![FIR against Mani Ratnam, Adoor and 47 others - Sakshi](/styles/webp/s3/article_images/2019/10/5/manira.jpg.webp?itok=BKR_eqEg)
మణిరత్నం
ముజఫర్‌పూర్/వయనాడ్: మూకదాడులపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాసిన 50 మంది ప్రముఖులపై రాజద్రోహం కింద కేసు నమోదైంది. ప్రధాని మోదీకి రాసిన జూలైలో రాసిన ఆ లేఖపై ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహతోపాటు, సినీ దర్శకులు మణిరత్నం, అదూర్ గోపాలకృష్ణన్, అపర్ణసేన్ తదితర యాభైమంది ప్రము ఖులు సంత కాలు న్నాయి.
ము స్లింలు, దళితులు, మైనారిటీలపై మూకదాడులను ఆపాలని వారు తమ లేఖలో కోరారు. అయితే, ‘ఆ లేఖ కారణంగా దేశం ప్రతిష్ట దెబ్బతింది. వేర్పాటు ధోరణులను బలపరచడంతోపాటు ప్రధాని అద్భుత పనితీరును అందులో చులకన చేశారు’అని ఆరోపిస్తూ బిహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన సుధీర్ కుమార్ ఓఝా అనే న్యాయవాది చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టుకు ఆగస్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు రాజద్రోహం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని సదర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment