Ashwatthama: The Saga Continues: బాలీవుడ్‌ అశ్వత్థామ | Shahid Kapoor to front action film Ashwatthama | Sakshi
Sakshi News home page

Ashwatthama: The Saga Continues: బాలీవుడ్‌ అశ్వత్థామ

Published Thu, Mar 21 2024 4:16 AM | Last Updated on Thu, Mar 21 2024 4:16 AM

Shahid Kapoor to front action film Ashwatthama - Sakshi

బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ హీరోగా నటించనున్న కొత్త సినిమాకు ‘అశ్వత్థామ: ది సాగా కంటిన్యూస్‌’ టైటిల్‌ ఖరారైంది. కన్నడ దర్శకుడు సచిన్‌  రవి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వసు భగ్నాని, జాకీ భగ్నాని, దీప్షికా దేశ్‌ముఖ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా అధికారిక ప్రకటన వెల్లడైంది.

సచిన్‌  రవి మాట్లాడుతూ– ‘‘మహా భారతంలోని అశ్వత్థామ ఇప్పటికీ జీవించే ఉంటారని కొందరి నమ్మకం. మహాభారత కాలంనాటి ఓ అమరుడు ఇప్పటి ఆధునిక కాలానికి వస్తే ఏం జరుగుతుంది? అనే అంశాలను ఈ సినిమాలో చూపిస్తున్నాం’’ అన్నారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో లెజెండ్స్‌ యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది? అనే కోణంలో ఈ సినిమా కథనం
ఉంటుంది. త్వరలోనే మూవీ రిలీజ్‌ డేట్‌ వెల్లడిస్తాం’’ అని పేర్కొన్నారు జాకీ భగ్నాని. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement