కరోల్ లిటిల్టన్, మెల్ బ్రూక్స్, ఏంజెలా బాసెట్, మిచెల్ సాటర్
ఆస్కార్ అకాడమీ పద్నాలుగో ఆనరరీ అవార్డుల ప్రదానం అమెరికాలో జరిగింది. 2023 సంవత్సరానికిగాను నటి ఏంజెలా బాసెట్, నటుడు– రచయిత–ఫిల్మ్ మేకర్ మెల్ బ్రూక్స్, ఫిల్మ్ ఎడిటర్ కరోల్ లిటిల్టన్, సన్‌డాన్స్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన మిచెల్ సాటర్‌లకు ఈ అవార్డులను ప్రదానం చేసింది అకాడమీ. అయితే ఈ వేడుక గత ఏడాది నవంబరు 18న జరగాల్సింది. కానీ హాలీవుడ్‌లో రచయితలు, నటీనటులు చేసిన సమ్మెల కారణంగా ఈ వేడుక వాయిదా పడింది.
తాజాగా ఈ అవార్డు ప్రదానోత్సవం అమెరికాలో జరిగింది. ఈ గౌరవ పురస్కారాల అవార్డు విభాగంలో రెండో అవార్డును గెలుచుకున్న బ్లాక్ లేడీగా నిలిచారు ఏంజెలా బాసెట్. తొలిసారిగా నటి సిసిలీ టైసన్ ఈ గౌరవాన్ని ΄÷ందారు. ‘‘ఈ విభాగంలో నేను అవార్డు అందుకున్నందుకు ఆమె (సిసిలీ) స్వర్గంలో ఆనందంగా ఉండి ఉంటారు. నా తోటి బ్లాక్ యాక్ట్రస్ అందరికీ చెబుతున్నాను. మీ హృదయాలను ధైర్యంతో నింపుకోండి. ధృడంగా ఉండండి’’ అంటూ అవార్డు అందుకున్న అనంతరం ఏంజెలా బాసెట్ ఉద్వేగంగా ప్రసంగించారు.
‘‘మీ సహచరులు మీ పనిని మెచ్చుకున్నప్పుడు మరియు వారు ఈ బంగారు విగ్రహంతో అభినందించినప్పుడు కలిగే ఆనందమే వేరు. ఈ పురస్కారానికి నా మనసులో ఎప్పటికీ గౌరవం ఉంటుంది. అందుకే ఈ అవార్డును అమ్మను సుమా..’’ అని చమత్కరించారు మెల్ బ్రూక్స్. ఈ వేడుకలో టామ్ హాంక్స్, జూలియన్నే మూర్, మార్గొట్ రాబీ, కోల్మన్ డొమింగో వంటి హాలీవుడ్ ప్రముఖులు ΄ాల్గొన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... చిత్రసీమకు విశిష్టమైన సేవలు అందించిన వారికి ఈ హానరరీ అవార్డులను ప్రదానం చేస్తుంటారు. మరోవైపు ఈ ఏడాది మార్చిలో 96వ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజెల్స్‌లో జరగనుంది. జనవరిలో నామినేషన్స్ వెల్లడి కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment