బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ అత్యధికంగా సంపాదిస్తున్న నటులలో ఒకడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న షాహిద్ ముంబైలో కొంత ఇంటిని కొనుగోలు చేశాడు. షాహిద్, అతడి భార్య మీరా రాజ్‌పుత్‌లు కలిసి కొంత ఇంటిని తమ అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్నారట. ముంబై జూహులోని సముంద్ర సమీపంలోని ఓ అపార్టుమెంటులో విశాలవంతమైన ప్లాట్‌ను దాదాపు 56 కోట్ల రూపాయలకు ఖరీదు చేసినట్లు తెలుస్తోంది. ఇది బాలీవుడ్ స్టార్ హీరోలైన అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్ ఇంటికి సమీపంలోనే ఉండటం విశేషం.
ఈ అపార్టుమెంటులో 42, 43వ అంతస్థులో డూప్లెక్స్ ప్లాట్, సీ ఫెషింగ్ వారి ఇంటికి ప్రత్యేక ఆకర్షణ. తమ కొంత ఇటిని ఈ రోజు తన సోదరుడు ఇషాన్ ఖట్టర్, భార్య మీరాతో కలిసి సందర్శించిన ఫొటోలను షాహిద్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతున్నాయి. కాగా తెలుగు అర్జున్ రీమేక్ కబీర్ సింగ్‌తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న షాహిద్ ప్రస్తుతం తెలుగు జెర్సీ రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం షాహిద్ రోహిత్ శర్మ దగ్గర శిక్షణ కూడా తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి షెడ్యూల్‌ను జరుపుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment