బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ భార్య మీరా కపూర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తన కుమారుడిని హత్తుకుని ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన మీరా.. ‘ చిన్నారి అద్భుతం’ అంటూ క్యాప్షన్ జత చేశారు. కేరింతలు కొడుతున్న జైన్‌తో పాటు హృద్యమైన నవ్వుతో ఆకట్టుకుంటున్న మీరా ఫొటోకు ఇప్పటికే 2 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఈ క్రమంలో ‘మీ బంగారం చాలా అందంగా ఉన్నాడు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా... ‘తప్పైతే క్షమించండి. మీ భర్త షాహిద్ కంటే జైన్ ఎంతో అందంగా ఉన్నాడు. తనతో పాటు మీరు కూడా చాలా క్యూట్‌గా ఉన్నారు’ అంటూ మరొకరు చమత్కరించారు.
కాగా 2016లో మిషాకు జన్మనిచ్చిన షాహిద్- మీరా దంపతులు ఇటీవలే కుమారుడికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తమ చిన్నారికి జైన్ కపూర్ అని నామకరణం చేసిన ఈ జంట..అతడికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు. ఇక షాహిద్ కపూర్ ప్రస్తుతం ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘ కబీర్ సింగ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment