అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమాతోనే అతడు రౌడీ స్టార్‌గా మారిపోయాడు. ఇది బాలీవుడ్‌లో కబీర్ సింగ్‌గా రీమేకై అక్కడ కూడా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. తెలుగులో విజయ్ దేవరకొండ పోషించిన పాత్రను హిందీలో షాహిద్ కపూర్ నటించాడు. తాజాగా ఈ ఇద్దరు అర్జున్ రెడ్డిలు ఒక్కచోట కనిపించారు.
ఓటీటీ ఈవెంట్‌లో అర్జున్‌రెడ్డి, కబీర్ సింగ్
మార్చి 19న అమెజాన్ ప్రైమ్ వీడియో.. ముంబైలో ఓ ఈవెంట్ నిర్వహించింది. ప్రైమ్ వీడియోలో రాబోయే సినిమాలు, సిరీస్‌లివే అంటూ పెద్ద జాబితానే రిలీజ్ చేసింది. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ కూడా థియేటర్‌లో రిలీజైన తర్వాత అమెజాన్ ప్రైమ్‌లోకి రానుందని షాహిద్ కపూర్ ప్రకటించాడు. ఈ సమయంలో చిత్రయూనిట్‌ను వేదికపైకి ఆహ్వానించాడు.
విజయ్‌ను చూసి ఎమోషనల్
విజయ్‌ను చూసి ఎమోషనలైన షాహిద్ అతడి చేయి పట్టుకుని మాట్లాడాడు. 'నేను విజయ్‌కు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అతడు లేకపోతే అర్జున్ రెడ్డి లేదు. అర్జున్ రెడ్డి లేకపోతే ఈ కబీర్ సింగ్ కూడా ఉండేవాడు కాదు' అంటూ అతడి చెంపపై ముద్దుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇకపోతే షాహిద్ కపూర్ అశ్వథ్థామ మూవీ కూడా ప్రైమ్‌లోనే రిలీజ్ కానున్నట్లు ఈ వేదికపై ప్రకటించారు.
#ArjunReddy Meets #KabirSingh#VijayDevarakonda #ShahidKapoorpic.twitter.com/SJid9dq1X2
— GSK Media (@GskMedia_PR) March 19, 2024
చదవండి: అమెజాన్ ప్రైమ్ క్రేజీ అప్‌డేట్స్: ఒకేసారి 50కి పైగా వెబ్‌సిరీస్, సినిమాల ప్రకటన.. లిస్ట్ ఇదిగో
Comments
Please login to add a commentAdd a comment