letter to narendra modi
-
17 ఏళ్ల తర్వాత వచ్చి ఉద్యోగం కావాలన్నాడు
న్యూఢిల్లీ: తొలగింపుకు గురైన ఓ ఐఏఎస్ అమెరికాలో ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా చేరి, తిరిగి 17 ఏళ్ల తర్వాత భారత్ వచ్చి తనకు ఉద్యోగం ఇప్పించాలని ప్రధాని మోదీని కోరిన ఘటన ఇటీవల జరిగింది. 1984 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రాజేష్ సింగ్ ఉత్తరప్రదేశ్‌లో పోస్టింగ్ అందుకున్నాడు. పీహెచ్డీ కోసం రెండేళ్లకాలానికి ప్రభుత్వ అనుమతితో 1996లో అమెరికా వెళ్లారు. తర్వాత భారత్‌కు రాలేదు. ఉత్తరాఖంఢ్‌లో ఆయనకు పోస్టింగ్ వచ్చింది. తర్వాత 2001 ఆగస్టు 12 వరకూ సెలవులు కోరుతూ దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం ఓకే చెప్పింది. మళ్లీ 2001 డిసెంబర్ 31 వరకూ సెలవులు పొడిగించుకున్నారు. మళ్లీ ఆరునెలలు కావాలంటూ దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం తిరస్కరించింది. విధుల్లో చేరాలని యూపీ ప్రభుత్వం ఆదేశించింది. ఎంతకీ తిరిగి రాకపోవడంతో, చట్టం ప్రకారం ఐదేళ్లకు మించి విధులకు దూరంగా ఉండటంతో విధుల నుంచి 2003లో తొలగించారు. తనను విధుల్లో చేర్చుకోవాలంటూ 2017లో మోదీకి ఆయన లేఖ రాశారు. మోదీ దాన్ని తిరస్కరించడంతో, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. అక్కడా తిరస్కరణే ఎదురైంది. కొద్ది రోజుల పాటు సెలవులు పెడితేనే వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుందని, అలాంటిది సంవత్సరాల తరబడి సెలవులు ఎలా పెడతారని ట్రిబ్యునల్ మొట్టికాయలు వేసింది. -
సెలబ్రిటీలపై దేశద్రోహం కేసుపై నిరసనలు
న్యూఢిల్లీ: మూక దాడులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాసిన 49 మంది ప్రముఖులపై దేశద్రోహం కేసు పెట్టడాన్ని పలు పార్టీలు, సంఘాలు ఖండించాయి. కేసును వెనక్కు తీసుకోవాలని కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, డీఎంకే, ఆర్జేడీ, కేరళ రాష్ట్ర చలనచిత్ర అకాడెమీ డిమాండ్ చేశాయి. అయితే, ఈ కేసుతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని శనివారం కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్ స్పష్టం చేశారు. -
మణిరత్నంపై రాజద్రోహం కేసు
ముజఫర్‌పూర్/వయనాడ్: మూకదాడులపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాసిన 50 మంది ప్రముఖులపై రాజద్రోహం కింద కేసు నమోదైంది. ప్రధాని మోదీకి రాసిన జూలైలో రాసిన ఆ లేఖపై ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహతోపాటు, సినీ దర్శకులు మణిరత్నం, అదూర్ గోపాలకృష్ణన్, అపర్ణసేన్ తదితర యాభైమంది ప్రము ఖులు సంత కాలు న్నాయి. ము స్లింలు, దళితులు, మైనారిటీలపై మూకదాడులను ఆపాలని వారు తమ లేఖలో కోరారు. అయితే, ‘ఆ లేఖ కారణంగా దేశం ప్రతిష్ట దెబ్బతింది. వేర్పాటు ధోరణులను బలపరచడంతోపాటు ప్రధాని అద్భుత పనితీరును అందులో చులకన చేశారు’అని ఆరోపిస్తూ బిహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన సుధీర్ కుమార్ ఓఝా అనే న్యాయవాది చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టుకు ఆగస్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు రాజద్రోహం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని సదర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. -
అమ్మ మృతిపై అనుమానాలు: ప్రధానికి లేఖ
సుదీర్ఘ కాలం పాటు కమల్‌హాసన్‌తో సహజీవనం చేసి, ఇటీవలే విడిపోయిన ప్రముఖ నటి గౌతమి.. జయలలిత మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఒక లేఖ కూడా రాశారు. జయలలిత ఆస్పత్రి పాలు కావడం, అక్కడ పూర్తిగా కోలుకున్నట్లు చెప్పడం, అంతలోనే ఉన్నట్టుండి మృతి చెందారనడం.. వీటన్నింటిపైనా ఆమె ప్రధానికి రాశారు. అమ్మ ఆరోగ్యానికి సంబంధించిన మొత్తం అన్ని విషయాలనూ కప్పిపెట్టి ఉంచారని, ఆమె ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఎంత వీఐపీ, వీవీఐపీ వచ్చినా కూడా ఆమె ముఖాన్ని చూపించలేదని అన్నారు. అమ్మ ఆరోగ్యం పట్ల ఎంతో ఆందోళనతో వచ్చినవాళ్లంతా ఆమెను చూసే అవకాశం లేకపోవడంతో తీవ్ర నిరాశతో వెనుదిరిగారని గౌతమి అన్నారు. నిజానికి తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా కూడా పలువురికి జయలలిత ఆరోగ్యం, మృతి తదితర విషయాలపై అనుమానాలున్నా, ఎవరూ ఇలా బహిరంగంగా చెప్పలేదు. ఆమె మాత్రం నేరుగా ప్రధానమంత్రికి లేఖ రాశారు. ఇటీవలే ఒకసారి ప్రధాని మోదీని కూడా గౌతమి కలిసి వచ్చారు. అందరికీ ప్రేమమూర్తి, తమిళనాడు ప్రభుత్వాధినేత్రి కూడా అయిన ఆమె ఆరోగ్యం విషయంలో ఇంత రహస్యం ఎందుకు పాటించాల్సి వచ్చిందని గౌతమి ప్రశ్నించారు. ఆమె వద్దకు వెళ్లకుండా నియంత్రించిన వాళ్లు ఎవరు, వాళ్లకున్న అధికారం ఏంటన్నారు. ఆమె ఆరోగ్యం చాలా పాడైనప్పుడు ఆమెకు అందించాల్సిన చికిత్సల గురించి నిర్ణయాలు తీసుకున్నవాళ్లు ఎవరని అడిగారు. ప్రజల మదిలో అలజడి రేపుతున్న ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరిస్తారని నిలదీశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకుల గురించిన సమాచారాన్ని తెలుసుకునే హక్కు పౌరులకు ఉంటుందని గౌతమి తెలిపారు. ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటే కుదరదన్నారు. మోదీ తన ఆవేదనను పట్టించుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.