Devi Sri Prasad Entry In Tamil TV Music Show:బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వనున్న దేవీశ్రీ - Sakshi
Sakshi News home page

బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వనున్న దేవీశ్రీ

Published Sat, Mar 13 2021 11:30 AM | Last Updated on Sat, Mar 13 2021 1:30 PM

Devi Sri Prasad Emtry Into Tamil Musical Tv Show - Sakshi

దేవీ శ్రీ ప్రసాద్‌...పరిచయం అక్కర్లేని పేరు. రాక్‌స్టార్‌గా పాపులర్‌ అయిన దేవీ.. తాజాగా ఈ ఏడాది విడుదలైన ఉప్పెనతో మరో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. గత కొన్నాళ్లుగా సరైన హిట్‌ లేని దేవీకి ఉప్పెన మంచి బూస్టప్‌ ఇచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా విడుదలకు ముందే ఉప్పెన పాటలు సూపర్‌హిట్‌గా నిలిచాయి. ఉప్పెన అందించిన విజయంతో ఇప్పుడు టెలివిజన్‌లోనూ సందడి చేసేందుకు రెడీ అయ్యాడు ఈ యంగ్‌ మ్యూజిక్ డైరెక్టర్.

తన ఎనర్జిటిక్‌ పర్ఫార్మెన్స్‌తో  స్టేజ్‌ షోలలో దుమ్ము రేపే దేవీ..ఇప్పుడు బుల్లితెరపై ఎంట్రీ ఇస్తున్నాడు. 'రాక్ స్టార్'‌ పేరుతో రానున్న సరికొత్త టీవీ షోకు దేవీ శ్రీ సారథ్యం వహించనున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమోను 'జీ తమిళ్' ఛానెల్ విడుదల చేసింది. త్వరలోనే బుల్లితెరపై ఈ షో ప్రసారం కానుంది. దేవీ అందించే ఎనర్జీతో షో సూపర్‌హిట్‌ కావడం ఖాయమని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 

చదవండి : (అందుకే దేవిశ్రీని రాక్‌స్టార్‌ అనేది!)
(‘జాతి రత్నాలు’ టీమ్‌కి భారీ షాక్, తొలి రోజే ఇలా...‌)
|

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement