రజనీకాంత్, కమలహాసన్‌తో దేవీశ్రీప్రసాద్
తమిళసినిమా: దేవీశ్రీ ప్రసాద్ సంగీతం ఉంటే ఆ చిత్రం సక్సెసే అన్నంత స్థాయికి ఎదిగారాయన. ఆయన ప్రస్తుతం విక్రమ్ హీరోగా హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సామి స్కేయర్ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్న దేవీశ్రీప్రసాద్‌ను కారణం ఏమిటని ప్రశ్నించగా మరింత ఆనందంతో చెప్ప డం మొదలెట్టారు. అదేమిటో ఆయన మాటల్లోనే.. ఈ మ ధ్య దక్షిణ భారత నటినటుల సంఘం మలేషియాలో స్టార్స్ క్రికెట్‌తో పాటు పలు సినీ వినోద కార్యక్రమాలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమంలో నేనూ పా ల్గొన్నాను. చివరి కార్యక్రమంలో నేను ఆడి పాడాను. ఆ వేదిక ముందు వరుసలో సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమలహాసన్ కూర్చుని నా ఆట, పాటను తిలకించి, చివర్లో లేచి నిలబడి చప్పట్లతో అభినందించడం మరచిపోలేని అనుభూతి. ఇద్దరు లెజెండ్స్ ఒకేసారి ప్రశంసించడం అరుదైన విషయం కాగా, వారి మధ్య నన్ను కూర్చోబెట్టుకోవడం, అలా ఫోటో తీయిచుకోవడం జీవితంలో మరపురాని అనుభూతి.
గతేడాది 8 చిత్రాలు: 2017 నాకు మరచిపోలేని సంవత్సరం. తెలుగులో ఖైదీ నంబర్–150, నేను లోకల్, రారండోయ్ వేడుక చూద్దాం, దువ్వాడ జగన్నాథమ్, జయజానకి నాయక, జైలవకుశ, ఉన్నది ఒక్కటే జిందగీ, మిడిల్ క్లాస్ అబ్బాయి చిత్రాలకు సంగీతం అందించడం ఒక ఎత్తైతే ఆ చిత్రాల్లో పాటలన్నీ హిట్ కావడం మరో ఎత్తు. దీనిపై మీడియా అభినందించడం సంతోషంగా ఉంది అని దేవీశ్రీప్రసాద్ పేర్కొన్నారు. చిత్రం విడుదలకు ముందు వరుసగా ఆ చిత్రంలోని పాటలను వారానికొక్క సింగిల్ ట్రాక్‌ను విడుదల చేయడం ఖైదీనంబర్–150 తో మొదలైంది. ఇప్పుడు అదే ట్రెండ్‌ను అందరూ ఫాలో అవుతున్నారు. అదే విధంగా లిరిక్ వీడియోలో సాంకేతిక వర్గం, సంగీత కళాకారుల ఫొటోలను, కాన్సెప్ట్‌ను, గ్రాఫిక్స్‌తో కలిపి విడుదల చేయడం అన్న ట్రెండ్‌ను శ్రీకారం చుట్టింది డీఎస్‌పీనే. ప్రస్తుతం ఆయన సంగీతం అందిస్తున్న సామి–2 చిత్రంలో పాటలన్నీ సూపర్‌గా వచ్చాయని, అందుకు కారణం దేవీశ్రీప్రసాద్ అంకితభావం, శ్రమేనని చిత్ర యూనిట్ అభినందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment