బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌పుత్‌కు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. ఓ ప్రముఖ సౌందర్య సాధనాల సంస్థ ప్రకటనలో నటించినందుకు ఆమెపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయమేమిటంటే... త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న మీరా.. తాను తొలిసారిగా నటించిన ఓ టీవీ కమర్షియల్ యాడ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
‘తల్లిగా మారినంత మాత్రాన.. మీకు మీరుగా ఉండే హక్కును కోల్పోయినట్టు కాదుగా.. ఇదిగో ఇదే నా రీబార్న్ స్టోరీ’ అంటూ యంటీ ఏజింగ్‌కు క్రీమ్‌కు సంబంధించిన తన వీడియోను పోస్ట్ చేశారు. మీరా వీడియోకు స్పందనగా.. ‘ 23 ఏళ్ల యువతి.. యాంటీ ఏజింగ్ క్రీమ్‌కు ప్రచారం చేయడమేంటి.. నాన్సెన్స్’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా... ‘నయవంచకురాలిగా ప్రవర్తిస్తున్నారు. చర్మ సౌందర్యం కోసం సహజ సిద్ధమైన ఉత్పత్తులే వాడతానంటూ ఇది వరకు ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పారు. కానీ ఇప్పుడు మాట తప్పారు. ఇలాంటి ఉత్పత్తులకు ప్రచారం చేసి మిమ్మల్ని మీరు తగ్గించుకోకండి. అలాంటి పనులు మానుకోండి. మిమ్మల్ని చూసి సిగ్గు పడుతున్నానంటూ’ అంటూ మరొకరు ఫైర్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment