లాక్‌డౌన్ వేళ సినీ సెలబ్రిటీలు ఇంటికే పరిమితమయ్యారు. ఇక తమ అభిరుచులు, కళలను మెరుగుపరుచుకుంటున్నారు. సినిమా చిత్రీకరణలు వాయిదా పడినప్పటికీ సినీ ప్రముఖులు ఎప్పటికప్పుడు తమ పాత ఫొటోలు, వీడియోలు, లాక్‌డౌన్‌లో ఇంట్లో చేస్తున్న పనులకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. మరి కొంతమంది సోషల్ మీడియాలో లైవ్ చాట్ నిర్వహిస్తూ అభిమానులతో ముచ్చటిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తన ట్విటర్ ఖాతాలో ‘ఆస్క్ మీ’ లైవ్ చాట్‌ను నిర్వహించారు.
దీనిలో భాగంగా కబీర్‌సింగ్ సినిమా, ప్రస్తుతం తాను నటిస్తున్న ‘జెర్సీ’ మూవీకి సంబంధించి పలు విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలో ఓ అభిమాని లాడ్‌డౌన్ సమయంలో ఇంట్లో ఉంటూ..‘ తినటం, గిన్నెలు కడగటం, బట్టలు ఉతకటం వంటి పనుల్లో వీరు ఏ పని చేస్తున్నారు’ అని అడగ్గా.. ‘నాది ఇంట్లో గిన్నెలు కడిగే పని మాత్రమే’ అని షాహిద్ సమాధానం ఇచ్చారు.
Mera department bartan ka hai. Tumhara? https://t.co/KMeKGlaqSf
— Shahid Kapoor (@shahidkapoor) May 12, 2020
అదేవిధంగా ‘కబీర్‌సింగ్ మూవీకి అవార్డులు రాలేదని నిరాశ చెందుతున్నారా? అని మరో ప్రశ్న అడగ్గా.. ‘మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు, మీ వల్లనే నేను ఇలా ఉన్నాను’ అని షాహిద్ అన్నారు. ఇక షాహిద్ ‘జెర్సీ’ చిత్రాకి సంబంధించి మాట్లాడుతూ.. ‘ఓ మంచి సినిమాను మీ ముందుకు తీసుకురాబోతున్నాము. నాకు ‘జెర్సీ’ చిత్రయూనిట్‌తో పని చేయటం చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పుకొచ్చారు. ఇక షాహిద్ లాక్‌డౌన్‌లో భాగంగా పంజాబ్‌లో తన కుటుంబసభ్యులతో గడుపుతున్న విషయం తెలిసిందే.
Just trying our best to make a good film. But I am very happy with whatever we have done so far. Really enjoying the journey and the team. https://t.co/wsCYinUNK6
— Shahid Kapoor (@shahidkapoor) May 12, 2020
Comments
Please login to add a commentAdd a comment