పెళ్లంటే రెండు మనసుల కలయిక.. నూరేళ్లు జంటగా జీవించేందుకు ముందడుగు.. ఇలా బోలెడు కబుర్లు చెప్తారు. కానీ బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ మాత్రం పెళ్లికి సరికొత్త అర్థం చెప్పాడు. అబ్బాయిని సరైన దారిలో పెట్టేందుకు ఓ అమ్మాయి అతడి జీవితంలోకి రావడమే వివాహం అని పేర్కొన్నాడు. ఇది విన్న ఫ్యాన్స్ తల పట్టుకుంటున్నారు.
షాహిద్ కపూర్ ప్రస్తుతం బ్లడీ డాడీ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. 'ఈ వివాహం అనేది ఒకే ఒకదానిపై ఆధారపడి ఉంటుంది. అదేంటంటే.. జీవితంపై ఓ క్లారిటీ లేని అబ్బాయి లైఫ్‌లోకి అమ్మాయి వచ్చి అతడి సమస్యలను పరిష్కరించి, తనను ఓ దారిలో పెట్టడమే పెళ్లి. ఆ అమ్మాయి వల్లే అతడు బాధ్యత గల వ్యక్తిగా మారతాడు' అని కొత్త నిర్వచనం ఇచ్చాడు. ఈ వ్యాఖ్యలు కొందరికి అస్సలు మింగుడుపడటం లేదు.
'ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగడం పెళ్లి కాదా? ఒకరినొకరు సరిదిద్దుకోవడమే పెళ్లా? ఇదెక్కడి విచిత్రం?' అని కామెంట్లు చేస్తున్నారు. 'ఏంటి బాబూ మరోసారి చెప్పు.. అంటే మీ అమ్మ అదే పని చేసిందా? నిన్ను సరిగా పెంచిందా? లేదా? మీకింకా బుర్ర ఎదగలేదు. ఆడవాళ్లు అంటే మిమ్మల్ని పెంచుతూ, మిమ్మల్ని బాగు చేసే నర్సులు అనుకుంటున్నారా?', 'నువ్వు కబీర్ సింగ్(అర్జున్ రెడ్డి రీమేక్)లో నటించావు, మాకు ఆ విషయం తెలుసు, కానీ నువ్వు ఇంకా ఆ పాత్రలో నుంచి బయటపడలేదా?' అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: ప్రియుడితో నటి బ్రేకప్.. ఓదార్చిన వ్యక్తితో పెళ్లికి రెడీ
Comments
Please login to add a commentAdd a comment