టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ.. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా బిజీగా గడిపేస్తున్నాడు. రీసెంట్‌గా విజయ్.. ‘డియర్ కామ్రేడ్’ అంటూ పలకరించాడు. అయితే ఈ సినిమాతో దక్షిణాదిన స్టార్‌గా ఎదుగుదామనుకున్న ఈ హీరోకు నిరాశే ఎదురైంది.
డియర్ కామ్రేడ్ మూవీ అనుకున్నంతగా ఆడకపోయినా.. విజయ్ మాత్రం తదుపరి సినిమా షూటింగ్‌లతో బిజీగానే గడిపేస్తున్నాడు. తాజాగా వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు. అయితే తాజాగా విజయ్ న్యూ లుక్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఈ కొత్త లుక్ తన కొత్త సినిమా కోసమే అయి ఉంటుంది. ఈ కొత్త లుక్‌లో విజయ్ సూపర్‌గా ఉన్నాడంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment