నీకిది తగునా... ఇకపై హద్దుమీరను.. | Raashi Khanna On Glamour Roles Says Will Not Encourage In Future | Sakshi
Sakshi News home page

ఇకపై హద్దు మీరను: రాశీ ఖన్నా

Published Sat, Feb 29 2020 8:50 AM | Last Updated on Sat, Feb 29 2020 9:45 AM

Raashi Khanna On Glamour Roles Says Will Not Encourage In Future - Sakshi

సాక్షి, చెన్నై: ‘అందాల ఆరబోతలో హద్దు మీరను’ అంటోంది హీరోయిన్‌ రాశీఖన్నా. ‘ఇమైకా నొడిగళ్‌’ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఈ తరువాత జయం రవికి జంటగా ‘అడంగమరు’, విజయ్‌సేతుపతితో ‘సంఘతమిళన్‌’ వంటి సక్సెఫుల్‌ చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం సుందర్‌.సి దర్శకత్వంలో అరణ్మణ్నై-3 చిత్రంలో నటిస్తోంది. త్వరలో దళపతి విజయ్‌తో నటించే అవకాశం తనకు రానుందనే ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఈ అమ్మడు తెలుగులో విజయ్‌దేవరకొండకు జంటగా నటించిన వరల్ట్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రంలో అందాలను విచ్చలవిడిగా ఆరబోసిందంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు స్పందించిన రాశీఖన్నా తానిప్పుడు కథానాయకిగా మంచి స్థాయికి చేరుకున్నానంది. ఇకపై తన చిత్రాల కలెక్షన్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రంలో అందాల ఆరబోతలో హద్దులు దాటినట్లు, ఇది మీకు అవసరమా అని అందరూ ప్రశ్నిస్తున్నారని.. ప్రస్తుతం తాను హీరోయిన్‌గా మంచి స్థాయికి చేరుకున్న కారణంగా ఇకపై నటిగా మరో మెట్టు ఎక్కేందుకు ఉపయోగపడే పాత్రలనే ఎంచుకుంటానని తెలిపింది. అందుకే ఇకపై గ్లామర్‌ విషయంలో హద్దులు మీరనని చెప్పుకొచ్చింది. (‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ మూవీ రివ్యూ)

అదే విధంగా మహిళల పాత్రలను కించపరచేవిధంగా తన చిత్రాల్లో చూపించినా సహించనని ఈ అమ్మడు స్పష్టం చేసింది. అలాంటి సన్నివేశాలు తాను నటించే సినిమాలో ఉన్నట్లయితే.. అవి నిజంగా అవసరమా అని దర్శకులను నేరుగానే ప్రశ్నిస్తానని చెప్పింది. కొన్ని సమయాల్లో తాను చెప్పిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటారని, కొన్ని సమయాల్లో కథకు అవసరం అని వాదిస్తారని అంది. ఏదేమైనా తన అభిప్రాయాన్ని మాత్రం కచ్చితంగా చెబుతానని రాశీ స్పష్టం చేసింది. అయితే ఆమె.. ఈ మాటలు చెబుతున్నది ప్రచారం కోసమేనా.. లేదా నిజంగానే మహిళల గౌరవం కోసమేనా అన్నది వేచి చూడాలి. అయినా ఇలా ఇంతకు ముందు చాలా మంది హీరోయిన్లు... గ్లామర్‌ పాత్రల విషయంలో ఇలాగే మాట్లాడారు. అయితే వాటిని పాటించడంలోనే నిజాయితీ కనిపించలేదు. ఒకటి మాత్రం నిజం... ఎవరు ఏం చెప్పినా, ఏం చేసినా అవకాశాలు చేతిలో ఉన్నంత వరకే. ప్రస్తుతం రాశీఖన్నాకు తెలుగు, తమిళ భాషల్లో బాగానే డిమాండ్‌ ఉంది కాబట్టి తాను ఏం చెప్పినా అభిమానులు నమ్ముతారని అనుకుంటోందని సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. (రాశీ ఖన్నా బెదిరించేది)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement