Allu Arjun: Pushpa Movie Fourth Song To Release Date Out- Sakshi
Sakshi News home page

Pushpa Update: గుబురు గ‌డ్డం, పొడ‌వైన జుట్టుతో బన్నీ.. ఫోటో వైరల్‌

Published Sun, Nov 14 2021 1:11 PM | Last Updated on Sun, Nov 14 2021 2:08 PM

Pushpa Movie Fourth Song To Release Date Out - Sakshi

సుకుమార్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ పార్ట్‌ 1..  పుష్ప ది రైజ్ డిసెంబర్‌  17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌ వేగం పెంచారు మేకర్స్‌. ఇప్పటికే  ఈ సినిమా నుంచి రెండు మూడు పాటలు విడుదల కాగా, తాజాగా నాలుగో పాట విడుదల తేదిని ప్రకటించింది చిత్రబృందం. ‘ఏ బిడ్డ ఇది నా అడ్డ‌’అంటూ సాగే ఈ పాట  న‌వంబ‌ర్ 19న‌ విడుద‌ల చేయ‌బోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. 

ఈ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే అందులో బ‌న్నీ గుబురు గ‌డ్డం, పొడ‌వైన జుట్టుతో ఎర్ర‌టి నిలువు బొట్టు పెట్టుకుని సోఫాలో స్టైల్‌గా కూర్చున్నాడు. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement