డు
జాతీయ అవార్డు గ్రహీత అపర్ణసేన్ దర్శకత్వం వహించిన సినిమా ‘ది రేపిస్ట్’ 26వ బూసన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఎంపికైన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని అక్టోబర్ 7న ‘ఏ విండో ఆఫ్ ఏషియన్ సినిమా’ విభాగంలో ప్రదర్శించగా.. ప్రతిష్టాత్మక కిమ్ జిసెక్ పురస్కారానికి ఎంపికైంది. పలు విదేశీ చిత్రాలతో పోటీ పడిన ఈ మూవీ ఆసియాలోనే అతి పెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు దక్కించుకోవడం గమనార్హం. కొంకొణాసేన్ శర్మ, అర్జున్ రాంపాల్, తన్మయ్ దనానియా ముఖ్య పాత్రలు పోషించారు. అనుకోకుండా జరిగిన ఓ భయంకరమైన సంఘటన ఈ ముగ్గురి జీవితాలపై ఎటువంటి ప్రభావం చూపిందనేది ఈ సినిమా కథాంశం. ఈ చిత్రంలో కొంకణా అత్యాచారానికి గురైన మహిళ పాత్రను పోషిస్తుంది. అర్జున్ రాంపాల్ ఆమె భర్త పాత్రలో నటిస్తున్నారు. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్, ది క్వెస్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్ ఇంతకుముందు సైతం విమర్శకుల ప్రశంసలు పొందిన ‘స్కామ్ 1992’ వెబ్సిరీస్ని నిర్మించింది. చదవండి: బూసన్ ఫీల్మ్ ఫెస్టివల్‌కి అపర్ణసేన్ ‘ది రేపిస్ట్’ -
బూసన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి అపర్ణసేన్ ‘ది రేపిస్ట్’
నటనతోపాటు దర్శకత్వంలో ప్రతిభతో జాతీయ అవార్డులు పొందిన బెంగాలి నటి అపర్ణ సేన్. నాలుగు సార్లు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ ఈస్ట్ అవార్డులు పొందింది. అంతేకాదు పలుమార్లు ఉత్తమ ఫిల్మ్ మేకర్‌గా నిలిచింది. తాజాగా ఆమె దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ది రేపిస్ట్'. ఈ మూవీ ఆసియాలోనే అతి పెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ బూసన్ ఇంటర్నేషనల్ ఫీల్మ్ ఫెస్టివల్ (బీఐఎఫ్‌ఎఫ్)లో ప్రదర్శితం కానుంది. ఈ సందర్భంగా సినిమా దర్శకురాలు అపర్ణ మాట్లాడుతూ.. ‘మనుషులు రేపిస్టులుగా మారేందుకు దోహదపడే విషయాలను తెలుసుకోవడం, వారు మారేందుకు మార్గాలను అన్వేషిచడం నన్ను ఈ కథను ఎంచుకునేలా చేశాయి. అవే ఈ సినిమాలోని మూడు ముఖ్యపాత్రల్లో కనిపిస్తాయి’ అని తెలిపారు. ‘మనకు రెండు రకాలు ఇండియాలు ఉన్నాయి. పాత నమ్మకాలతో కూడిన మురికి వాడల్లో నివసించే ప్రజలతో ఒకటి, చదువుకుని ప్రగతిశీల విలువలతో ఉన్న ప్రజలతో మరొకటి నిండి ఉన్నాయి. రెండు రకాల భారతదేశాన్ని మా సినిమాలో చూపించాం’అని చెప్పారు. 'ది రేపిస్ట్' నేపథ్యం ఇదే.. అర్జున్ రాంపాల్, కొంకణ్ సేన్ శర్మ నటించిన 'ది రేపిస్ట్' మూడు ముఖ్యపాత్రల ప్రయాణం. అనుకోకుండా జరిగిన ఓ భయంకరమైన సంఘటన ఆ మూడు పాత్రల జీవితాలపై ఎటువంటి ప్రభావం చూపిందనేది ఈ సినిమా ముఖ్య కథాంశం. నేరాల వెనుక జరిగే పరిణామాలు నేరస్తులనే కాకుండా, నేరం నుంచి బయటపడిన వారి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో చూపిస్తుంది. ఈ చిత్రాని నిర్మించిన అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ సీఈవో సమీర్ నాయర్ మాట్లాడుతూ.. మా మొదటి ఫీచర్ ఫిల్మ్‌కి అపర్ణ సేన్ లాంటి ప్రతిభవంతురాలితో కలిసి ఇలాంటి పనిచేయడం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. అది బీఐఎఫ్‌ఎఫ్ కోసం కిమ్ జిసెయోక్ అవార్డు నామినేట్ అవ్వడంతో ఆ ఉత్సాహం రెట్టింపు అయ్యింది. విభిన్న కథాంశంతో రూపొందిన ఈ సినిమా కచ్చితంగా ప్రపంచ ప్రేక్షకుల మదిని దోచుకుంటుందని ఆశిస్తున్నామ"ని తెలిపాడు. అపర్ణ సేన్ 1974 నుంచి 1983 వరకు ఉత్తమ నటిగా నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకోడంతో పాటు దర్శకత్వం, స్క్రీన్ రైటర్ వంటి వివిధ శాఖల్లో తన ప్రతిభను చాటుకుని జాతీయ అవార్డులను పొందింది. దీంతో చలనచిత్ర రంగానికి ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 1987లో పద్మశ్రీతో సత్కరించింది. కాగా ఆసియాలోనే అతి పెద్దదైన బీఐఎఫ్‌ఎఫ్ 26వ ఎడిషన్ అక్టోబర్ 6 నుంచి 15 వరకు జరగనుంది. -
సెలబ్రిటీలపై దేశద్రోహం కేసు; ట్విస్ట్
ముజఫర్‌పూర్: దేశంలో పెరుగుతున్న మూక దాడులను నిరసిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన 50 మంది ప్రముఖులపై నమోదైన దేశద్రోహం కేసు ఉపసంహరణకు ఆదేశాలు జారీ అయ్యాయి. వారిపై బిహార్‌లోని సర్దార్ పోలీస్ స్టేషన్లో నమోదైన దేశద్రోహం కేసును మూసివేయాలని ముజఫర్‌పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనోజ్‌కుమార్ సిన్హా బుధవారం ఆదేశాలిచ్చారు. నిరాధార ఆరోపణలు చేసిన ఈ ఫిర్యాదుదారుపై విచారణ సాగుతుందని ఓ పోలీసు అధికారి తెలిపారు. వేర్పాటు ధోరణులను బలపరిచేలా బహిరంగ లేఖ రాశారంటూ ముజఫర్‌పూర్‌కు చెందిన సుధీర్ కుమార్ ఓఝా అనే న్యాయవాది 50 మంది ప్రముఖులపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దేశంలో మూక దాడులు పెరుగుతుండటాన్ని నిరసిస్తూ మణిరత్నం, అపర్ణాసేన్, కొంకణాసేన్, ఆదూర్ గోపాలకృష్ణన్, రామచంద్ర గుహ, రేవతి, అనురాగ్ కశ్యప్, శ్యామ్‌బెనగల్ వంటి 50 మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు మోదీకి జూలైలో లేఖ రాసిన విషయం తెలిసిందే. కాగా, మోదీకి బహిరంగ లేఖ రాసిన 49 మంది ప్రముఖులపై దేశద్రోహం కేసు పెట్టడంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కేసును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్, వామపక్షాలు, డీఎంకే, ఆర్జేడీ సహా పలు పార్టీలు డిమాండ్ చేశాయి. దీంతో బిహార్ పోలీసులు వెనక్కుతగ్గారు. అయితే, ఈ కేసుతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. (చదవండి: ప్రముఖులపై రాజద్రోహం కేసు) -
మణిరత్నంపై రాజద్రోహం కేసు
ముజఫర్‌పూర్/వయనాడ్: మూకదాడులపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాసిన 50 మంది ప్రముఖులపై రాజద్రోహం కింద కేసు నమోదైంది. ప్రధాని మోదీకి రాసిన జూలైలో రాసిన ఆ లేఖపై ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహతోపాటు, సినీ దర్శకులు మణిరత్నం, అదూర్ గోపాలకృష్ణన్, అపర్ణసేన్ తదితర యాభైమంది ప్రము ఖులు సంత కాలు న్నాయి. ము స్లింలు, దళితులు, మైనారిటీలపై మూకదాడులను ఆపాలని వారు తమ లేఖలో కోరారు. అయితే, ‘ఆ లేఖ కారణంగా దేశం ప్రతిష్ట దెబ్బతింది. వేర్పాటు ధోరణులను బలపరచడంతోపాటు ప్రధాని అద్భుత పనితీరును అందులో చులకన చేశారు’అని ఆరోపిస్తూ బిహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన సుధీర్ కుమార్ ఓఝా అనే న్యాయవాది చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టుకు ఆగస్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు రాజద్రోహం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని సదర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. -
ఆస్కార్ ఎంట్రీ లిస్ట్‌లో ‘డియర్ కామ్రేడ్’
క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఈ చిత్రాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ ఆస్కార్ ఎంట్రీ లిస్టులోకి అధికారికంగా ఎంపికైంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ చిత్రంతో పాటు మరో 28 చిత్రాలను ఈ జాబితాలోకి ఎంపికయ్యాయి. ఈ చిత్రాలన్నింటినీ స్క్రీనింగ్ చేసి, వాటిలో మంచి చిత్రాన్ని ఎంపిక చేసి బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీలో ఆస్కార్‌కి పంపుతారు. `డియర్ కామ్రేడ్` మాత్రమే ఈ లిస్టులోకి ఎన్నికైన ఏకైక తెలుగు చిత్రం. ప్రస్తుతం స్క్రీనింగ్ జరుగుతుంది. వీటిలో ఉత్తమ చిత్రాన్ని ప్రకటిస్తారు. ప్రముఖ ఫిలిం మేకర్ అపర్ణ సేన్ అధ్యక్షతన ఈ జ్యూరీ పని చేస్తుంది. భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రీమూవీ మేకర్స్, బిగ్ బెన్ బ్యానర్స్ డియర్ కామ్రేడ్ చిత్రాన్ని నిర్మించాయి. -
‘తన గొయ్యి తానే తవ్వుకుంటుంది’
కోల్‌కతా : సార్వత్రిక ఎన్నికల ఫలితాలు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తీవ్ర నిరాశకు గురి చేశాయి. బెంగాల్లో బీజేపీ ఏకంగా 18 స్థానాల్లో విజయం సాధించి.. దీదీకి గట్టి సవాల్ విసిరింది. ఎన్నికలు ముగిసినప్పటికి ఈ రెండు పార్టీల మధ్య విబేధాలు మాత్రం చల్లారడం లేదు. గత కొన్ని రోజులుగా బీజేపీ కార్యకర్తలు మమత ఎదురుగా ‘జై శ్రీరాం’ అంటూ నినాదాలు చేయడం.. ఆమె వారి మీద ఆగ్రహం వ్యక్తం చేయడం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో.. బీజేపీ కార్యకర్తల పట్ల మమత అతిగా స్పందిస్తూ.. తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారు అన్నారు అవార్డు విన్నింగ్ నటి అపర్ణా సేన్. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై అపర్ణ స్పందిస్తూ.. బీజేపీ కార్యకర్తల పట్ల మమతా బెనర్జీ వ్యవహరిస్తున్న తీరు నాకు నచ్చడం లేదు. మనది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ప్రజలు జై శ్రీరాం, జై కాళీ మాతా, అల్లా అంటూ ఇలా తమకు నచ్చిన దేవుని పేరు తల్చుకోవచ్చు. ఇది ఈ దేశ ప్రజలుగా వారికున్న హక్కు. మమతా బెనర్జీ ఈ విషయాన్ని గుర్తించలేకపోవడం దురదృష్టకరం. రాజకీయాలు వేరు.. మతం వేరు. ఈ రెండింటిని కలపి చూస్తే ఇలాంటి సమస్యలే ఎదురవుతాయి. ముఖ్యమంత్రి అయ్యుండి.. బీజేపీ కార్యకర్తల పట్ల ఆమె స్పందిస్తున్న తీరు ఏ మాత్రం బాగాలేదు. దీర్ఘకాలం ఆమె బెంగాల్‌కు సీఎంగా కొనసాగలనుకుంటే.. కంట్రోల్‌గా మాట్లాడాలి’ అని తెలిపారు. ‘దీదీ తీరు ఇలానే కొనసాగితే ఓటర్లను తనకు వ్యతిరేకంగా తానే మార్చుకున్నట్లు అవుతుంది. అదే జరిగితే ఆమె గొయ్యి ఆమె తవ్వుకున్నట్లు అవుతుంది’ అన్నారు అపర్ణా సేన్. (చదవండి : దీదీకి తప్పని జై శ్రీరాం సెగ..) -
సేన్, రేల మధ్య వైరుధ్య బంధం
సాక్షి, న్యూఢిల్లీ : ‘కళాత్మక చిత్రాలు తీస్తామని చెప్పుకునే వారందరికి విదేశాల్లో జరిగే చలన చిత్రోత్సవాల్లో పొల్గొనాలనే ధ్యాస తప్పించి, భారత ప్రేక్షకులను ఆకర్షించాలనే దృష్టి లేదు. కథ ఎలా చెప్పాలో తెల్సిన మృణాల్ సేన్ కూడా వారిలో ఒకరే’ అని ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శక నిర్మాత సత్యజిత్ రాయ్ రాసిన ఓ లేఖలోని వ్యాఖ్యలివి. మృణాల్ సేన్ తీసిన దాదాపు అన్ని సినిమాల గురించి విమర్శనాత్మక దృక్పథంతోనే మాట్లాడిన సత్యజిత్ రే ఆయన్ని విమర్శిస్తూ ప్రముఖ సినీ విమర్శకుడు చిదానంత గుప్తాకు (1991, జూన్‌లో) రాసిన ఆఖరి లేఖలోనిది ఈ వ్యాఖ్య. ఈ లేఖ ప్రతిని ఓ జాతీయ పత్రిక 1991, అక్టోబర్‌లో వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ వ్యాఖ్యలను చూసిన మృణాల్ సేన్ బాగా నొచ్చుకున్నారు. అప్పటికే సత్యజిత్ రే ఆస్పత్రిలో చేరి మృత్యువుతో పోరాడుతున్నారు. సినీ పాత్రికేయ లోకం మృణాల్ సేన్‌ను చుట్టుముట్టి, సత్యజిత్ రే చేసిన విమర్శలపై స్పందించాల్సిందిగా ఒత్తిడి తీసుకొచ్చారు. ‘సత్యజిత్ రే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మానసికంగా ఆయన ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన వేలకు మందులు తీసుకొని త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. అందుకని కళాత్మక విలువల గురించి. సినీ కళ గురించి నేనిప్పుడు చర్చించ దల్చుకోలేదు’ అని సేన్ వ్యాఖ్యానించారు. ఆయన ఆశించినట్లు సత్యజిత్ రే కోలుకోకుండా 1992, ఏప్రిల్ 23వ తేదీన కన్నుమూశారు. రే ఆస్పత్రిలో చేరిన దగ్గరి నుంచి ఆయన దహన సంస్కారాల వరకు మృణాల్ సేన్, రే కుటుంబం వెన్నంటే ఉన్నారు. అయితే అన్ని రోజులూ ఆయన కళ్లలో వెలుగు కోల్పోయిన ఛాయలే కనిపించాయి. సత్యజిత్ రే విమర్శలకు మృణాల్ సేన్ నొచ్చుకోవడం అదే మొదటి సారి కాదు. 1965లో ఆయన తీసిన ‘ఆకాశ్ కుసమ్’ నుంచి 1969లో హిందీలో తీసిన తొలి చిత్రం ‘భువన్ షోమ్’ (కరీర్లో 9వ చిత్రం) మొదలుకొని దాదాపు అన్ని చిత్రాలపై సత్యజిత్ విమర్శలు చేశారు. తెలుగులో తీసిన ‘ఒక ఊరి కథ’తోపాటు ఒకటి రెండు హిందీ చిత్రాలను మెచ్చుకున్నారు. కేవలం రెండు లక్షల రూపాయలను మాత్రమే వెచ్చించి తీసిన హిందీ చిత్రం ‘భువన్ షోమ్’ సినీ విమర్శకులనే కాకుండా కమర్షియల్‌గా కూడా ఎంతో హిట్టయింది. కొత్త తరంగ చిత్రంగా సినీ విమర్శకులు దాన్ని కొనియాడగా, ఆ అందులో ఏముందీ, ప్రేక్షకులకు ఆకట్టుకునే కొన్ని పాపులర్ టెక్నిక్‌లు తప్ప అని సత్యజిత్ రే విమర్శించారు. ‘ఏ బిగ్ బ్యాడ్ బ్యూరోక్రట్ రిఫామ్డ్ బై రస్టిక్ బెల్లి’ అంటూ వ్యాఖ్యానించారు. ఫ్రాంకోయా ట్రూఫాట్ చిత్రాల స్ఫూర్తితో మృణాల్ సేన్, సౌమిత్ర ఛటర్జీ, అపర్ణా సేన్ జంటగా ‘ఆకాశ్ కుసమ్’ చిత్రాన్ని తీశారు. ఈ చిత్రంతోనే ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలయింది. నాడు ‘స్టేట్స్‌మేన్’ పత్రిక ఈ సినిమాపై బహిరంగ చర్చను నిర్వహించింది. సినీ విమర్శకులు కొందరు సేన్ వైపు నిలువగా, మరికొందరు రే వైపు వ్యాఖ్యానాలు చేశారు. ఈ విషయం చినికి చినికి గాలివానగా మారడంతో 1965, సెప్టెంబర్ 13వ తేదీన చర్చను నిలిపివేస్తున్నట్లు స్టేట్స్‌మేన్ పత్రిక ప్రకటించింది. రే చేసిన దాదాపు అన్ని విమర్శలకు సేన్ సమాధానం ఇచ్చినా రే అంత ఘాటుగా ఎప్పుడు స్పందించలేదు. రే తీసిన ‘పథేర్ పాంచాలి’, అపరాజిత సిరీస్ చిత్రాలను ప్రశంసించిన మృణాల్ సేన్ ‘పరాస్ పత్తర్’ చిత్రాన్ని తీవ్రంగానే విమర్శించారు. ఈ ఇరువురు మహా దర్శకులు వర్తమాన జీవన వైరుధ్యాలపై తమదైన దృక్పథంతో సినిమాలు తీసి సామాజిక ప్రయోజనానికి దోహదపడ్డారు. వీరిద్దరు తీసిన ‘పునస్క–మహానగర్, ప్రతివాండీ–ఇంటర్వ్యూ, బైషే శ్రావణ–ఆశని సంకేత్, కోరస్–హీరక్ రాజర్ దిశే’ చిత్రాల్లో కథాంశం దాదాపు ఒకటే అయినా భిన్న కోణాలు కల్పిస్తాయి. ఒకప్పుడు మంచి మిత్రులే ఒడ్డూ, పొడువు, ఛామన ఛాయలో ఒకే తీరుగా కనిపించే మృణాల్ సేన్, సత్జిత్ రేలు చర్చా వేదికలపై ఒకరినొకరు విమర్శించుకుంటూ గంభీరంగానే కనిపించేవారు. అంతకుముందు వారు చాలా సన్నిహిత మిత్రలు. చాప్లిన్ మీద మృణాల్ సేన్ రాసిన పుస్తకం కవర్ పేజీని సత్యజిత్ రే స్వయంగా డిజైన్ చేశారు. లేక్ టెంపుల్ రోడ్డులోని సత్యజిత్ రే ఫ్లాట్‌కు సేన్ తరచూ వెళ్లి గంటల తరబడి సినిమా ముచ్చట్లు పెట్టేవారు. భిన్నత్వంలో ఏకత్వంలా వైరుధ్యంలో ఏకత్వంగా వారి మధ్య మిత్రత్వం ఉండేది. రే జ్ఙాపకాలతో మృణాల్ సేన్ నిన్న, అంటే ఆదివారం లోకం విడిచి వెళ్లి పోయిన విషయం తెల్సిందే. -
ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
ముంబై: 'షారుక్ ఖాన్ పాకిస్తాన్ ఏజెంట్' అంటూ వీహెచ్‌పీ నేత సాధ్వి ప్రాచీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బాలీవుడ్లో స్పందనలు మొదలయ్యాయి. జాతీయ అవార్డు గ్రహీత, బాలీవుడ్ నటి, దర్శకురాలు, అపర్ణా సేన్ దీనిపై సోషల్ మీడియాలో స్పందించారు. షారుక్ ఖాన్‌పై సాధ్వి ప్రాచీ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించిన ఆమె ట్విట్టర్లో కామెంట్స్ పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యల్ని నమ్మలేకపోతున్నాన్నారు. ఇలాంటి మాటలు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తాయన్నారు. ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. షారుక్ ఖాన్ మాటలను సమర్ధించిన అపర్ణ.. దేశంలో నెలకొన్న పరిస్థితులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు దేశంలో మత సామరస్యానికి వ్యతిరేకమన్నారు. భావప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకంగా పెరుగుతున్న దాడులకు ఇది సంకేతమన్నారు. పెరుగుతున్న మత అసహనానికి, దాడులకు నిరసనగా భారత రాష్ట్రపతికి ఒక లేఖను ఇవ్వనున్నట్టు ఆమె తెలిపారు. భావప్రకటనా స్వేచ్ఛను కాపాడుకోడానికి అందరూ కలిసి నడవాలని... రాష్ట్రపతికి ఇచ్చే లేఖపై అందరూ సంతకం చేయాలని కోరారు. -
విద్యాబాలన్‌కు వహీదా వహ్వా!
హిందీ రంగంలో పేరు తెచ్చుకున్న తెలుగు మహిళల్లో ఆ తరం నటి వహీదా రెహమాన్ పేరు ముందు వరుసలో ఉంటుంది. కొన్నాళ్ళుగా ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటూ, అడపాదడపా మాత్రమే నటిస్తున్న వహీదా తాజాగా ఇప్పుడు ఓ బెంగాలీ సినిమాలో నటిస్తున్నారు. అపర్ణాసేన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘అర్షీనగర్’లో కీలకమైన అతిథి పాత్ర పోషిస్తున్నారు. ‘‘ఇది రోమియో - జూలియట్ కథకు ఆధునిక రూపం అనుకోవచ్చు. ఇందులో ఇప్పుడు బెంగాలీలో జనం మెచ్చిన తారలైన దేవ్, రితికలతో కలసి తెరపై కనిపిస్తా’’ అని వహీదా చెప్పారు. నటి, రచయిత్రి, దర్శకురాలైన అపర్ణాసేన్ అంటే వహీదాకు ఎంతో గౌరవం. ‘‘అపర్ణాసేన్‌తో కలసి పనిచేయడమంటే నాకెప్పుడూ చాలా ఇష్టం. అన్నీ పక్కాగా ప్లాన్ చేసే అపర్ణ నాకు స్వాతంత్య్రం ఇచ్చి, నా వయసుకూ, ప్రతిభకూ తగ్గట్లు పనిచేయించుకుంటారు. గతంలో ఆమె దర్శకత్వంలో నటించిన ‘15 పార్క్ ఎవెన్యూ’ సినిమాలో కూడా అలాగే చేశారు’’ అని వహీదా చెప్పుకొచ్చారు. బెంగాలీలో సత్యజిత్ రే, సౌమిత్రా ఛటర్జీ లాంటి ప్రసిద్ధులతో కలసి పనిచేసిన ఈ సీనియర్ నటి ఇప్పటికీ గురుదత్తో కలసి పనిచేసిన ‘ప్యాసా’, ‘కాగజ్ కే ఫూల్’, ‘చౌద్వీ కా చాంద్’ లాంటి సినిమాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. ఈ మధ్యే 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న దేవానంద్ సినిమా ‘గైడ్’లో పోషించిన రోజీ పాత్ర తన జీవితంలో మర్చిపోలేని అనుభవమని వహీదా ఇప్పటికీ చెబుతుంటారు. మరి ఈ తరం నటీమణుల మాటేమిటంటే, వహీదా ఠక్కున చెప్పే పేరు - విద్యాబాలన్. ‘‘అందం, అద్భుతమైన ప్రతిభ, అపారమైన తెలివితేటలు - ఇవన్నీ ఉన్న నటి విద్యాబాలన్. ‘డర్టీ పిక్చర్’, ‘కహానీ’ చిత్రాల్లో ఆమె అద్భుతంగా నటించింది. సరైన స్క్రిప్ట్, సెన్సిబుల్ దర్శకుడు దొరికితే ఆమె అద్భుతాలు చేస్తుంది. ఆమెకు మంచి భవిష్యత్తు ఉందని నా నమ్మకం’’ అని వహీదా ప్రశంసలు కురిపించారు. అంత సీనియర్ ప్రశంసలు విని, విద్యాబాలన్ సహజంగానే పొంగిపోయి ఉంటుంది కదూ! -
నటి అపర్ణాసేన్ను ప్రశ్నించిన ఈడీ
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సష్టించిన పది వేల కోట్ల శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో ప్రముఖ బెంగాలీ నటి, దర్శకురాలు అపర్ణాసేన్, పశ్చిమ బెంగాల్ టెక్స్టైల్ మంత్రి శ్యామపాద ముఖర్జీని ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం ప్రశ్నించారు. శారదా గ్రూపు ఆధ్వర్యంలో నడిచిన పత్రికకు అపర్ణాసేన్ ఎడిటర్‌గా వ్యవహరించిన నేపథ్యంలో ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. అపర్ణాసేన్ వెంట ఆమె భర్త కళ్యాణ్ రాయ్ కూడా ఉన్నారు. తమ ప్రశ్నలన్నిటికీ అపర్ణాసేన్ సమాధానం ఇచ్చారని, కేసు విచారణలో అన్ని విధాలా సహకరిస్తానని చెప్పారని అధికారులు వెల్లడించారు. అలాగే 2009లో ఓ స్థిరాస్తి అమ్మకానికి సంబంధించి మంత్రి ముఖర్జీని ఈడీ అధికారులు ప్రశ్నించారు. -
‘మిస్టర్ అండ్ మిస్సెస్ అయ్యర్’ సినిమా తర్వాత పరిశ్రమలో మంచి గుర్తింపు
తల్లి, దర్శకురాలు అపర్ణాసేన్ నుంచి పొందిన స్ఫూర్తితో సినీపరిశ్రమలోకి అడుగుపెట్టిన కొంకణాసేన్ ఖాతాలో విజయాలు తక్కువేనని చెప్పాలి. అయితే నటనపరంగా చూస్తూ మిగతా నటీనటులకంటే ఆమెకే ఎక్కువ మార్కులు పడ్డాయి. ఈ విషయమై అస్ట్రేలియాలోని సత్యజిత్ రే ఇన్స్టిట్యూట్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ... ‘మిస్టర్ అండ్ మిస్సెస్ అయ్యర్ సినిమా తర్వాత పరిశ్రమలో నాకు మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాలో నటనకుగాను నాకు జాతీయ అవార్డు వచ్చింది. చిత్రీకరణ సమయంలో నటనలోని అన్ని కోణాలను చాలా దగ్గరగా చూశాననే అనుభూతి కలిగింది. నిజానికి ఆ సినిమా అంగీకరించే సమయంలో నాకు నటనలో పెద్దగా అనుభం లేదనే చెప్పాలి. కానీ నా తల్లి, దర్శకురాలు అపర్ణాసేన్ ప్రోత్సాహంతో ఆ పాత్రను ఒప్పుకున్నాను. నటనకు సంబంధించి ఎన్నో మెళకువలు ఆమె వద్ద నేర్చుకున్నాను. సినిమాలో నా పాత్ర కోసం ఓ పరిశోధన జరిగిదంనే చెప్పాలి. పాత్ర తీరుతెన్నులు ఎలా ఉండాలనే విషయాన్ని తెలుసుకునేందుకు అమ్మ చెన్నై వెళ్లింది. తనపాటు అసిస్టెంట్‌గా నన్ను తీసుకెళ్లింది. అలా తీసుకెళ్లడం నాకెంతో ఉపయోగపడింది. మొత్తానికి సినిమా బాగా వచ్చింది. ఆ తర్వాత అవార్డుల గురించి మీకు తెలిసిందే. అయితే సినిమాకు అవార్డులు వచ్చే సమయంలో నేను ఢిల్లీలో ఓ జాబ్‌లో స్థిరపడిపోయాను. కానీ అవార్డు తర్వాత అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. ఇంగ్లిష్, బెంగాలీ, హిందీ సినిమాల్లో నటించాను. బాల నటిగా 1983లోనే ‘ఇందిరాహ్’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నాకు తొలి చిత్రంలోనే బాలుడిలా కనిపించేందుకు వెంట్రుకలు కత్తిరించుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి సినిమా కోసం ఏదైనా చేయాలనే అభిప్రాయానికి వచ్చాను. అదే నన్ను జాతీయ అవార్డు దక్కించుకునేలా చేసింద’ని చెప్పింది. -
రజనీ-అమితాబ్ ఆలింగనం
వందేళ్ల భారతీయ సినిమా ఉత్సవాల కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సత్కరించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు గవర్నర్ కే రోశయ్య, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, రేఖలు తదితరులు హాజరయ్యారు. అమితాబ్, రజనీకాంత్ ల ఆలింగనం, అమితాబ్ ను సత్కరిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ! బాలీవుడ్ నటి రేఖను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తమిళనాడులోని చెన్నైలో సత్కరించారు. ఈ చిత్రంలో తమిళనాడు గవర్నర్ రోశయ్య కూడా ఉన్నారు.