ప్రెగ్నెన్సీ రూమర్లపై స్పందించిన షాహిద్‌ భార్య | Shahid Kapoor Wife Mira Rajput Confirms She Is Not Pregnant | Sakshi
Sakshi News home page

సినిమాల్లో నటించను: షాహిద్‌ భార్య

Published Mon, Dec 28 2020 8:10 AM | Last Updated on Mon, Dec 28 2020 9:53 AM

Shahid Kapoor Wife Mira Rajput Confirms She Is Not Pregnant - Sakshi

బాలీవుడ్‌ కబీర్‌ సింగ్‌ షాహిద్‌ కపూర్‌ భార్య మీరా రాజ్‌పుత్‌ తరచూ సోషల్‌ మీడియాలో అభిమానులను ముచ్చటిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఏవైనా ప్రశ్నలు సంధించమని కోరగా నెటిజన్ల లెక్కలేనన్ని సందేహాలు ఆమె ముందు కుప్పలుతెప్పలుగా వచ్చిపడ్డాయి. వీటిలో పలు ప్రశ్నలకు ఆమె నవ్వుతూ సమాధానం ఇచ్చింది. మీరు గర్భవతా? అన్న ప్రశ్నకు ఆమె లేదని చెప్పింది. సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారా? అన్న ప్రశ్నకు సైతం కుదరదని జవాబిచ్చింది. దీంతో త్వరలోనే ఆమె బాలీవుడ్‌ ఎంట్రీ ఉండబోతుందన్న ఊహాగానాలకు తెరదించినట్లైంది. ఇక మీరా 2018లో ఓ యాడ్‌ షూటింగ్‌లో మొదటిసారి పాల్గొన్నారు. పలు ఉత్పత్తులకు ఆమె తన సోషల్‌ మీడియా పేజీ ద్వారా ప్రచారం కల్పిస్తున్నారు. (చదవండి: 2020 ఇంట్లో కూడా సినిమా చూపించింది)

కాగా షాహిద్‌, మీరా 2015లో జూలై 7న పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు కూతురు మిషా, కొడుకు జైన్‌ ఉన్నారు. ఇక షాహిద్‌ సినిమాల విషయానికొస్తే.. ఆయన క్రికెట్‌ ప్లేయర్‌గా నటిస్తున్న జెర్సీ రీమేక్‌ షూటింగ్‌ ఇటీవలే పూర్తైంది. మృణాల్‌ థాకూర్‌ కథానాయికగా నటించారు. తెలుగు చిత్రాన్ని తెరకెక్కించిన గౌతమ్‌ తిన్ననూరి ఈ హిందీ రీమేక్‌ను డైరెక్ట్‌ చేశారు. వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. అలాగే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. తెలుగు దర్శక ద్వయం రాజ్, డీకే ఓ యాక్షన్‌ ప్రధానమైన వెబ్‌ సిరీస్‌ను రూపొందించనున్నారట. ఇందులో హీరోగా షాహిద్‌ కపూర్‌ కనిపిస్తారని సమాచారం. థ్రిల్లర్‌ జానర్‌లో ఈ సిరీస్‌ రెండు సీజన్లుగా తెరకెక్కనుంది. (చదవండి: నా పని గిన్నెలు కడగటం: షాహిద్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement