బాలీవుడ్ ‘అర్జున్ రెడ్డి’ షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌పుత్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలను తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటారామె. ప్రస్తుతం షాహిద్‌తో కలిసి సింగపూర్ టూర్‌లో ఉన్న మీరా.. మేడమ్ టుస్సాడ్స్‌లో భర్త మైనపు విగ్రహంతో దిగిన ఫొటోను గురువారం షేర్ చేశారు. షాహిద్ కపూర్ మైనపు విగ్రహానికి ముగ్ధురాలైన మీరా.. ‘నా వాడిని(షాహిద్) నేను ఇంటికి తీసుకెళ్తున్నా. కానీ మీ కోసం ఇంకొకరిని ఇక్కడే వదిలేస్తున్నా మేడమ్ అంటూ క్రేజీ క్యాప్షన్ జత చేశారు.
కాగా పోస్ట్ చేసిన మూడు గంటల్లోనే లక్షన్నరకు పైగా లైకులు సాధించిన ఈ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక 2015లో షాహిద్ కపూర్- మీరా రాజ్‌పూత్‌ల పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. వీరికి కుమార్తె మిషా, కుమారుడు జైన్ ఉన్నారు. కాగా అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్‌తో షాహిద్ కపూర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌తో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 21 ఈ చిత్రం విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment