షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్
‘‘మా అబ్బాయి జైన్ కపూర్‌కి బహుమతులు వద్దు. మీ ప్రేమ, ఆశీర్వాదాలు ఉంటే చాలు’’ అంటున్నారు మీరా రాజ్‌పుత్. బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ శ్రీమతినే ఈ మీరా రాజ్‌పుత్. ఇంతకీ విషయం ఏంటంటే.. ఇటీవల మీరా ఓ బాబుకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బుడతడికి జైన్‌కపూర్‌కు అని పేరు పెట్టారు. ఈ బుజ్జిగాడికి షాహిద్ ఫ్యాన్స్ బోలెడు బహుమతులను పంపించారు. ఈ విషయంపై మీరా స్పందించారు.
‘‘ఎంతో అభిమానంతో జైన్ కపూర్‌కు బహుమతులు పంపిస్తున్న ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు. కానీ మీ గిఫ్ట్‌లను నిజంగా అవసరం ఉన్న చిన్నారులకు, వారి కుటుంబాలకు అందించండి. అప్పుడు ఇంకా ఎక్కువమంది ఆనందపడతారు’’ అన్నారామె. ఈ దంపతులకు ఇదివరకే మిషా అనే కుమార్తె ఉన్న విషయం తెలిసిందే. ఇక సినిమాల దగ్గరకు వస్తే... తెలుగు హిట్ ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్‌లో షాహిద్ కపూర్ నటించనున్నారు. త్వరలో షూటింగ్ స్టార్ట్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment