తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న హీరోయిన్ కృతీ శెట్టికి బాలీవుడ్ నుంచి కబురొచ్చిందనే టాక్ వినిపిస్తోంది. నాని హీరోగా, కృతీ శెట్టి, సాయిపల్లవి హీరోయిన్స్‌గా నటించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గత ఏడాది డిసెంబరు 24న విడుదలై మంచి విజయం సాధించింది. కాగా ఈ చిత్రం హిందీలో రీమేక్ కానుందని బాలీవుడ్ టాక్. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటించనున్నారట.
ఒరిజినల్‌లో కృతీ శెట్టి చేసిన పాత్రనే హిందీ రీమేక్‌లోనూ చేయాలని షాహిద్ అండ్ కో ఆమెను సంప్రదించారట. హిట్‌మూవీకి రీమేక్ కావడం, పైగా షాహిద్ వంటి స్టార్‌తో బాలీవుడ్ ఎంట్రీ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని కృతి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని భోగట్టా. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment