బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే.. కానీ ఒక అవుట్‌సైడర్‌గానే కెరీర్ మొదలుపెట్టాడు. ఆమె తల్లి నటి, రచయిత్రి.. సీరియల్స్, సినిమాల్లో సాధారణ పాత్రలు పోషించేది. తండ్రి నటుడు.. ఈయన కూడా సీరియల్స్‌లో యాక్ట్ చేశాడు. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇప్పటికీ రాణిస్తున్నాడు. ఈ ఇద్దరి పేర్లు వాడుకోకుండా సినిమాల్లోకి వచ్చాడు షాహిద్. దీంతో అవుట్‌సైడర్స్(సినీ బ్యాగ్రౌండ్ లేనివారు)ని ఎలాగైతే చూసేవారో తనను కూడా అలాగే చులకనగా చూసేవారంటున్నాడు షాహిద్.
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగానే..
'ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చినప్పుడు క్లాసులో నన్ను కూర్చోనివ్వలేదు. నా యాస వేరేగా ఉండటంతో నన్ను పరాయివాడిగా, అంటరానివాడిగానే చూశారు. మేము అద్దె ఇంట్లో ఉండేవాళ్లం. 11 నెలలకోసారి ఇల్లు మారుతూ ఉండేవాళ్లం. ఎవరూ మాతో కలుపుగోలుగా ఉండేవారు కాదు. కాలేజీలో మాత్రం నన్ను యాక్సెప్ట్ చేశారు. నాకంటూ మంచి మిత్రులు దొరికారు. కానీ ఎప్పుడైతే ఇండస్ట్రీలో అడుగుపెట్టానో నాకు మళ్లీ నా స్కూలు గుర్తొచ్చింది. ఇక్కడ బయట నుంచి వచ్చేవాళ్లకు అంత ఈజీగా అవకాశాలివ్వరు. హీనంగా చూస్తారు. చాలా ఏళ్లు ఆ సమస్యతో బాధపడ్డాను.
అప్పుడంత శక్తి లేదు కానీ..
నేను గుంపు(బాలీవుడ్ గ్యాంగ్)లో తిరిగే రకాన్ని కాదు. అవకాశాల కోసం అలా తిరగడం ఇష్టముండదు కూడా! అలా అని వారు ఇతరులను తొక్కేయాలనుకోవడం, వారిని ఎదగకుండా చేయడం, అవమానించడం సరి కాదు. టీనేజ్‌లో తిరిగి పోరాడేంత శక్తి నాకు లేకపోయింది. కానీ ఇప్పుడు నన్ను వేధించాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోను, తిరగబడతాను. ఇతరుల్ని వేధించి ఆనందించేవాళ్లను నేను కూడా వేధిస్తాను, అదే వారికి తగిన శిక్ష' అని చెప్పుకొచ్చాడు. కాగా షాహిద్ చివరగా 'తేరి బాతోన్ మే ఐసా జియా' అనే సినిమా చేశాడు. ఈ చిత్రం రూ.150 కోట్లకు పైగా రాబట్టింది.
చదవండి: మనసు మార్చుకున్న బ్యూటీ.. బోల్డ్ సీన్స్‌కు పచ్చజెండా.. ఆ సీన్ అందుకే చేశానంటూ..
Comments
Please login to add a commentAdd a comment