ముంబై: బాలీవుడ్ ‘కబీర్ సింగ్’ షాహిద్ కపూర్ ప్రస్తుతం ‘జెర్సీ’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో భార్య మీరా రాజ్‌పుత్‌ను మిస్ అవుతున్నానంటూ సోమవారం సోషల్ మీడియాలో వారిద్దరి ఫొటోను షేర్ చేశాడు. మీరా భుజంపై తల వాల్చి ఉన్న బ్లర్ ఫొటోను షాహిద్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ‘మిస్ యూ’ అనే హ్యాష్ ట్యాగ్‌ను జత చేశాడు. అయితే దీనికి మీరా తనదైన శైలిలో సరదాగా షాహిద్‌ను ఆటపట్టించింది. (చదవండి: ఆట ముగిసింది)
షాహిద్ పోస్టుకు మీరా.. ‘మీరు అంతగా సంతోషంగా లేరు.. కాబట్టి నేను మిస్ యూ టూ అని పెట్టను’ అంటూ సరదాగా కామెంట్ పెట్టింది. 2015లో వివాహం చేసుకున్న ఈ జంటకు ప్రస్తుతం ఇద్దరూ పిల్లలు ఉన్నారు. అయితే ప్రస్తుతం షాహిద్ నటిస్తున్న తెలుగు రీమేక్ ‘జెర్సీ’ షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో క్రికెట్ ప్లేయర్‌గా కనిపించడానికి షాహిద్ పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకున్నాడు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment