8సార్లు ఆస్కార్ అందుకున్న విజేతతో విద్యా | vidya balan selfy with 8 oscars winner alen menken | Sakshi
Sakshi News home page

8సార్లు ఆస్కార్ అందుకున్న విజేతతో విద్యా

Published Fri, Oct 23 2015 12:34 PM | Last Updated on Sun, Sep 3 2017 11:22 AM

vidya balan selfy with 8 oscars winner alen menken

యానిమేటెడ్ రొమాంటిక్ మ్యూజికల్ ఫాంటసీగా తెరకెక్కుతున్న 'బ్యూటి అండ్ ద బీస్ట్' సినిమాను భారత్లో కూడా ప్రమోట్ చేస్తున్నారు. గ్రాఫికల్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రానికి 8 సార్లు ఆస్కార్ అందుకున్న అలెన్ మెంకెన్ సంగీతం అందించాడు. ఓ టివి షో కోసం భారత్కు వచ్చిన అలెన్ త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న 'బ్యూటి అండ్ ద బీస్ట్' సినిమాను కూడా భారత సినీ అభిమానులకు పరిచయం చేశాడు.

ఈ సందర్భంగా ముంబై వచ్చిన అలెన్ మెంకెన్ను కలిసి బాలీవుడ్ నటి విద్యాబాలన్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. అలెన్ కలిసి దిగిన సెల్ఫీ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన విద్యా ' బ్యూటి అండ్ ద బీస్ట్ సంగీత దర్శకుడు, ఎనిమిది ఆస్కార్ అవార్డులు సాధించిన అలెన్ మెంకెన్ తో' అంటూ కామెంట్ చేసింది. డిస్నీ ద్వారా ఈ సినిమాను భారత్లోకూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement